Others

అలలపై ‘మాయ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్రంలో ఎగసిపడే అలలతో ఆడాలంటే ఎవరికైనా భయమే.. అలాంటిది ఆ కెరాటాలపై ‘సర్ఫింగ్’ చేయడం.. మామూలు విషయమా..? అదీ 68 అడుగుల ఎతె్తైన అలలపై సర్ఫింగ్ చేయడమంటే.. గుండెలు జారిపోతాయి.. కానీ మాయ గాబీరా మాత్రం ఇలాంటివేవీ లెక్కచేయకుండా అత్యంత ఎత్తయిన అలపై సర్ఫింగ్ చేసి.. అందరూ ‘ఔరా!’ అనుకునేలా చేసింది. 2018 జనవరిలో నజారే నిర్వహించిన వరల్డ్ సర్ఫ్ లీగ్‌లో మాయ గాబీరా 68 అడుగుల ఎత్తయిన అలపై సర్ఫింగ్ చేసింది. 2013లో కూడా మాయ గాబీరా సర్ఫింగ్ చేస్తూ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం ఆమెలోని ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గించకుండా రెట్టింపు చేశాయి. అందుకే ఎంతో పట్టుదలతో అనుభవం ఉన్న సర్ఫర్లు కూడా చేయలేని ఈ సాహసాన్ని ఆమె చేసి భళా.. అనిపించింది. అదే నేడు ఆమెకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించి పెట్టింది.