Others

పాపం! రూపాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రవ్యోల్బణం, నల్లధనం
పేదలకందని పాలనాఫలం
సీమాంతర ఉగ్రవాదం
అసంతుష్టి జనం
అంతా అస్తవ్యస్తం
రూపాయికి జబ్బుచేసంది.

టెస్టులు, స్కానింగులు
ఎక్స్‌రేలు, ఎం.ఆర్.ఐ.లు
రాచవైద్యుల రిపోర్టులు
రూపాయికి ఇప్పుడు
ఒక తల రెండు తోకలట
* (‘హెడ్ అండ్ టెయిల్’)

అదనపు తోక కత్తిరించాలని,
అసలు ‘తోకే’వద్దని,
‘తల’చాలని
పలుపలు విధాల రిపోర్టులు.
రూపాయి ఇప్పుడు
ఆపరేషన్ టేబిల్‌పైన.

రాచవైద్యుల
పెద్దనోట్ల రద్దు చికిత్స
ఆపరేషన్ రూపాయికి
‘పరేషానీ’ జనానికి
తోపులాటలు
తొక్కిసలాటలు
గూండాగిరీలు
గుండెల ఆగడాలు
‘నో క్యాష్’ ఎ.టి.యం.లు
దొడ్డిదారిన పారిపోయిన చికిత్స.

కొత్త నోట్లు
సీమోల్లంఘనాలు
చుక్కల్ని ఎక్కిన ధరలు
అగ్గిపుల్ల గీయకనే
‘్భగ్గు’మన్న పెట్రోలు.
మళ్లీ రూపాయికి
ఆపరేషన్
ఇప్పుడు రూపాయికి
రెండువేపులా తోకలే!

తప్పుడు వైద్య నిర్ధారణ
పొరపాటు చికిత్స
తోక బదులు, తలని కత్తిరించారట
ఘనత వహించిన మన వైద్యులు

పాపం! రూపాయి!!
సరైన వైద్యం కోసం
సరైన చికిత్స కోసం
ఆశగా ఎదురుచూస్తోంది.

-కూర చిదంబరం 8639338675