Others

యథాశక్తి తథాభక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దైవం సృష్టించిన మానవులకు కర్మానుసారం అన్నీ లభించినా తృప్తి అనే అలౌకికభావం అందదు. ఇంకా ఏదో కావాలనే తపనతో, అందు నిమిత్తం ఎలాంటి అకృత్యాలకైనా వెనుదీయని మనిషి, ఇతరులను సాధిస్తూ, బాధిస్తూ, స్వార్థపూరిత వ్యవహారాలతో సతమతమవుతూ ఉంటాడు. కృత్రిమ భక్తితో, ఆడంబరాలతో, ఆయనను మెప్పించాలని రకరకాల పూజా పునస్కారాలు, తీర్థయాత్రలు, వరాలకోసం చేస్తూ ఉంటూ తీరా అవి లభించకపోతే నిరాశతో కృంగిపోతూ ఉంటారు. సుఖసంతోషాలలో వున్నవారికి దైవచింతన ధ్యాసే ఉండదు. కష్టాలు ఎదురైతే హఠాత్తుగా పరమాత్మ ఆశ్రయం ఆశిస్తారు. ధనికులు హుండీలలో అపరిమితమైన కానుకలు వేస్తే తమకు అందనిదేదీ ఉండదని భావిస్తూ, నిరుపేదలను నిర్లక్ష్యం చేస్తూ, దానధర్మాలకు దూరంగా ఉంటారు. ఇటువంటివారికి భగవంతుని కృప కోల్పోతున్నామనే జ్ఞానం ఉండదు. నిర్మల భక్తి, అంకితభావ సేవలు ఉంటే చాలంటూ కేవలం పత్రం పుష్పం ఫలం తోయాలతో భక్తులను అనుగ్రహిస్తాడు ఆ సర్వాంతర్యామి.
పురాణకాలంలో పరమ భాగవతోత్తములందరూ తమ హృదయార్పణలతో, ఆశ ప్రసక్తి లేకుండా దైవచింతనతో కాలం గడుపుతూ, సామాన్యులుగా జీవిస్తూ అసాధారణమైన కృతులను జనావళికి అందిస్తూ పుణ్యమూర్తులుగా కీర్తిగాంచారు. వారే పురందరదాసు, రామదాసు, అన్నమయ్య, మీరాబాయి, సక్కుబాయి, భక్తతుకారం, పోతన, త్యాగయ్య.. ఇహలోక భోగచింతన లేనివారై భక్తి మార్గదర్శకులుగా యుగయుగాలలో ఆదర్శప్రాయులై భగవదార్చనకు మించిన మానసిక ఆనందం లేదనేలా మానవాళికి నీతి బోధలు చేసారు. అనేక అంశాలను పాఠాలుగా వారి రచనలలో మలచి, గానం చేసిన వాగ్గేయకారులు వారే. మనిషి మంచి నడతతో, మంచి పనులతో, పరోపకారాలతో దేవుడికి దగ్గరై యథాశక్తితో ఆయనను అర్చిస్తే లోటంటూ ఎరుగని జీవితంలో ముక్తిపథంలో పయనిస్తారు.

-యం.వి.రమణకుమారి