Others

సమస్త పాపహారిణి గౌరీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతావనిలో అనాదిగా వివిధ పండగలతోపాటు, వ్రతాలు, నోముల ఆచరణ సత్సాంప్రదాయంగా ఉంది. ప్రతి వ్రతమూ ప్రత్యేకతను సంతరించుకుని, ప్రత్యేక ఆచరణలు ఏడాది పొడుగునా ఆచరించ బడతాయి. అలాంటి వాటిల్లో కౌటుంబికులు, సౌభాగ్యవతులు, కన్యలు ఆచరించే హరితాళికా గౌరీ వ్రతం ఒకటి. శ్రమ లేకుండా సంపూర్ణ ఫలమిచ్చే వ్రతం గురించి చెప్పాలని కోరగా, శంకరుడు, పార్వతికి ఈవ్రత విధానాన్ని ఉపదేశించినట్లు పురాణ కథనం. ఈ వ్రతాచరణ ద్వారానే గిరి పుత్రిక తనను పొందినట్లు పరమేశ్వరుడు, పార్వతికి స్పష్టం చేసినట్లు కథనం. సమస్త పాపాలను హరించ గలిగే హరితాళిక ప్రతాచరణ గురించి ధర్మసింధు వివరిస్తుంది. మహారాష్టలో స్మార్త తెగకు చెందిన స్ర్తిలు, రాజపుటానాలో సౌభాగ్యవంతులు హరితాళిక వ్రతం శాస్త్ర విధిగా చేస్తుండగా, వంగదేశంలో ఈ వ్రతాన్ని మాఘమాసంలో వరద చతుర్థిగా చేస్తారు. ఉండ్రాళ్ళ తద్దిలో హరితాళికా వ్రతం అనురూపం ఉంది. వ్రతోత్సవ చంద్రిక ఆధారంగా వట సావిత్రి వ్రతంలో ఉన్న శిక్షే ఇందులో ఉంది. పార్వతీదేవికి, ఒక రాచకూతురు, పూర్తి చేయని నోమును పూర్తి చేయడానికి, భాద్రపద శుద్ధ తదియ నాడు పదహారు కుడుములు వండి నైవేద్యం పెట్టి, నోము పట్టినందున ఈదినానికి ‘‘పదహారు కుడుముల తద్ది’’యని పేరు తెలుగునాట వచ్చింది. భాద్రపద శుద్ధ తృతీయ సందర్భంగా ఉదయాత్పూర్వమే నిద్ర లేచి, సువాసినులు మంగళ స్నానాలు ఆచరించి, పూజా గృహాన్ని గోమయంతో శుద్ధి చేసి, ముగ్గులు పెట్టి, సఖీయుక్తమైన పరమ శివుని చిత్రపటాన్ని, లేదా శివలింగాన్ని ఉంచి, అక్షతలు, పసుపు, తమలపాకులు, వక్కలు, వత్తులు, దారాలు, అగరువత్తులు, పంచామృతాలు, నాణాలు తదితర పూజా సామగ్రితో ఉత్తరేణి ఆకుల కంకణాలు ధరించి, ఉత్తరేణి ఆకులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారం. ముఖ్యంగా ఈరోజు చప్పిడి వంటకాలు, ఉప్పు, పులుపు, కారం, నూనె రహిత తిను బండారాలు మాత్రమే ఆరగించే సాంప్రదాచారణలో భాగంగా, ముత్తయిదువలను ఆహ్వానించి, విధివిధాన సామూహిక పేరంటాలు జరుపుకుంటారు. రాత్రి జాగరణ చేస్తారు. భాద్రపద శుక్ల తదియ నాడే మునువులలో నాలుగవ వాడై, సమస్త భూమండలాలాన్ని జయించి, మనువైన తామస మనువు పేరున తామసమన్వంతరాది దినంగా భావించ బడుతూ, గజేంద్ర మోక్ష కథ తామసమత్వంతమందే జరిగినట్లు భావవత పురాణం తెలుపుతున్నది.

-సంగనభట్ల రామకిష్టయ్య....9440595494