Others

పునరపి జననం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడే వచ్చా నీలోకానికి
ఇక్కడ నాకంతా కొత్తగా ఉంది!
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతుంటే
ఉశ్వాస నిశ్వాసలౌతానంది గాలి!
చీకటిలో చిందులేస్తూ అలమటిస్తుంటే
కనుపాపలో కాపుముంటానంది కాంతి!
ఆకలితో నకనకలాడిపోతుంటే
కాయలూ పండ్లూ రాల్చింది చెట్టు!
దప్పికై నాలిక పిడచకడుతూంటే
దబ్బున చిరుజల్లు కురిపించింది మబ్బు
మాటలు తెలియక తడబడతుంటే
పాటలు పాడి నేర్పించింది కోయిల!
అంతా బాగానే అనిపించింది
అలా కాలం గడిచిపోతూనే ఉంది!
అందుకు
ప్రత్యుపకారం చేయాలనిపించింది
అడిగాను ధీమాగా ఏం కావాలని!
ముక్తకంఠంతో
గాలి, కాంతి, చెట్టు, మబ్బు, కోకిల
అందరూ నాకు చేసింది ఒకటే అభ్యర్థన
తెలుసుకునే ఉంటావు
దేవుడు ఎక్కడ ఉంటాడో
మర్మం
మాకు కూడా చెప్పి పుణ్యం కట్టుకోమని!
నాలిక కరుచుకున్నాను నా అవివేకానికి
గుర్తొంచింది వచ్చిన పని మర్చిపోయానని!
కాళ్లూ చేతులూ వణుకుతున్నాయి
కళ్లుబైర్లు కమ్ముతున్నాయి
నాలిక బయటకొచ్చేస్తోంది
చర్మం బిగుసుకుపోతోంది
మనసు, బుద్ధి, చిత్తం
యుద్ధానికి తలపడుతున్నాయి
తప్పు నీదంటే నీదని!
కాలం గావు కేక వేసింది
కదిలి పోదాం వచ్చేయమని!
అనే్వషణ అలాగే మిగిలిపోయింది
అప్పుడు నాకు జ్ఞానోదయమైంది!
మళ్లీ పుట్టక తప్పదని!

- ఒలివేటి వేంకట సుబ్రహ్మణ్య శర్మ 8919221823