Others

రాముని బాట రాచబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేము ఈమధ్య బదిరినాథ్ యాత్ర చేసిన వచ్చిన తరువాత మా కొడుకు కోడలి దగ్గరకు అంటే న్యూజెర్సీ వెళ్లాం. ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న పదాన్ని నేను మరవలేనుకదా. అందుకే అక్కడ ఉన్న గుళ్లల్లో స్వామి ఏ రూపంలో ఉన్నా స్వామినే కదా అని నేను మా శ్రీమతి వెళ్లాం. మాతోటి శ్రీకాంత్ శ్రీవిద్య అంటే మా కొడుకుకోడలు, శ్రీ కావ్య, శ్రీహిత మా మనమరాళ్లు కూడా బయలుదేరారు. ఆశ్చర్యం ఆనందం మనలను మంచిమార్గంలో పయనింపచేయడానికి మంచిని బోధించే చినజీయర్‌స్వామి దర్శనం లభించింది. ఆనందం వేసింది. జీయర్ మఠాన్ని మేము దర్శించుకున్నాం. అక్కడ కూడా జీయర్‌స్వామి మా యోగక్షేమాలు కనుగొన్నారు. ఆతరువాత అక్కడికి వచ్చిన వారందరికీ చిన్న ఉపన్యాసం ఇచ్చారు. భగవంతుని గూర్చి చెప్పారు. కేవలం పురాణాలు, రామాయణభారతభాగవతాలు చదవడం కాదు వాటిని ఆచరించేందుకు ప్రయత్నించండి. మన భూమి కర్మభూమి కర్మల వల్లకూడా భగవంతుని మెప్పించవచ్చు. మహావిష్ణువు రామావతారాన్ని సృజియించుకుని నేలమీదకు వచ్చి తాను నడిచి ధర్మమార్గాన్ని మనకు చూపించాడు. కనుక మీరంతా రాముని బాటలో నడవండి. సదా భగవంతుడు మిమ్మలను నీడలా కాపాడుతాడు అని చెప్పారు. రామాలయానికి వెళ్లాం. అక్కడ హనుమంతుని, వినాయకుని కూడా దర్శించుకున్నాం. చిన జీయర్‌స్వామి గోసంరక్షణ గురించి కూడా చెప్పారు. ఆవులను సాకలేనివారు కనీసం గోవులను కాపాడేవారికి సాయం చేయమన్నారు. ఆవుకు గడ్డి ఇచ్చినా మీకు పుణ్యమే వస్తుంది. రానురాను మనిషిలో మంచితనం మానవత్వం నశించిపోయే కాలం వస్తోంది. ఎక్కడికి పోయినా మన మాతృభూమిని మరవక మనిషితనంతో మెలగమని హితబోధ చేశారు.. స్వామి చేతుల మీద తీర్థగోష్ఠిజరిగింది. నామనసు సంతోషంతో నిండిపోయింది. ఇంత దూరం వచ్చి ఇక్కడ మన స్వామిని సాక్షాత్తు మహావిష్ణువు చూస్తున్నట్టుగా చినజీయర్‌స్వామిని చూశాను. వెనువెంటనే ఇక్కడ నెలకొన్న భద్రాది వాసుడిని చూశాను. ఇక్కడ గుడులు ఎంతోపరిశ్రుభంగా ప్రశాంతంగా ఉన్నాయి. మేమంతా చాలాసేపు ఆ దేవదేవుని సన్నిధిలో కూర్చుని ధ్యానం చేసుకొన్నాం.
ఆ తరువాత ఓ సాయంత్రం నాకు అత్యంత ఇష్టమైన సాయినాథుని దర్శనం చేసుకొన్నాం. బతికున్న రోజుల్లో శిరిడీ గ్రామాలు దాటని ఆ సాయినాథుడు సముద్రాలు దాటి అమెరికా వారి గుండెల్లో గూడు కట్టుకుని అక్కడ ఉన్నతెలుగువారిని కాపాడడానికి గుడిలో వేంచేసి ఉన్నారు.
సాయినాథుని స్మరించినంత మాత్రానే అన్ని కోరికలూ తీర్చేవాడు కనుక సద్గురు కనుక మేమంతా ఆ సాయినాథుని ధామంలో కాసేపు కూర్చుని ప్రశాంతత పొంది ఎంతో తేలికైన మనసులతో సాయినామస్మరణ చేస్తూ ఇంటికి వచ్చాం.

-జంగం శ్రీనివాసులు