Others

చిల్లర వర్తకానికి చిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో చిల్లర వర్తక రంగంలోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లేదు. ప్రజల నుండి వచ్చిన వ్యతిరేకతకు తలొగ్గి ప్రభుత్వం ఆ పనికి పూనుకోలేదు. అయితేనేం.. రాజమార్గాలు లేనప్పుడు దొడ్డిదారులు వెదకడం, మన ఇళ్లలోకి చొరబడడం విదేశీ బడాకంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య. భారత్‌లో 700 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపారానికి అవకాశమున్న చిల్లర వర్తక రంగాన్ని చూస్తూ చూస్తూ అవి వదులుకొంటాయా? అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్‌ని గతంలో టేక్‌ఓవర్ చేసుకోగా, ఇప్పుడు అమెజాన్ కంపెనీ దేశీయ రిటైల్ దగ్గజం ‘మోర్’ని తన అధీనంలోకి తీసుకొంది. ఈ రెండు విదేశీ దిగ్గజాలూ చక్కగా రిటైల్ వ్యాపారాన్ని వృద్ధి చేసుకొంటాయి. ముందుముందు మరిన్ని కంపెనీలు రావొచ్చు. వాటివల్ల ఉద్యోగిత పెరుగుతుందన్న గ్యారెంటీ కూడా ఉండదు. అమెజాన్ 2020లోగా అమెరికాలో 3వేల క్యాషియర్ రహిత దుకాణాలు తెరవబోతున్నట్టు ప్రకటించింది. మన దేశంలోనూ ఆ సంస్థ అదే బాట పడుతుంది.
దేశ జీడీపీలో 10 శాతం వాటా కలిగిన చిల్లర వర్తకం కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తోంది. దేశ కార్మిక శక్తిలో ఆరుశాతం మంది ఈ రంగంలోనే ఉన్నారు. విదేశీ బడాకంపెనీలు దేశీయంగా ఉన్న చిన్న పోటీదారుల్ని అనైతిక పద్ధతుల్లో దెబ్బతీస్తాయి. వర్తకంపై వాటి ఏకఛత్రాధిపత్యం దఖలుపడిన పిమ్మ ట ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచేస్తాయి. పెప్సీ, కోకోకోలా తరహా కంపెనీలు ఈ పనే చేశాయి. ఆ కంపెనీలు తమ ముడి సరకుల్లో 30శాతం దేశీయంగా సేకరించాల్సి ఉంటుందన్న నిబంధన ఉన్నప్పటికీ, వాటి మెడలు వంచి అమలు చెయ్యడం కష్టం. అలా చెయ్యగలిగినా ధరలు నిర్ణయించడం వాళ్ళ చేతిలోనే ఉంటుంది కనుక రైతుకు కూడా లాభం ఉండదు. దేశీయ చిల్లర వర్తక రంగాన్ని కాపాడుకోవడమే మన ధ్యేయం కావాలి. లేదా ఆర్థికంగా దేశం ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రూపాయి విలువ పతనమవ్వడానికి ముఖ్యకారణాల్లో ఒకటి- దేశం నుండి విదేశీ పెట్టుబడులు ఒక్కసారిగా బయటకు ఎగిరిపోవడం. ఆ తరహా నష్టాల్ని భరించగలిగే స్థాయిలోనే వాటిని అదుపులో ఉంచడం తెలివైన పని అవుతుంది తప్ప విచ్చలవిడిగా వాటిని అనుమతించడం కాదు. దేశీయ మార్కెట్ పటిష్టపరచడానికి విదేశీ పెట్టుబడులపై ఆధారపడడం ఆరోగ్యకరమైన పరిష్కారం కాదు.

- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం