Others

ఆధ్యాత్మిక వైభ వ శోభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు, పెద్దలకు, స్ర్తిలకు, పురుషులకు, పశువులకు దండిగా అటు సరదాలను, ఇటు దీవనెలను ఇచ్చే దసరాపండుగ సకలసృష్టికి ఆధారభూతమైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలిని పూజించే భాగ్యాన్ని కల్పిస్తుంది.
పూర్వం పూలబాణాలు పుచ్చుకుని, బుక్కా చల్లుతూ దసరా పాటలు పాడుతూ ‘జరుూభవ దిగ్విజరుూభవ’’ దసరాకు వస్తిమని విసవిసలు పడక .. చేతిలో లేదనక, అప్పివ్వరనక అప్పులోళ్లము కాదని తెలుసుకొని ఆలస్యం చేయబోకండి మేము ఆగబోము.. ...అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పుబెల్లాలు అని పాడుతూ ఇంటింటికి తిరిగేవారు. ఇపుడు ఈ పద్ధతి లేదు. కానీ త్యాగాలు నేర్పివ్వడానికి, ఉన్నది నలుగురు పంచుకుని తినడంలో ఆనందాన్ని రుచి చూపించడానికి గురువులను సన్మానించడానికి గురుశిష్యుల మధ్య అనుబంధాన్ని పెంచే అవకాశం కల్పించే పండుగ దసరా అంటూ దసరా ఉత్సవాల్లో ఈ కార్యక్రమాలను కొన్ని సాంస్కృతిక సంస్థల పునరుర్దరిస్తున్నారు.
మహిషాసురుని సంహరించి లోకపీడను పారద్రోలిన అమ్మవారిని నవవిధాలు అర్చిస్తారు. నవవిధ రూపాలను ధరించి రాక్షసులను దునుమాడి శిష్టులను రక్షించిన అమ్మను తొమ్మిది అవతారాలు కలిగిన మాతగా సంభావిస్తూ రోజుకొక్క రూపాన్ని ధరింపచేసి ఆదిపరాశక్తిని పూజించడం శరన్నవరాత్రుల్లో ప్రత్యేకత.
మొట్టమొదటి రోజు అమ్మ బాలగా ఉండి ఆబాలగోపాలాన్ని తన కన్నుసన్నుల్లో మెలిగేట్టు చేస్తుంది. కనుకనే అమ్మను బాలాత్రిపురసుందరీగా అలంకరిస్తారు. ఆరాధిస్తారు. హ్రీం, శ్రీం, క్లీం లాంటి బీజాక్షరాలలో ఈ తల్లి రూపం నిరూపితమవుతోంది. ఈ తల్లికి ఈరోజున నెయ్యి, పులగం సమర్పిస్తారు.బాల త్రిపుర సుందరీదేవిని లేత గులాబీ రంగు చీర ధరించి కుంకుమతో పూజిస్తే రోగనాశనం అవుతుంది.
గాయత్రిగా భావించి పసుపు రంగు చీర ధరించి పసుపు పచ్చ పూలతో అమ్మావారిని పూజిస్తారు. పరమాన్నం, శనగపప్పుతో చేసిన పిండి వంటకం సమర్పించాలి.
అన్నపూర్ణాదేవిగా భావించి పూజించేటపుడు గోధుమ రంగు చీరను ధరించి సుగంధ పూలతో పూజించాలి. పాలు, పాయసం, బొబ్బర్ల వంటకం నివేదిస్తే దుఃఖనాశనం అవుతుంది.
మహాలక్ష్మీదేవిగా అమ్మను పూజించేటపుడు ఎరుపురంగు చీర ధరించి, రూపాయ నాణెలతో పూజించాలి అప్పాలను నివేదన చేయడం వల్ల సంపద అభివృద్ధి చెందుతుంది.
పంచమి నాడు లలితాత్రిపుర సుందరి దేవిగా అలంకరించి వూదారంగు చీర ధరించి ఎర్రని పూలతోఅమ్మను పూజించాలి. అరటిపండ్లు గోధుమ రవ పాయసం,పులిహోర చేసి నివేదించడం వల్ల బుద్ధి బలం పెరుగుతుంది. షష్ఠినాడు రాజరాజేశ్వరీదేవిగా భావించి ఆకుపచ్చ రంగు చీరను ధరించి రకరకాల మందార పూల తో, గులాబీలతో పూజించాలి. అమ్మకు గులాబీల దండ సమర్పిస్తే అనారోగ్యాలు దూరమవుతాయి. రాజ్‌మా గింజలతో చేసిన వంటకాన్ని నివేదన చేయాలి.
సప్తమినాడు సరస్వతీ దేవీ పూజ తెలుపు రంగు చీరను ధరించి తెల్లని కలువలను, జాజులు, సుగంధ ద్రవ్యాలతో అమ్మను ఆరాధించాలి. తెల్లని నువ్వులతో పిండి వంటలు, తెల్లని బియ్యపుపాయసం చేసి నివేదించాలి. అష్టమి దుర్గాష్టమి కనక దుర్గామాతగా అమ్మనుకొలుస్తారు. వంగపూవు రంగు చీరను ధరించి మినపగారెలు నివేదన చేస్తే శత్రునాశనం జరుగుతుంది. నవమి మహర్నవమి మహిషాసుర మర్దినిగా నీలంరంగుచీరను ధరించి విష్ణుకాంత పూలతో పూజించాలి. పేలాలు, ఉలవల చారు బూరెలు తో నివేదన చేస్తే తాప శాంతి కలుగుతుంది. దశమి విజయలక్ష్మిగా, రాజరాజేశ్వరిగా భావించి పసుపు లేక ఆకుపచ్చ రంగు చీరను ధరించి విజయాలను కలుగచేయమని వేడుకుంటూ తొమ్మిదిరకాల పండ్లను, తొమ్మిది రకాల పిండివంటలు నివేదన చేస్తే ఇహపర సౌఖ్యం పొందుతారు.
ఈ నవరాత్రుల్లోనే కుమారిక- త్రిమూర్తి- కల్యాణి- రోహిణి- కాళి- చండిక- శాంభవి- దుర్గ- సుభద్ర అనే పేర్లతో కన్యకామణులను రెండేళ్ల నుంచి తొమ్మిదేళ్ల చిన్నపిల్లలకు అమ్మవారి అలంకరణలు చేసి అమ్మవారిగా భావన చేస్తూ కుమారీ పూజను చేస్తారు.
ఇదేకాక తన్ను తాను తొమ్మిది అవతారాలను సృజియంచుకుని రాక్షసులను సంహరించిన అమ్మను, ఆదిపరాశక్తిని ‘శైలపుత్రి’, ‘బ్రహ్మచారిణి’, ‘చంద్రఘంట’,‘కూష్మాండ’, ‘స్కందమాత’, ‘కాత్యాయని’, ‘కాళరాత్రి’, ‘మహాగౌరి’, సిద్ధ్ధిత్రి గా కూఢా పూజిస్తారు.
విజయదశమినాడు జమ్మిచెట్టును పూజిస్తారు. ఈ తొమ్మిదిరోజులు బొమ్మల కొలువులను తీర్చి ముతె్తైదువులను, పిల్లలను పిలిచి పేరంటాలు కూడా చేస్తారు.

- వాణి ప్రభాకరి