Others

భక్తుల కల్పతరువు మూకాంబిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యంత మహిమాన్వితమైన, అష్టసిద్దుల నిలయమై, అత్యంత పురాతనమైన శ్రీ చక్ర క్షేత్రం శ్రీ మూకాంబిక ఆవాసమైన కొల్లూరు.
ఈ కొల్లూరు మహాక్షేత్రం పడమటి కర్నాటక రాజ్యంలోని, ఉడిపి జిల్లానందలి కుందాపూర్ తాలూకాలో నెలకొని ఉంది. ఇది దట్టమైన అడవుల మధ్య సంజీవిని పర్వతశ్రేణులనబడే సయ్యాద్రి కనుమల్లో చౌడాద్రిపై అనేకానేక వృక్ష సంపదలమధ్య దివ్య ఔషధ సంపదలకు ఆలవాలంగా నెలకొని ఉంది.
ఈ క్షేత్రం ఒక శక్తిపీఠం. ఇక్కడ ఆదిశంకరాచార్యులవారు తపస్సుచేసి దేవిని సాక్షాత్కరింపచేసుకుని ధన్యులయ్యారు.
ఆదిశంకరులే ఇక్కడ పంచలోహములతో చేసిన మూకాంబికాదేవి మూర్తిని శ్రీ చక్రంపై ప్రతిష్టించి పూజావిధులను కూడా ఆగమశాస్త్ర ప్రకారం నిర్ణయించారు. ఆ ప్రకారంగా నేటికి పూజలు నిర్వర్తిస్తున్నారు.
మూకాంబికా దేవి మనకు పద్మాసనంలో మనకు దర్శనమిస్తుంది.
దేవి గర్భ విగ్రహనికి ముందు స్వయంభూ జ్యోతిర్లింగం ఉంటుంది. సువర్ణరేఖ ఈ లింగాన్ని 2గా విభజిస్తుంది. కుడి భాగం ఎడమ భాగానికంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది.
కుడిభాగం శక్తులకు ఆలవాలమైన లక్ష్మి, సరస్వతి, పార్వతులకు నిలయమని, ఎడమ భాగం త్రిమూర్తుల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నిలయమంటారు. ఉదయం అభిషేకం, ఇతర పూజల అనంతరం సూర్యకిరణాలు అక్కడ అమర్చిన అద్దంలోనుండి లింగంపై పడి అత్యంత దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.ముకాంబికా దేవి అమూల్యమైన ఆభరణాలను ధరించి చూపురలను చూపుతిప్పనివ్వకుండా మహాసౌందర్యరాశియై వెలుగొందుతూ ఉంటుంది. తల్లిని చూచినవారంతా చేతులెత్తిమొక్కకుండా ఉండలేరు. అపూర్వమూ అమూల్యమైన ఆ దేవి కరుణావీక్షణాలు తమపై పడాలని ఆ తల్లి చల్లని చూపు తమకు దక్కాలని అక్కడికి వచ్చిన యాత్రీకులంతా కన్నార్పకుండా దేవిని వీక్షించి ప్రణామాలు చేస్తుంటారు. ఇక్కడ జరిపే చండీహోమంకోసం దూర దేశాలనుంచి కూడా అమ్మ భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు.
దేవి ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యస్వామి మందిరం, సరస్వతీ మంటపం ఒకప్రక్కన ఉన్నాయి. ఈ అధినేవత కళలకు అధిపతి అంటారు. ఇక్కడకు అన్ని ప్రదేశాలనుండి ఎంతోమంది కళాకారులు వచ్చి ముందుగా ఇక్కడ తమ కళలను ప్రదర్శించి వెళ్తారు. ఆ దేవీ ఆశీస్సులుంటే తమకు ఖ్యాతి కలిగి తమ కళల్లో రాణిస్తారని ప్రగాఢ విశ్వాసం. వీరిలో జగత్ విఖ్యాతిగాంచిన ప్రసిద్ధ చిత్రకారుడు రవివర్మ, గురుగోపీనాథ్, వైద్యనాథ్ భగవతార్‌గారు ఉన్నారు.
ఇక్కడ క్షేత్ర పాలకుడు వీరభద్రస్వామి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడి దేవస్థానం వసతి గృహాలు అన్ని సౌకర్యాలతో భక్తులకు అందుబాటులో ఉన్నవి. ఇక్కడికి రావటానికి ఉడిపి, మాంగళూర్ నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాదు నుంచి కుందాపూర్ చేరుటకు సుమారు 14 గంటలు పడుతుంది. అక్కడినుండి కొల్లూరుకు 2 గంటలకు ఒక బస్సు వుంటుంది. అక్కడినుంచి గంట, గంటన్నర సమయం పడుతుంది. ఈ దేవిని దర్శిస్తే ఏది కావాలని మనం కోరితే అది లభిస్తుంది. మాటలు రాని వారికి మాటలు కూడా వస్తాయంటారు. ఇది అందరూ దర్శించదగ్గ దివ్యక్షేత్రం.

- జి.వెంకట్రావు