Others

‘స్పీడ్ సైక్లింగ్’లో సంచలన విజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్ర తీరంలో ఉప్పుగాలి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఆమె డీలా పడలేదు.. ‘లక్ష్యం’పైనే గురిపెట్టి మెరుపు వేగంతో దూసుకుపోయి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. ‘స్పీడ్ సైక్లింగ్’లో ఆమె సాధించిన ఘనత అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. గంటకు 183 మైళ్ల వేగంతో సైకిల్‌పై దూసుకుపోయి, 23 ఏళ్ల నాటి రికార్డును ఆమె ‘బ్రేక్’ చేసింది. అమెరికాకు చెందిన 45 ఏళ్ల డినైస్ ముల్లెర్- కొరెనెక్ ఈనెల 17న ‘యుటాహ్’లో జరిగిన ‘ప్రపంచ హైస్పీడ్ సైక్లింగ్’లో సంచలనం సృష్టించి ‘గిన్నిస్ బుక్’లో తన ఘనతను నమోదు చేసుకుంది. అమెరికాలోని ‘యుటాహ్’ రాష్ట్రంలో ఏటా నిర్వహించే ‘హైస్పీడ్ సైక్లింగ్’ పోటీలలో అనేక దేశాలకు చెందిన వారు పాల్గొంటారు. 1995లో డచ్ సైక్లిస్ట్ గంటకు 167 మైళ్ల స్పీడ్‌తో నెలకొల్పిన రికార్డు ఇపుడు కాలగర్భంలో కలిసింది. ఒక మహిళగా ప్రపంచ రికార్డును నెలకొల్పడం తనకెంతో ఆనందం కలిగించిందని డినైస్ తెలిపింది.