Others

గోరంత దీపం కొండంత వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజ్ఞానంలోనే ఉంటే జ్ఞానం ఎప్పటికీ తెలియ దు. ప్రయత్నపూర్వకంగా జ్ఞానాన్ని ఆర్జించడం మొదలెట్టితే అది కొద్దిగా నేర్చుకున్నా జ్ఞానం వ్యక్తిత్వాన్ని మార్చివేస్తుంది. ప్రయత్నించి చీకటిలో చిన్న దీపాన్ని వెలిగించే అది ఆ చీకటినంతా పారదోలినట్టుగా జ్ఞానాన్ని సంపాదించడం ఆరంభం చేస్తే ఆ జ్ఞానమార్గమే జీవితానికి గొప్ప వెలుగుగా మారుతుంది. దీన్ని చెప్పే చిన్న కథ వినండి.
ఒక ఊరిలో ఒక వ్యాపారి వున్నాడు. అతను బాగా సంపాదించాడు. ఆయనకు ముగ్గురు కుమారులు వున్నారు. అయితే తాను పోయిన తర్వాత తన వ్యాపారాన్ని చక్కగా నిర్వహించగలిగే తెలివితేటలు, సమర్ధత ఎవ్వరిలో వుంటే వారికే అప్పగించాలనుకున్నాడు. ఒకనాడు ఆ ముగ్గుర్నీ పిలిచి వారికి ఒక పరీక్ష పెట్టాడు. ఒక్కొక్కరికీ ఒక వంద రూపాయలు ఇచ్చి ఒక ఖాళీ గదిని చూపించి, సాయంకాలం అయ్యేలోగా ఈ వంద రూపాయలతో ఏ వస్తువులనైనా కొని గది అంతా నింపెయ్యాలి అన్నాడు. ఆలోచించాడు. చివరికి పశువులు మేసే గడ్డి అన్నిటికన్నా చౌకగా దొరుకుతుందని, వెంటనే గడ్డిమోపులు కొని గది నింపేసాడు. రెండవ వాడు- గడ్డికంటే చౌకగా ఇంకేదన్నా దొరుకుతుందేమోనని ఆలోచించాడు. బజారులో ఒకచోట కుళ్ళిపోయిన కూరగాయలు, పళ్ళగుట్టలు కనిపించాయి. వాటిని పారేస్తున్నారు. రెండవ కుమారుడు- వాటన్నిటినీ వంద రూపాయలిచ్చి కొనుక్కుని వచ్చాడు. గదినంతా నింపేసాడు.
ఇక మూడవ కొడుకు కేవలం ఒక అగ్గిపెట్టె, కొన్ని కొవ్వొత్తులు కొన్నాడు. గదిలో దాచాడు. సాయంత్రం అయ్యింది. తండ్రి ముగ్గురినీ పిలిచి, వాళ్ళ గదులు చూపించమన్నాడు. ఇద్దరి గదులు చూసాడు. వాడు తాను కొన్న కొవ్వొత్తులను వెలిగించి గదినంతా వెలుగుతో నింపేసాడు. గది అంతా వెలుగుతో నిండిపోయింది. కానీ మిగిలిన రెండు గదుల్లోనూ అంతో ఇంతో ఖాళీ వుండిపోయింది. మూడవ కొడుకు తెలివితేటలకు తండ్రి అబ్బురపడిపోయాడు. అతని సమయ స్ఫూర్తిని మెచ్చుకున్నాడు. అతనికే తన వ్యాపార నిర్వహణా బాధ్యతలను అప్పగించాడు. ఇచ్చిన సొమ్మును వృథాగావించి పనికిరాని వస్తువులను కొన్న పెద్ద కుమారులను మందలించాడు.
ఈ చిన్నికథలో ఒక పరమార్ధం దాగివుంది. తండ్రిని పరమాత్మగా నెంచితే, కుమారులు మానవులు. ధనం జీవులకు పరమాత్మ ప్రసాదించిన ఆయుష్కాలం. ఈ కాలాన్ని హృదయమనే గదిలో జ్యోతిర్మయమైన ఆత్మజ్ఞానంతో దీపారాధన గావించాలి. చాలామంది దుర్జన సాంగత్యంతో దురలవాట్లతో తమ చిత్తమును అసుర సంపదతో నింపేస్తారు. అలాగాక తమకు లభించిన ఆయుష్కాలాన్ని సాధన ద్వారా, సత్కర్మాచరణ ద్వారా జీవనాన్ని కొనసాగించి తమ చిత్తాన్ని దైవీ సంపదతోనూ, జ్ఞానప్రకాశంతోనూ వెల్గొందేలా చేసుకోవాలి. ఇక మానస పూజలోనూ జ్యోతిర్మయమైన ఆత్మజ్ఞాన ప్రసక్తిని శంకరాచార్యులవారు గావించారు.
సమస్త వాసనా త్యాగం ధూపం తస్య విచిన్తయేత్
జ్యోతిర్మయాత్మ విజ్ఞానం దీపం సద్దర్శయేత్ బుదః
హృదయమనే ప్రమిదలో అవగాహన అనబడే తైలాన్ని నింపి దాన్లో వివేకం అనే వత్తినుంచి, దానికి జ్ఞానం అగ్నిని జోడించాలి. అలా వెలిగించిన జ్ఞాన జ్యోతి సందర్శనమే, ఆత్మలింగ పూజా విధానంలో దీపదర్శనమన్నమాట. ఎంతోమంది మహాత్ములు ఈ విధంగానే జ్ఞానజ్యోతిని దర్శించారు.

- డా.పులివర్తి కృష్ణమూర్తి