Others

అభినవ త్యాగయ్య ( వెండివెలుగులు-1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘త్యాగయ్య’, భక్తరామదాసు’, భక్తపోతన’వంటి మహాభక్తుల పాత్రలకు, యోగివేమన వంటి సంఘ సంస్కర్త పాత్రకు ప్రాణంపోసిన అభినవ త్యాగయ్య స్వర్గీయ చిత్తూరు ఉప్పల దడియం నాగయ్య.
నాగయ్య పరమభక్తుల పాత్రల్లో జీవించారు. వాటికి ఊపిరిపోశారు. ఆ చిత్రాలు ప్రజాదరణ పొంది నాగయ్యను ఒక నటుడిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాయి.
వయసు మళ్ళినవారి పాత్రలకు, ముసలితనం మూర్త్భీవించిన పాత్రలకు, పెద్దమనిషి తరహా కొట్టొచ్చిన పాత్రలకు, వృద్ధాప్యం పరిపక్వత పొందిన పాత్రలకు ఎక్కువగా నాగయ్య ప్రాణంపోశారు. ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్రలు చిరస్థాయిగా నిల్చిపోవటానికి కారణం ఆయన చూపిన హావభావ ప్రదర్శన. ఉత్తమ నటన.
నాగయ్య జననం 1904 సం.లో గుంటూరు జిల్లా రేపల్లెలో, ఆయన నాటకాలాడే రోజుల్లో భక్తుల పాత్రలను ఇష్టపూర్వకంగా వేసేవారు.
నాగయ్య తొలిసారిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించింది, రోహిణీ వారి ‘గృహలక్ష్మి’ చిత్రం ద్వారా 1938లో. దాన్ని స్వర్గీయ హెచ్.యం.రెడ్డి నిర్మించారు. బి.యన్.రెడ్డి దర్శకత్వంలో నాగయ్య కథానాయకుడుగా ‘వందేమాతరం’, ‘సుమంగళి’, ‘దేవత’, ‘స్వర్గసీమ’ చిత్రాల్లో నటించి ఎనలేని కీర్తిని సంపాదించారు.
హెచ్.యం.రెడ్డి, బి.యన్.రెడ్డి, కె.వి.రెడ్డిగార్లు నాగయ్యలోని నటుడిని వెలికితెచ్చారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో నాగయ్య ‘్భక్తపోతన’, యోగివేమన చిత్రాల్లో నటించారు. ‘యోగివేమన’లో ఆయన నటన అపూర్వం, అద్భుతం. అనితర సాధ్యం. భక్తుల పాత్రలు పోషించడానికి ఆయన పుట్టారనడంలో సందేహం లేదు.
నాగయ్య నటుడే గాదు, గాయకుడు, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు కూడాను. ఆయన నిర్మించి, దర్శకత్వం వహించి, సంగీత బాణీలను కూర్చి, గాయకుడై వాగ్గేయకారుడు ‘్భక్తరామదాసు’లో పాడిన పాటలు అప్పటితరం వారు ఇప్పటికీ మరువలేదు.
‘త్యాగయ్య’, ‘నా ఇల్లు’, ‘్భక్తరామదాసు’చిత్రాలను ఆయనే నిర్మించి, దర్శకత్వం వహించారు.
సాంఘిక, పౌరాణిక, చరిత్రాత్మక, జానపద చిత్రాలు ఎన్నింటినో పెద్ద, చిన్న పాత్రలు మొత్తం కలుపుకుని 300 చిత్రాల్లో నటించారాయన.
తమిళం, కన్నడం, మళయాళం, హిందీ చిత్రాల్లో కూడ నటించారాయన. మూడున్నర దశాబ్దాలపాటు మహానటుడిగా విరాజిల్లిన నాగయ్య ‘పద్మశ్రీ’ బిరుదునందుకున్న దక్షిణాది నటులలో ప్రథముడు.
నటన ద్వారా ఎంతో ఎత్తుకు ఎదిగి సన్మానాలు, కనకాభిషేకాలు పొందారాయన.
కంఠంలో శ్రావ్యత, నటనలో హుందాతనం, సంభాషణలు చెప్పటంలో చాతుర్యం, సందర్భానికి అనుగుణంగా చేసిన అభినయం, ఏ పాత్రనైనా సులువుగా పోషించగల సామర్థ్యం, ఇవి నాగయ్య సుగుణాలు, సులక్షణాలు.
లక్షలకొద్దీ డబ్బు గడించినా పైసా దాచుకోని ఉదారస్వభావం కలవాడాయన. ఆయన చేసిన ధానధర్మాలు ఎన్నో. లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న ఆయన ఆఖరు దశలో వంద రూపాయలకోసం నటించారు.
ఆయన నటించిన సాంఘిక చిత్రాల్లో ‘వందేమాతరం’, సిరిసంపదలు, ‘తోడునీడ’, ‘కానిస్టేబుల్ కూతురు, ‘మూగనోము’, ‘రాము’, ‘శాంతి నివాసం’, ‘పూలరంగడు’, ‘ఆత్మబలం’ ‘మా నాన్న నిర్దోషి’, ‘మీనా’, ‘జగమేమాయ’ మొ. ఉన్నాయి.
‘కంచుకోట’, ‘స్వర్ణమంజరి’వంటి జానపద చిత్రాల్లోను, ‘లవకుశ’, ‘బాలభారతం’వంటి పౌరాణిక చిత్రాల్లోను ఆయన నటించారు. ఆయా పాత్రల్లో జీవించారు, రాణించారు, మెప్పించారు. ఆయన వంటి నటులు నేడు అరుదు.
స్వాతంత్య్రోద్యమాన పాల్గొని జైలుకువెళ్ళారు. మహామేధావి, మహానటుడు, మహామనిషి, మానవతావాది అయిన నాగయ్య డిసెంబరు 30, 1973వ తేదీన స్వర్గస్థులైనారు.

- డా.దేశిరాజు లక్ష్మీనరసింహారావు సెల్: 9985844558