Others

‘గులాబీల తావులీనే..’ (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లలితా శివజ్యోతి బ్యానర్‌పై శంకరరెడ్డి నిర్మించిన ‘చరణదాసి’చిత్రం 1956లో విడుదలయ్యింది. రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, అంజలి, జానకి, రేలంగి, రంగారావు, రమణారెడ్డి, సూర్యకాంతం వగైరా హేమాహేమీలు ఇందులో పాత్రధారులు కాగా దర్శకత్వం తాతినేని ప్రకాశరావు. చిత్ర ప్రారంభంలో వచ్చే ‘గులాబీల తావులీనే’ పాట నాగేశ్వరరావు, సావిత్రిలపై చిత్రీకరించబడింది. దూరదూరంగా వుండి చరణాలు పాడుతూ (ఇప్పటి సినిమాల్లా కాదు) చివరకు దగ్గరగా వచ్చి ఇద్దరూ గొంతుకల్పుతారు. ఇది చిన్న పాట కాని పాట పూర్తి అయ్యాక ఇంకా పాట వుంటే బాగుండునే అనిపించేటంతగా రాజేశ్వరరావు సంగీతమూ, ఘంటసాల, లీలల గానమూ మనలను ఎక్కడికో తీసుకువెళ్తాయి. తమిళ వెర్షన్‌లో కూడా సావిత్రి, నాగేశ్వరరావు కాగా ఘంటసాల, లీలే పాడారు. ఈ చిత్రం స్వప్న సన్నివేశంలో ‘రామారావు’ రాముడుగా అంజలి సీతగా కనబడతారు. ఆ సన్నివేశం ద్వారా ప్రోత్సాహం పొందిన శంకర్‌రెడ్డి తర్వాతి చిత్రంగా ‘లవకుశ’ నిర్మించడమూ, ఘన విజయం సాధించడమూ చరిత్ర. ‘లవకుశ’ సంగీతం సమకూర్చిన ‘ఘంటసాల’కు ఈనాటికీ జనం నీరాజనాలు పడ్తున్నారు.

- డొక్కా మృత్యుంజయుడు