Others

ఫార్మాసిస్టుల కొరత.. రోగుల కలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోగులకు అవసరం లేని మందులను అంటగట్టడంలో కొన్ని కార్పొరేట్, చిన్నపాటి ఆస్పత్రుల్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. తమ ఆస్పత్రుల్లోని మందుల దుకాణాల్లోనే ఔషధాలు కొనుగోలు చేయాలంటూ వైద్యులు ఒత్తిడి చేస్తుంటారు. ఈ మోసం మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తూనే ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. విదేశాల్లో అయితే రోగాన్ని గుర్తించడం మాత్రమే వైద్యుడి పని. ఏ ఔషధాలు ఎంత మోతాదులో వాడాలనేది క్లినికల్ ఫార్మసిస్ట్ బాధ్యత. వైద్యుడు, క్లినికల్ ఫార్మసిస్ట్ ఉమ్మడిగా రోగి బాధ్యత తీసుకుంటారు. మన దేశంలో మాత్రం ఇలాంటి సేవలందించే క్లినికల్ ఫార్మసిస్టులు లేరు. ఉజ్వల భవిష్యత్ కోసం కలలు కంటూ ఫార్మసీ కోర్సులలో చేరే విద్యార్థులు పట్టా పొందిన తర్వాత ఉద్యోగాల నిమిత్తం పోరాడుతున్నారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను భరించడం ప్రభుత్వానికి సాధ్యం కాక, నాలుగు సంవత్సరాల ఫార్మసీ కోర్సును మూడు సంవత్సరాలకు కుదించే ప్రయత్నాలు చేస్తోంది. విద్యార్థులు మూడు సంవత్సరాలలోనే ఫార్మసీని నేర్చుకోగలరా?
అమెరికా ప్రభుత్వం 2003లో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (్ఫర్మా-డి) ప్రారంభించి, కనీస అర్హత కలిగినవారు అక్కడ ఆ కోర్సులో చేరవచ్చని ప్రకటించింది. భారత్‌లో ‘్ఫర్మా-డి’ కోర్సును 2008లో ప్రారంభించారు. పాశ్చాత్య దేశాలలో ఔషధ చికిత్స కమిటీలను అన్ని వ్యాధులకు మందులను రూపొందించడానికి నియమించారు. వైద్యులు, క్లినికల్ ఫార్మసిస్టులు, నర్సులకు కూడా ఆసుపత్రిలో చికిత్స చేసుకొనే ప్రతి వైద్య చికిత్సకు ప్రిస్క్రిప్షన్ ఔషధాలను ఎలా నిర్వహించాలో ప్రామాణిక ప్రిస్క్రిప్షన్ పనుల బాధ్యతలను కేటాయించారు.
ఇతర దేశాలలో ఉన్న ఫార్మా-డి కోర్సును మన దేశంలో ప్రవేశపెట్టాలని ఆసక్తిచూపిన కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులలో, పిహెచ్‌సిలలో క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్టులను నియమించడానికి నిర్లక్ష్యం వహిస్తోంది. మన ఫార్మా-డి గ్రాడ్యుయేట్లు కెమిస్ట్రీ అధ్యయనం చేయడం లేదని, అందువలన తమ కంపెనీలలో ఉద్యోగాలకు పనికిరారని మన ఫార్మా కంపెనీలు నిర్ధారించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 60 ఫార్మా-డి కళాశాలలున్నాయి. వాటిలో 1,800 సీట్లు ఉన్నాయి. తెలంగాణాలో 53 కళాశాలలున్నాయి. బి-ఫార్మసీ చేసిన వారికి పోస్ట్‌బ్యాచిలర్ (పీబీ) క్రింద ఈ కోర్సులో నాలుగో ఏడాదిలో నేరుగా ప్రవేశం కల్పించారు. ప్రవేశాల సమయంలో ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.5-8 లక్షల వరకూ డొనేషన్ రూపంలో ఏటా రూ.1.5-3 లక్షల వరకూ ఫీజుల రూపంలో ఫార్మా-డి కళాశాలలు వసూలుచేస్తున్నాయి. విద్యార్థులకు రూ.68,000 నుంచి రూ.1.25 లక్షల చొప్పున ట్యూషన్ ఫీజుగా చెల్లిస్తారు. ఈ ట్యూషన్ ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి కళాశాలలకు ఇచ్చేస్తుంది. 4,000 మంది విద్యార్థులలో ప్రతి సంవత్సరం 20 శాతం నుండి 25 శాతం మంది మాత్రమే ఫార్మసిస్ట్స్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిలో స్థిరపడగలుగుతారు. ఆసుపత్రులలో క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఫార్మా-డి గ్రాడ్యుయేట్లు ఆందోళనలు చేస్తున్నారు.
