Others

మీరు మీరుగా ఉండడమే స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనువాదం: భరత్
*
దేనినుంచో లభించే అసలైన స్వేచ్ఛ కాదు. మీరు చెయ్యాలనుకున్నది చెయ్యగల స్వేచ్ఛ కూడా నేను చెప్తున్న స్వేచ్ఛ కదా. నా దృక్పథంలో స్వేచ్ఛ అంటే ‘‘మీరు మీరుగా ఉండడమే’’. అంతేకానీ, దేనినుంచో స్వేచ్ఛ పొందడమనేది ఒక విషయమే కాదు. నిజానికి, అలాంటి స్వేచ్ఛ ఎందుకంటే, అది ఎవరో మీకు ఇచ్చిన స్వేచ్ఛ. అంటే మీరు ఇతరులపై ఆధారపడుతున్నారనే భావన మీకు లభించిన స్వేచ్ఛలో ఉన్నట్లే. దానికి మీరు కృతజ్ఞులుగా ఉండాల్సిందే. లేకపోతే, ఆ స్వేచ్ఛ మీకు లభించదు.
కాబట్టి మీరు చెయ్యాలనుకున్నది చెయ్యగల స్వేచ్ఛ కూడా అసలైన స్వేచ్ఛ కాదు. ఎందకుంటే, ‘చెయ్యాలి’ అనే కోరిక మీ మనసలో కలిగింది కాబట్టే మీరు ఆ పనిచేశారు. అంటే మీ మనసే మీ బానిసత్వానికి కారణమని తెలుస్తోంది.
నిజానికి, ఎలాంటి ఎంపికలు లేని ఎరుక నుంచి లభించేదే అసలైన స్వేచ్ఛ- అలాంటి స్వేచ్ఛ దేనిపైనా ఆధారపడి ఉండదు. అంటే, అది కేవలం మీరు మీరుగా ఉండడమే. మీరు ఇప్పటికే అలా ఉన్నారు. ఎందుకంటే, మీరు అలాంటి స్వేచ్ఛతో జన్మించారు. కాబట్టి, అలాంటి స్వేచ్ఛ దేనిపైనా ఆధారపడదు. అలాంటి స్వేచ్చను మీకు ఎవ్వరూ ఇవ్వలేరు. అలాగే ఎవ్వరూ దానిని మీ నుంచి తీసకోలేరు. ఒక ఖడ్గం మీ తలను నరకగలదు. కానీ, అది మీ ఉనికిలో ఉన్న స్వేచ్ఛను ఏమీ చెయ్యలేదు.
దీనినే మరొక విధంగా మీరు సహజంగా ఉన్న మీ అస్తిత్వపు ఉనికి కేంద్రంలోనే ఉన్నారని కూడా చెప్పొచ్చు. బయట ఉన్న దానితో దానికి ఎలాంటి సంబంధం లేదు. దేని నుంచో లభించే స్వేచ్ఛ బయట ఉన్న వాటిపై ఆధారపడి ఉంటుంది. అలాగే, ఏదైనా చేసేందుకు కావలసిన స్వేచ్ఛ కూడా బయట ఉన్న వాటిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, బయట ఉన్న వాటిపై ఏ మాత్రం ఆధారపడకుండా ఉన్న స్వేచ్ఛ మాత్రమే అసలు సిసలైన, స్వచ్ఛమైన స్వేచ్ఛ.
మీరు స్వేచ్ఛగా జన్మించారు. కానీ ఆ విషయాన్ని మరచిపోయేంతగా మీరు నిబద్ధీకరించబడ్డారు. ఆ నిబద్ధీకరణలన్నీ మిమ్మల్ని కీలుబొమ్మగా చేశాయి. మీ తీగలన్నీ మరోకరి చేతిలో ఉంటాయి. ఒకవేళ మీరు క్రైస్తవులైతే కీలుఒమ్మ అయినట్లే. మీ తీగలు దేవుడి చేతిలో ఉంటాయి. వాడు ఎక్కడా కనిపించడు. కానీ, వాడు ఉన్నట్లుగా మీలో భావన కలిగించేందుకు వాడి ప్రతినిధులుగా ప్రవక్తలు, మహాపురుషులు ఉంటారు. నిజానికి వారు దేనికీ ప్రతినిధులు కారు. వారందరూ అహంకారపరులే. వారి అహం ఎప్పుడూ మిమ్మల్ని కీలుబొమ్మ స్థాయికి తగ్గించాలనే కోరుకుంటుంది.
