Others

పిల్లల ఆసక్తుల్ని గమనించండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అరుణాం కరుణా తరంగి తాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామ్’
... పక్క పోర్షన్‌లో సోమయాజులుగారింట్లోంచి లలితా సహస్రం విన్న సుబ్రహ్మణ్యం ఎంతో పరవశించిపోయి భార్య సుశీలతో-‘ఆ లలితా సహస్రం పాడుతున్నదెవరు? ఎంత మధురంగా వుంది ఆ కంఠం. ఎవరో చిన్నపిల్ల గొంతులా వుందే? మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది సుమీ’ అన్నాడు. ‘అంత మధురంగా ఆలపిస్తున్నది సోమయాజులుగారి మనవరాలండీ.. ఆ పిల్ల పేరు హంసిక. పట్టుమని పదేళ్లు కూడా ఉండదు వయస్సు. ఎంత శ్రావ్యంగా పాడుతుందనుకునేరు? ఎక్కడా శృతి తప్పకుండా ఎంతో స్పష్టంగా ప్రతి పదాన్ని చక్కగా పలుకుతూ రాగయుక్తంగా పాడుతోంది. లలితా సహస్రనామాలే కాదు, శ్రీసూక్తం, లక్ష్మీ అష్టోత్తరాలు, కనకధారాస్తవం, దుర్గాష్టకం ఆ పిల్లకు కంఠస్థం. నాలుగో తరగతి చదువుతున్న పిల్లకు ఇంతటి జ్ఞాపకశక్తి ఉందంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. పుస్తకం చూసి చదువుతున్నా నేను కఠిన పదాల్ని పలకలేకపోతున్నాను. పుస్తకం చూడకుండానే ఆ పిల్ల అనర్ఘళంగా పాడుతుంది. ఆ పిల్లను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది కదండీ..’ అంది భర్తతో. ‘ఔనౌను.. ఆ అమ్మాయి గొంతు విన్న తర్వాత నాకూ అలాగే అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో లలితా సహస్రం తప్పులు లేకుండా చదవడం మామూలు విషయం కాదు. అలాంటి పిల్లల్ని ఎంతైనా మెచ్చుకోవాల్సిందే’అన్నాడు సుబ్రహ్మణ్యం.
***
భక్తికి వయసుతో నిమిత్తం లేదు, ప్రతిభకు ప్రాయంతో పనిలేదు. కొంతమందికి దైవం మీద అనురక్తి, భక్త్భివన పసిప్రాయంలోనే ఏర్పడతాయి. కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల శ్రద్ధ, వంశానుగత సంప్రదాయం, ఆచార వ్యవహారాల కారణంగా కొన్ని ఇళ్ళల్లో పిల్లలకు పసిప్రాయం నుంచే మనసులో భక్తిబీజాలు నాటుకుంటాయి. తల్లిదండ్రులకు శ్రద్ధ వుంటే అయిదారేళ్ల ప్రాయంలోనే పిల్లలకు శ్లోక పఠనం, పద్య పఠనం, భక్తిగీతాలు నేర్పుతూ వాళ్ళను భక్త్భివం వైపు మరలిస్తారు. ఇలాంటి కుటుంబ నేపథ్యంలో పెరిగిన పిల్లలు చిన్నతనం నుంచే చక్కగా శ్లోకాలు చదవడం, కఠినమైన సంస్కృత పదాలను పలకడం, సాహిత్యాన్ని చదవడం అలవాటు చేసుకుంటారు. వాటిపై ఆసక్తి పెంచుకోవడం, నిరంతర సాధన వల్ల శ్లోకాల్ని, పద్యాల్ని, భక్తిగీతాల్ని సుస్పష్టంగా స్వరయుక్తంగా పాడగలుగుతారు. పెద్దవాళ్ళు సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేయడం అన్ని చోట్లా జరుగుతున్నదే. చిన్నారులు స్వరయుక్తంగా పారాయణం చేయడం అందరికీ ముచ్చటగొలిపే విషయం. తమ పిల్లలు చదువులో తప్ప సంగీతం, సాహిత్యం, ఇతర రంగాల్లో కృషి చేయడాన్ని చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడరు. భక్త్భివాలను అలవరచుకున్నా, శ్లోకాలు, పద్యాలు చదవడంపై ఆసక్తి పెంచుకున్నా- అది చదువుకు ఆటంకం కలిగిస్తుందని కొందరు పేరెంట్స్ అపోహ పడుతుంటారు. ఈ భావన సరైనది కాదు. శ్లోకపఠనం, పద్యపఠనం అలవర్చుకోడానికి పిల్లలు అంతగా సమయాన్ని వృథా చేయవల్సిన అవసరం లేదు. రోజులో కేవలం ఒక గంట సమయాన్ని కేటాయించగలిగితే పిల్లలు ఈ విషయంలో ఎంతగానో రాణిస్తారు.2
కాగా, చిన్నారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి వారిని లలితకళల్లో ప్రోత్సహించే పరిస్థితి నేడు కానరావడం లేదు. ‘పిల్లలు తెలుగు, సంస్కృతం మోజులో పడితే వాళ్లకు ఇంగ్లీషు రాదు. ఫలితంగా భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు తగ్గుతాయి’ అని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. ‘విదేశీ భాష నేర్చుకోవాలంటే ముందుగా మాతృభాషపై మంచి పట్టు సాధించాలి’అన్న ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత జార్జి బెర్నార్డ్ షా మాటలు ఎప్పటికీ అక్షరసత్యాలు. చిన్న వయసులో సంస్కృతాన్ని నేర్చుకుంటే ఆంగ్లం, హిందీ భాషలను పిల్లలు సులువుగా నేర్చుకోగలుగుతారు. పిల్లలకు శ్లోకాలు, పద్యాలు పఠించడాన్ని అలవర్చి వాళ్లలో భాషా సంస్కారాన్ని పెంపొందించాలి. సంస్కృతం నేర్చుకోవడం ద్వారా మన ప్రాచీన సంస్కృతిని పరిరక్షించుకోగలుగుతాం. శ్లోకాలు, పద్యాలు పఠిస్తే పిల్లల్లో క్రమశిక్షణ, దైవచింతన, సద్భావన, సన్మార్గవర్తన అలవడుతుంది. తద్వారా వాళ్లు నియమబద్ధంగా ఆదర్శప్రాయమైన జీవితం గడపడానికి వీలుంటుంది.

-రాజ్‌కుమార్