Others

కాంబినేషన్ ఆహారంతో కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది భోజనప్రియులు తమకు నచ్చిన ఆహారం కనిపిస్తే చాలు లొట్టలేసుకుని లాగించేస్తుంటారు. ముఖ్యంగా కాంబినేషన్ ఆహారం.. అంటే ముద్దపప్పు - ఆవకాయ, పప్పుచారు - వడియాలు, కోడికూర - గారెలు.. ఇలా అన్నమాట. తమకు నచ్చిన కాంబినేషన్ లేకపోతే ముద్ద దిగడం కష్టం చాలామందికి.. అయితే కొన్ని కాంబినేషన్‌లు ఎంత రుచిగా ఉంటాయో.. అంతే ప్రమాదకరం కూడా.. ఇలాంటి ఆహారం తిన్నప్పుడు వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా, తరచూ వీటిని తినడం వల్ల శరీరం క్రమేణా విషతుల్యమవుతుందని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మరి అలాంటి ప్రమాదకర కాంబినేషన్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..
* పాలల్లో నిమ్మరసం పడితే పాలు విరిగిపోతాయన్న సంగతి తెలిసిందే.. ఈ రెండింటిని వెంటవెంటనే తినడం వల్ల కడుపులో కూడా ఇదే పరిస్థితి. కాబట్టి నిమ్మరసం పిండిన ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే పాలు మాత్రం తాగకూడదు. కావాలంటే ఓ గంట ఆగి పాలను తీసుకోవచ్చు. ఎందుకంటే పాలు, నిమ్మరసం కాంబినేషన్ విషతుల్యమైనది.
* పుచ్చకాయలో 95 శాతం నీరే ఉంటుంది. చాలామంది పుచ్చకాయ తిన్న తరువాత కూడా మంచినీళ్లను తాగుతారు. ఇలా తాగడం వల్ల శరీరంలోని జీర్ణరసాల వ్యవస్థ దెబ్బతింటుంది.
* కొంతమంది పాలన్నంలోనూ, పెరుగన్నంలోనూ చికెన్ లేదా చేపల కూరను వేసుకుని తింటూ ఉంటారు. ఇది చాలా తప్పు. అప్పటికి దాని ప్రభావం కనిపించకపోయినా క్రమేపీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
* పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల కడుపులో యాసిడ్స్ పెరిగిపోయి జీవక్రియ దెబ్బతింటుంది.
* కొంతమంది భోజనం చేస్తూ టీ తాగుతూ ఉంటారు. కూరలతో అన్నం తిన్నప్పుడు ఫరవాలేదు కానీ.. పెరుగన్నం తింటూ మాత్రం టీ తాగకూడదు. ఎందుకంటే టీలోనూ, పెరుగులోనూ ఆసిడ్స్ ఉంటాయి. వీటివల్ల జీర్ణక్రియలో లోపాలు ఏర్పడతాయి. ఎందుకంటే జీర్ణరసాలు.. నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలను కలిగి ఉంటాయి.
* చాలామంది తమ పిల్లలను ఉదయం కానీ, సాయంత్రం ఆటల నుంచి వచ్చినప్పుడు కానీ తక్షణ శక్తికోసం అరటిపండు తిని, పాలు తాగమంటారు. ఆయుర్వేద నిపుణులు దీనిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఈ రెండింటిని ఇలా ఒకేసారి కలిపి తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ దెబ్బతింటుంది.