Others

గ్రెనేడ్ లాంఛర్లతో రాజ్యాధికారం సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విప్లవకవి వరవరరావు, పౌరహక్కుల ఉద్యమకారులు గౌతమ్ నవలఖా, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్‌సాల్వేస్‌ల ‘గృహ నిర్బంధం’ అనంతరం దేశంలో మావోయిస్టుల అనుకూలురు, హింసకు వ్యతిరేకులు చర్చల్లో మునిగి తేలుతున్నారు. దండకారణ్యంలో సాయుధ పోరా టం చేస్తున్న మావోయిస్టులకు నైతిక బలాన్ని అందించడమేగాక వారి ‘్థంక్ ట్యాంక్’గా వీరు వ్యవహరిస్తున్న వైనమిప్పుడు బట్టబయలైంది. ఆ ఆధారాలు బూటకమని, కల్పితమని, కక్ష సాధింపు చర్యలని వారి అనుకూలురు వాదిస్తున్నారు. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ ద్వంద్వ వైఖరి కనబరచకపోతే మావో ఉద్యమం ముందుకు సాగదు. ఆ విషయం జగమెరిగిన సత్యంగా గుర్తించినవారు మరికొందరు కనిపిస్తారు.
ఇప్పుడు అత్యాధునిక గ్రెనేడ్ లాంఛర్లు, తుపాకులు, వాటి క్యాటలాగులు, వాటి ధర, అవి లభ్యమయ్యే ప్రాంతాలు, ఏజెంట్ల సమాచారం, వాటి సామర్థ్యాన్ని తెలిపే వివరాలు ఇలా అనేక అంశాలు ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న వారివద్ద లభ్యం కావడం, మావోయిస్టులకు వారిమధ్య జరిగిన సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆలోచనలు పంచుకోవడం బయటపడ్డాక అది బూటకమని, సృష్టించిన - కల్పిత గాథలని కొట్టిపారేసే ‘కొత్త బృందం’ ఒకటి తయారైంది. జాతీయ స్థాయి టెలివిజన్ ఛానళ్ళలో వీరు మావోయిస్టులను, గృహనిర్బంధంలోగల వారిని కాపాడేలా వాదనలు ‘మానవ హక్కుల’ మాటున వినిపిస్తున్నారు.
పేదలు, దళితులు, ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమిస్తున్నామని చెప్పుకునే గృహ నిర్బంధంలోని వారికి చైనా, రష్యా, అమెరికాలో తయారైన అత్యాధునిక ఆయుధాలతో ఏం పని? వాటి క్యాటలాగులు, వాటి సామర్థ్యం, వాటి ధర తదితర అంశాలు వారికెందుకు? ఆ తుపాకులు, గ్రెనేడ్ లాంఛర్లు, పిస్తోళ్ళు సరఫరా చేసే ఏజెంట్ల వివరాలు వారి దగ్గర ఎందుకున్నాయి? ఈ రకమైన ఆధునిక ‘ఆయుధ భాష’ హక్కుల పరిరక్షకులకు అవసరమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చాలామంది లేవనెత్తుతున్నారు. వీటికి వారి వద్ద సమాధానాలు లేవు. ఆ సమాచారం కలిగి ఉండటం నేరమా?- అని ఎదురుదాడికి కొందరు దిగుతున్నారు.
వాస్తవానికి గతంలో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందని మావో అనుకూలురు, వారి ‘్థంక్ ట్యాంక్’, గెరిల్లాలు నినదించారు. తాజాగా వారి థింక్ ట్యాంక్ ఒక అడుగుముందుకేసి గ్రెనేడ్ లాంఛర్ల ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందని ప్రతిపాదిస్తున్నారు. అందులో భాగంగానే ఈ లాంఛర్లు, ఆధునిక తుపాకుల సమాచారం, వాటిని సరఫరా చేసే ఏజెంట్ల వివరాలు సేకరించి మావోయిస్టుల ముందుపెట్టారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హతమార్చిన రీతిలో ప్రధాని మోదీని అడ్డుతొలగిస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయన్న ఆశావహ మాటను మావోయిస్టులకు ఈ ‘్థంక్ ట్యాంక్’ చేరవేసింది.