వైద్య విద్య సంచాలక కార్యాలయం అధికారులు మాత్రం బోధనాస్పత్రుల్లో వీరి సేవలు అవసరం లేదని చెప్తున్నారు. తమిళనాడులోని ఎంజీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వారిని సంప్రదిస్తే ఎంసెట్ ద్వారా జరిగే ప్రవేశాలతో తమకు సంబంధం లేదంటున్నారు. ఫార్మా-డి చదవిన వారు ఫార్మసిస్టు ఉద్యోగానికి దరఖాస్తుచేస్తే- అది ఉన్నతస్థాయి చదువు కాబట్టి ఈ ఉద్యోగానికి అనర్హులు అంటారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదని అంటారు. ఈ కోర్సులో ఉత్తీర్ణులైన వారి పేర్లు మాత్రం రాష్ట్ర ఫార్మసీ కౌనె్సల్‌లో నమోదు చేసుకుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు దీనిపై స్పందిస్తూ ‘‘అమెరికాలో ఉన్నట్లు క్లినికల్ ఫార్మసిస్టులకు ఉద్యోగావకాశాలు ఇక్కడ లేవు. ఈ కోర్సు పూర్తిగా విదేశాలకు చెందినదని’’ పేర్కొనడం గమనార్హం. వైద్యుల వలే ఆరోగ్య సంరక్షణ అందించే అనుమతి గానీ శస్తచ్రికిత్స పరికరాలు ఉపయోగించడానికి గాను ఫార్మా-డి గ్రాడ్యుయేట్లకు అధికారం లేదని అంటున్నారు. ఫార్మా- డి అర్హతతో ఏ ఒక్క సంస్థకూడా ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదు.
ఈ కోర్సు పూర్తిచేసినవారు ఈ కింది బాధ్యతలకు అర్హులు...
* ప్రభుత్వం నియమించే డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు
* ఆస్పత్రులలో క్లినికల్ ఫార్మసిస్ట్‌లు
* వైద్య పరిశోధన, ఔషధ ప్రమాణాల పర్యవేక్షణ
* వైద్య కళాశాలలో అధ్యాపకులు
* ఫార్మా కంపెనీల్లో విజిలెన్స్ విభాగం
* రోగులకు కౌనె్సలింగ్ కేంద్రాలు,
* టెలీ, ఈ-ఔషధ కేంద్రాలు
* డీ ఎడిక్షన్ కేంద్రాలు
* డ్రగ్ పాయిజన్ సమాచార కేంద్రాలు
కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఫార్మా-డి కోర్సు చదివిన వారిని నియమించుకోవడానికి అనాసక్తి చూపిస్తున్నాయి. వీరిని నియమిస్తే తమ ఆస్పత్రుల్లో ఔషధాల అమ్మకాలు తగ్గుముఖం పడతాయనే భావన ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాల్లో కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల అమలుకు ప్రభుత్వం ఎలాంటి పోస్టులు కేటాయించక పోవడంతో ఈ విద్యార్హతలున్న వారికి ఎక్కడా అవకాశాలు కనిపించడం లేదు. ఈ కోర్సు పూర్తి చేసినవారు ఏంచేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. వీరిని ఆసుపత్రుల్లో నియమిస్తే ఔషధాలకు వెచ్చించే నిధులు 65 శాతం తగ్గుతాయనే దురభిప్రాయాలు ఉన్నాయి.
ఎంసెట్ 2019-20లో ఫార్మా-డి కోర్సును చేర్చకూడదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విద్యాశాఖను ఆదేశించింది. కొన్ని కళాశాలల యాజమాన్యాలు కొత్తకోర్సులు అమలులోకి లాభాలను దండుకోవచ్చునన్న ఉద్దేశంతో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పలువురిని ఈ కోర్సును ప్రారంభించడంలో ప్రభావితం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసినవారికి విదేశాల్లో మంచి ఉన్నత అవకాశాలు ఉన్నాయని కళాశాలల యాజమాన్యాలు ఊదరగొట్టాయి. ఎంసెట్ కౌనె్సలింగ్ ద్వారా సీట్లు, విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో అభ్యసనం కోసం విద్యార్థులను తల్లిదండ్రులు లక్షలుపోసి చేర్చుతున్నారు. వాస్తవానికి ‘్ఫర్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ అనుమతించిన మేరకు ఆరు సంవత్సరాల ఫార్మా-డి కోర్సును పూర్తిచేసిన వారికి ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు. నాలుగేళ్ళ బీ-్ఫర్మసీ చేసిన వారికి ఉన్న గుర్తింపు ఫార్మా-డి చేసిన వారికి లేకపోవడం విచారించదగ్గ విషయం. ఫార్మసీ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఈ విషయమై చొరవ తీసుకోవాలి. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ సమస్యకు కారణమని ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షుడు అన్నపరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి అంటున్నారు. ఏపీలో సుమారు 15,000 పిహెచ్‌సీలు, ఆసుపత్రులు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా ఫార్మసీ విభాగంలో ఉద్యోగ నియామకాలు లేవు. ప్రతి ఆసుపత్రిలో డ్రగ్ థెరపిటిక్ కమిటీలను ఏర్పాటు చేసేలా చట్టాన్ని రూపొందించాలని, అన్ని ఆసుపత్రులలో ఫార్మసిస్టులు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దశాబ్దాలు గడిచిపోతున్నా ఇందుకు తగ్గ మార్పులను వైద్యవిద్యలో చేయకపోవడం విద్యార్థులను మోసగించటమే.

-ఎన్.కలీల్ 94403 36771