పది ఈశ్వరాజ్ఞలు మీకిచ్చి మీరేం చెయ్యాలో వారే నిర్ణయిస్తారు. అంతేకాదు, మీ వ్యక్తిత్వాన్ని ఒక క్రైస్తవునిగా, యూదునిగా, హిందువుగా, మహమ్మదీయునిగా వారే నిర్ణయించి, మీరు మొయ్యలేని జ్ఞాన భారాన్ని మీ పసితనం నుంచే వారు మీపై వేస్తారు. దానితో సహజంగానే మీ ఆత్మ అణగారిపోతుంది. కాబట్టి, వారి నిబద్ధీకరణలనుంచి మీరు తప్పించుకోగలిగితే మీరు క్రైస్తవులు, మహమ్మదీయులు, సామ్యవాదులు, ఫాసిస్టులు కాదని తెలుసుకోగలరు.
పుట్టుకతోతే మీ రు ఏ క్రైస్తవునిగానో, మహమ్మదీయునిగానో హిందువుగానో జన్మించలేదు. అతి నిర్మలమైన, అమాయకమైన చైతన్యంతో మీరు జన్మించారు. మీరు ఎప్పుడూ అలాంటి నిర్మలమైన, అమాయకమైన చైతన్యంతో ఉండడమే నా దృష్టిలో ‘స్వేచ్ఛ’ అంటే.
స్వేచ్ఛానుభవమే జీవిత పరమావధి. దానికి మించినదీ ఏదీ లేదు. అసలైన స్వేచ్ఛలోనే అనేక పుష్పాలు వికసిస్తాయి. మీ స్వేచ్ఛావికాసమే ప్రేమ. ఆ ప్రేమ వనంలోనే కరుణ సుమాలు వికసిస్తాయి.
అమాయకత్వమే మీ ఉనికి సహజ స్థితి. జీవితంలోని అతి విలువైనవన్నీ అందులోనే వికసిస్తాయి. కాబట్టి, స్వేచ్ఛను ఎపుడూ ముడిపెట్టకండి. ఎందుకంటే, చెయ్యాలనుకున్నద మీరు కాదు మీ మనసు. ఏదో చెయ్యాలనే కోరికే మిమ్మల్ని బానిసత్వంలోకి నెట్టేస్తుంది. కాబట్టి, స్వేచ్ఛ గురించి నేను చివరిగా చెప్పేది ఏమిటంటే, మీతో అందమైన పరమ ప్రశాంత నిశ్శబ్దంలో లభించే పరమానందంలో మీరు మీరుగా ఉండమని.
పూర్తి స్వేచ్ఛతో ఉండాలనుకునేవారు పూర్తి ఎరుకతో ఉండాలి. ఎందుకంటే, మన అచేతన్వంలో బానిసత్వ భావన పాతుకుపోయింది. ఎవరైనా మిమ్మల్ని నాశనం చెయ్యగలరేమో కానీ, మీరు అవకాశం ఇవ్వనంతవరకు మీ స్వేచ్ఛను మీరు పోగొట్టుకున్నపుడే అది మీ నుంచి పోతుంది. మీరు మీరుగా ఉండే బాధ్యతనుంచి తప్పుకుని ఎవరిపైనో ఆధారపడాలనుకుంటారు. ఆ కోరికే మీ స్వేచ్ఛను హరిస్తుంది.
మీ పట్ల మీరు బాధ్యత వహించిన మరుక్షణం.. అది అంత సులభమైన విషయం కాదు, పూల పానుపు కాదు. గులాబీలు ఉన్న చోటే ముళ్ళు కూడా ఉంటాయి. మధుర క్షణాలు ఉన్నచోటే చేదు అనుభవాలూ ఉంటాయి. గులాబీలు - ముళ్ళు, పగలు-రాత్రి, తీపి-చేదు, వేసవికాలం-శీతాకాలం... ఇలా వ్యతిరేక ధృవాలన్నీ సమపాళ్ళలోనే ఉంటాయి. అపుడే జీవితం సమతుల్యంగా సాగుతుంది. కాబట్టి అందాలు, ఆనందాలు, కలలు, కన్నీళ్ళు, బరువులు, బాధ్యతలతో కూడిన జీవితాన్ని అంగీకరిస్తూ దానిపట్ల పూర్తి బాధ్యత వహించేందుకు సిద్ధపడినవారు మాత్రమే స్వేచ్ఛగా ఉండగలరు.
*
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.