ప్రజాస్వామ్యంపై వీసమెత్తు విశ్వాసం లేదని ప్రకటించే మావోయిస్టులకు అవసరమైన విధానాలను, పద్ధతులను, పరికరాలను ఈ ‘్థంక్ ట్యాంక్’ సమకూరుస్తోంది. అందుకే వీరిని ‘అర్బన్ నక్సల్స్’ అని పిలుస్తున్నారు. దండకారణ్యంలోని మావోయిస్టులకన్నా ఈ అర్బన్ నక్సల్స్ చాలా ప్రమాదకరమని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. వీరు టెర్రరిస్టుల ఒకప్పటి గురువు ఒసామా బిన్ లాడెన్ మాదిరి ఉద్యమంలో నేరుగా పాల్గొనకుండా కథ నడిపిస్తూ వర్తమాన ప్రజాస్వామ్య రాజ్యాన్ని, వ్యవస్థను ఆధునిక రష్యా, చైనా, అమెరికా ఆయుధాలతో ఎలా కూల్చాలో చెబుతున్నారు. ఆధునిక ఆయుధాల సేకరణ విషయంలో మాట్లాడే పూర్తి అధికారం విప్లవకవి వరవరరావుకే ఉందన్న విషయం సైతం వారి లేఖల్లోనే బయటపడిందని మహారాష్ట్ర పోలీసు అత్యున్నతాధికారి పత్రికలవారితో చెప్పారు. అనంతరం అనేక ఆధారాలు, పత్రాలు ‘రిపబ్లిక్ టివీ’ సహా మరికొన్ని చానళ్లు దేశ పౌరుల దృష్టికి తీసుకొచ్చాయి. ఆ ప్రసార మాధ్యమాలు వెలువరిస్తున్న విషయాలు వింటే ఒళ్లుగగుర్పొడుస్తుంది. ఎంత భయంకరమైన ‘కుట్ర’కు పౌరహక్కుల నేతలు పాల్పడ్డారో తెలిసి ఆశ్చర్యానికి గురికాక తప్పదు.
ప్రధాని మోదీని రాజీవ్ గాంధీలా లేదా అంతకన్నా క్రూరంగా చంపే ఆలోచన ప్రజాస్వామిక వాదుల గొంతు దిగని అంశం. తమకు ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేదని బహిరంగంగా పేర్కొంటూ, ఆయుధాలతో తిరగబడి ఈ వ్యవస్థను, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఆ పని 2030 లేదా 2050లోగా పూర్తిచేస్తామని కంకణం కట్టుకున్న మావోయిస్టులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వారి ‘్థంక్ ట్యాంక్’గా హక్కుల సంఘాల పేర కొనసాగుతూ భయంకరమైన కుట్రలో భాగస్తులు కావడం ఏ రకంగా సమర్ధనీయం? ఆధారాలు లభించాక అరెస్టుచేస్తే మేధావుల హక్కులను హరిస్తున్నారని భూమ్యాకాశాలు దద్దరిల్లేలా ఉద్యమిస్తే అదెలా అభినందనీయమవుతుంది?
మావో కాలంనాటి ‘లాంగ్ మార్చ్’కు కాలం చెల్లింది. వర్తమాన కాలానికనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో గెరిల్లాయుద్ధ తంత్రంతో కల్లోలం సృష్టించి విముక్తి ప్రాంతాలను పటిష్టపరచుకుని అంతిమంగా రాజ్యాధికారాన్ని గ్రెనేడ్ లాంఛర్ల ద్వారా సాధించవచ్చని కొత్త వ్యూహాన్ని మావోయిస్టులకు ప్రతిపాదించి దాని ప్రణాళికను అందజేసి అందుకు తగిన ‘గ్రౌండ్ వర్క్’ పూర్తిచేసి మావోయిస్టు కేంద్ర నాయకత్వానికి పంపితే ఎన్నికైన ప్రభుత్వం మిన్నకుండాలని భావిస్తే అది భావ దారిద్య్రమే తప్ప మరొకటి కాదు.
ఎన్ని మెలికలుపెట్టి తమను తాము సమర్ధించుకునే వాదనలు వినిపించినా వాటికి మాన్యత ఏ మాత్రం కనిపించదు. నిషేధిత మావోయిస్టు పార్టీతో పూర్తిగా అంటకాగి వారికి అన్నివిధాలా సహకరిస్తూ ఆర్థిక, మానవ వనరులను సమకూరుస్తూ, ఆధునిక ఆయుధాలను సమకూర్చే బాధ్యత భుజాలపై వేసుకుని వేగవంతంగా ఆ పని పూర్తిచేసి, వేగంగా దేశంలో విప్లవం విజయవంతం చేయడానికి, అన్ని మర్యాదలను కాలరాసేందుకు సైతం వెనుకాడకుండా దశాబ్దాలపాటు పరిశ్రమిస్తూ ఉంటే ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోక, అరెస్టులు చేయకుండా మిన్నకుండి ‘తమాషా’ చూస్తూ కూర్చోవాలి తప్ప ‘దాడులు’చేయరాదన్న ఆలోచనలతో కొందరు ఉంటే అదెలా సబబు?
