Others

వైఎస్ జగన్ పాత్రలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న యాత్ర సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం ఇప్పటికీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరోలు సూర్య, లేదా కార్తీ నటిస్తారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ పాత్రకోసం టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆయన క్రేజ్ ఈ సినిమాకోసం వాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ అయితే జగన్ పాత్రకు బాగా సూట్ అవుతాడని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం జగన్ పాత్రకోసం విజయ్‌ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయటూ. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల చేయనున్నారు. మరి ఈ పాత్రకోసం విజయ్ ఓకే అంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

--శ్రీనివాస్ ఆర్.రావ్