Others

కుర్తీతో స్టైల్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి తరం అమ్మాయిలు రోజూ పంజాబీ డ్రస్, కుర్తీ- లెగ్గిన్, చుడీదార్ వంటి రొటీన్ డ్రస్సులనే వేసుకోవడానికి మొగ్గుచూపరు. అలాగని మధ్యతరగతి అమ్మాయిలు వెస్ట్రన్ డ్రస్సుల జోలికి పోరు. మరి అలాంటి అమ్మాయిలు రోజూ కాలేజీలకు, చిన్న చిన్న పార్టీలకు కుర్తీతోనే స్టైలిష్‌గా, అందంగా కనిపించవచ్చు. మామూలుగా మార్కెట్లో మంచి మంచి కుర్తీలు దొరుకుతున్నాయి. వీటికి మిక్స్ అండ్ మ్యాచింగ్‌గా లెగ్గిన్స్, చుడీ.. వంటి బాటమ్స్ కాకుండా.. తక్కువ ఖర్చుతో, చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి కుర్తీతో స్టైలిష్‌గా ఎలా మెరిసిపోవచ్చో చూద్దాం..
లాంగ్ కుర్తీ..
ఇప్పుడు మార్కెట్లో లాంగ్ కుర్తీలు చాలానే లభిస్తున్నాయి. వీటికి బాటమ్‌గా చాలామంది లెగ్గిన్స్ లేదా పలాజోలను వాడుతుంటారు. అలాకాకుండా లాంగ్ కుర్తీని మాత్రమే వేసుకుని, దానికి మ్యాచ్ అయ్యే లాంగ్ ఓవర్‌కోట్‌ను కొనుక్కుంటే చాలా అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తారు.
స్ట్రైట్ పాంట్
కుర్తీలకు లెగ్గిన్‌లు వాడడం సాధారణమే.. స్టైల్‌గా కుర్తీలకు స్ట్రైట్ పాంట్ వేసుకుంటే ఫార్మల్, క్లాసీ లుక్‌తో మెరిసిపోవచ్చు.
జీన్స్‌తో..
లాంగ్ కుర్తీల్లోనే.. ముందువైపు స్లిట్ ఉన్న కుర్తీలను ఎంచుకుని.. దానికి జతగా టోన్డ్ జీన్స్‌కానీ, టైట్ జీన్స్‌కానీ, జగ్గిన్ కానీ వేసుకుంటే.. ట్రెండీ వెస్ట్రన్ లుక్‌తో మెరిసిపోతారు. ఇక అందరి చూపులు మీ వైపే..
స్కర్టుతో..
కుర్తీలకు ఎప్పుడూ లెగ్గిన్‌లే కాకుండా అప్పుడప్పుడూ ఆ కుర్తీకి మ్యాచ్ అయ్యే స్కర్టులను ఎంచుకుని.. వీటికి
తగ్గట్టు కాంట్రాస్ట్ చున్నీని జతచేస్తే ట్రెండీ ట్రెడిషనల్ లుక్‌తో మెరిసిపోవచ్చు.
ధోతీతో..
ధడక్ సినిమాలో.. జాన్వీకపూర్ చుడీదార్లతోపాటు ధోతీలతో కూడా మెరిసింది. అలాగే అప్పుడప్పుడూ కుర్తీతో ధోతీని ట్రై చేస్తే ట్రెండీగా ఉంటుంది.
స్కిన్‌టైట్ లెగ్గిన్..
పొడవుగా, కొత్తదనంగా, ట్రెండీగా కనిపించే కుర్తీకి స్కిన్‌టైట్ లెగ్గిన్ చాలా బాగుంటుంది. అయితే ఇది నార్మల్ లెగ్గిన్ లాంటిది కాకుండా డిఫరెంట్ ఫాబ్రిక్‌తో, డిజైన్స్‌తో ఉన్నవాటిని ఎంచుకుంటే ఆ డ్రెస్ అదిరిపోతుంది.
పలాజో విత్ ఓవర్‌కోట్
కుర్తీలకు పలాజోలని వాడటం ఇప్పుడు అందరూ చేస్తున్నదే.. దీనితో పాటు ఆ కుర్తీలకు తగ్గట్లు మంచి ఓవర్‌కోట్‌ను జతచేస్తే ఇక అందరి చూపులూ ఆ డ్రెస్‌ను ధరించిన మీ వైపే.. ఇంకెందుకాలస్యం మీరూ మామూలు కుర్తీతోనే స్టైల్‌గా, ట్రెండీగా కనిపించడానికి ట్రై చెయ్యండి మరి!