గుట్టు బయటపడ్డాక హక్కుల సంఘాల వారు, అరెస్టయినవారి అభిమానులు ‘రూల్ ఆఫ్ లా’గూర్చి ఇల్లెక్కి అదే పనిగా గొంతు చించుకుంటున్నారు. వివిధ మాధ్యమాల్లో వారి ‘గొంతు’ వినిపిస్తూ వుంది. ఏ కొంచెం ఇంగిత జ్ఞానంగల వారైనా- వారి వ్యవహారం చూసి నవ్వుకుంటున్నారు. ప్రధాని హత్యకు ‘కుట్ర’పన్నారని తెలిసి, ఆ కుట్రలో ఏదోమేర భాగస్వాములైన వారిని అరెస్టుచేయడం, హక్కుల ఉల్లంఘనగా, అణచివేతగా పరిగణిస్తామని భూనబోనాంతరాలు ఏకం చేస్తే అదెలా నాగరిక, ప్రజాస్వామ్య లక్షణమవుతుంది?
జిఎం-94 గ్రెనేడ్ లాంఛర్, ఎం-60 మెషన్‌గన్స్, నైట్‌విజన్ అద్దాలు ప్రమాదకర ఇతర తుపాకులతో మావోయిస్టు సానుభూతిపరుడు రోనా విల్సన్‌కు ఏమి పని? మూడు పేజీల ఆయుధ క్యాటలాగ్‌ను మావోయిస్టులకు ఎందుకు పంపారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ ‘లాజిక్’గా మాట్లాడుతున్నామనుకుంటూ అవి ఎలా అరెస్టుకు ఆధారం (సాక్ష్యం) అవుతాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ప్రధానులు హత్యకావించబడ్డారు. ప్రధాని మోదీ సైతం అలా హత్యకు గురవుతున్నాడని తెలిసి మిన్నకుందామా? అని మావోయిస్టుల కుట్రపై ఆగ్రహంతో ఉన్నవారు ప్రశ్నిస్తున్నారు. అరెస్టయిన ఐదుగురిని కాపాడేందుకు, ప్రజల్లో వారిపట్ల సానుభూతి ప్రోదిచేసేందుకు అనేక ‘ముసుగులు’ ధరించి కొందరు మీడియా ముందుకు వస్తున్నారు. కొందరైతే ‘ఐ యామ్ టూ నక్సల్స్...’ అని ట్వీట్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎన్ని రకాలుగా సానుభూతిని ప్రోది చేయడానికి వీలున్నదో అన్ని ప్రయత్నాలు ఎంతో వేగంగా- ఎంతో శక్తిమంతంగా చేస్తున్నారు. చైనా, అమెరికా, రష్యా, పాకిస్తాన్ ఆయుధాలు నేపాల్ ద్వారా భారత మావోయిస్టులకు అందే ఏర్పాటుచేసే అంశంలో ‘కింగ్ పిన్’గా వరవరరావు వ్యవహరిస్తున్నారని పత్రాల్లో లిఖిత పూర్వకంగా బయటపడినా అది బూటకమని, కల్పితమని వాదించేవారి మానసిక స్థితి ఎలాంటిదో ఇట్టే ఊహించవచ్చు. ప్రజాస్వామ్యం కూలిపోయి మావోయిస్టుల నియంతృత్వ పాలన రావాలని ఆశించేవారు ఇలాగే మాట్లాడతారు. ఇంటర్నెట్ నియంతృత్వానే్న ప్రజలు ఇష్టపడటం లేదు. పాలనాపరంగా నియంతృత్వాన్ని ప్రజలు ఎలా హర్షిస్తారన్న విషయాన్ని వీళ్లు గమనించక పోవడం, పూర్తిగా విడ్డూరం. మావోయిస్టుల థింక్‌ట్యాంక్ ఎంత అమాయకంగా, అనాలోచితంగా వ్యవహరిస్తున్నదో దీనివల్ల తేటతెల్లమవుతోంది, అలాంటివారి ఆటలు ఎలా సాగుతాయి?
*

-వుప్పల నరసింహం 99857 81799