Others

కోలీవుడ్‌పై కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బొద్దుగుమ్మ రాశీఖన్నా ఆ తరువాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈమధ్య కాస్త వరుస పరాజయాలు రావడంతో కెరీర్ పరంగా వెనుకబడింది. దాంతో కాస్త గ్లామర్ డోస్ పెంచి మళ్లీ అవకాశాల బాట పట్టింది. మరోవైపు కోలీవుడ్‌లో కూడా నటిస్తున్న ఈమెకు అక్కడ నటించిన ‘ఎమ్మిక్కీ వొదగల్’ సినిమా మంచి విజయం సాధించడంతో అవకాశాలు క్యూ కడుతున్నాయట. తెలుగులో పరిస్థితి అంతగా లేకపోవడంతో కోలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే రెండు క్రేజీ చిత్రాల్లో అవకాశాలు కొట్టేసిన ఈ బ్యూటీ త్వరలోనే చెన్నయ్‌కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉందట.

--శ్రీనివాస్ ఆర్.రావ్