Others

పరీక్ష ఎవరి కోసం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల్లో పరీక్షల భయాన్ని పోగొట్టాలంటే ప్రతిరోజూ క్లాసులో పాఠం పూర్తయిన తర్వాత రెండు, మూడు ప్రశ్నలను ఇవ్వటం అలవాటు చేయాలి. ప్రశ్నలతో పిల్లలను ర్యాంకింగ్ చేయకుండా, ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలను వారు అవగాహన చేసుకోగలిగారా? లేదా? అన్నది తెలుసుకునేందుకు పరీక్ష ఒక పరికరం. ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు విద్యార్థులు కొన్ని విషయాలు జ్ఞప్తికి ఉంచుకోవాలి.
1. ప్రశ్నపత్రంలో సూచనలను క్షుణ్ణంగా చదవాలి. ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానం ఇవ్వాలి. తొందరపడడం కన్నా దీర్ఘంగా ఆలోచించే అలవాటు మంచిది.
2. ప్రశ్నలను పూర్తిగా చదవాలి. కొందరు మొదటి భాగం వరకే చదువుతారు. చివరి వరకూ పరీక్ష పేపరు పూర్తిగా చదివాక సమాధానాలు రాయటం అలవాటు చేసుకోవాలి.
3. ఎక్కువ ప్రశ్నలివ్వాలి. పిల్లలకు ఛాయిస్ ఉండాలి. ప్రశ్నలను ఎంచుకోవటం కూడా ఒక కళ. కఠినమైన ప్రశ్నలను ఎంచుకోవటం కూడా ఒక తెలివి. కఠినమైన ప్రశ్నలను ఎంచుకుని తికమక పడిన దానికన్నా తనకు వచ్చిన ప్రశ్నలు ఏరుకుంటే తనమీద తనకు నమ్మకం పెరుగుతుంది.
4. ఒక ప్రశ్నకు నాలుగైదు సమాధానాలు ఇచ్చే ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు ఊహించి సమాధానం రాయకూడదు. సరైన సమాధానం కోసం ఆలోచించాలి. ఇచ్చిన నాలుగు సమాధానాలు ప్రతిదీ కరెక్ట్‌గానే కనిపిస్తాయి కానీ అసలు సమాధానాన్ని గుర్తించాలి.
ఈ విధంగా చిన్న తరగతి నుంచే దీన్ని విద్యార్థులకు అలవాటు చేస్తే పరీక్షలంటే భయం లేకుండాపోతుంది. చాలామంది పిల్లలకు లెక్కలు, ఇంగ్లీషులపై ఎక్కువ శిక్షణను ఇవ్వవలసి ఉంది. వాటిపై ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉన్నది.
కాలం కన్నా ముందు..
మనం ఇప్పుడు ఒక పరిణామక్రమంలో ఉన్నాం. ప్రతిసారీ సమాజం మన నుంచి కొత్త భావనలను ఆశిస్తుంది. సమాజానికి కావాల్సిన సమానత్వాన్ని ఆచరించి ఆదర్శంగా నిలువవలసి ఉంది. మార్కుల పేరుపై తరగతి గదిలో కొత్తగా ‘మార్కుల కులా’న్ని సృష్టించాం. ఆనాడు మనువు మనుషుల్ని విభజించేలా కులాలను సృష్టిస్తే, ఈనాడు మార్కెట్ సమాజం ‘మార్కుల మనువుల’ను సృష్టించాయి.
మార్కులు ఎవరి కోసం? చేసిన పనిని తులనాత్మకం చేసుకోవటానికి మార్కులు ఒక మార్గం. దాన్ని ఆధారంగా చేసుకుని విద్యార్థులకు హోదాలు ఇవ్వటానికి కాదు. మనం ఒక అసమానమైన సమాజాన్ని అనుకరించాం. విద్యార్థిని ఉపాధ్యాయునికి సహాయకుడిగా అనుకునే బదులుగా ‘‘రారా, పోరా, ఏందిరా?’’ అనే సంస్కృతిని తయారుచేసుకున్నారు. విద్యార్థిని గౌరవించిన నాడే తరగతి గది సమానత్వం వైపు తిరుగుతుంది. తరగతి గదిలో సమానత్వాన్ని పాటిస్తే అది రాబోయే సమాజానికి ఆదర్శమవుతుంది. ఇప్పటివరకు తరగతి గదిలో జరిగిన అజ్ఞానంతో విచిత్రమైన కొత్త సంస్కృతి తరగతి గదిలో ఏర్పడింది. విద్యార్థి హోదాను, స్థాయిని పెంచితే ఆ విద్యార్థి మార్కెట్ సరుకుగా మారడు.
కొత్త సంస్కృతికి నాంది..
గురువుల మాటతోనైనా, సంభాషణలతోనైనా విద్యార్థుల స్థాయిని పెంచి తరగతి గది ఒక రోడ్ రోలర్ అని మనం నిరూపించవలసి ఉన్నది. విద్యాలయాలు కొత్త సంస్కృతికి నాంది పలుకవలసి ఉన్నది. విద్యార్థి ఆత్మగౌరవం పెరిగినప్పుడే గురువుకు, విద్యార్థికి మధ్యనున్న గోడలు తొలగిపోతాయి. భయం అనేది పోతుంది. ఆ భయం స్థానంలో ప్రేమ ఏర్పడాలి. ఈనాడు పాఠశాలలో ఏ సమాజాన్ని నిర్మిస్తున్నామో రేపు నాలుగు గోడల బయటకూడా అలాంటి సమాజానే్న నిర్మించేందుకు బాటలు వేయాలి. విద్యార్థి స్థాయి పెరిగితేనే విద్యాప్రమాణాలు పెరుగుతాయి. సమాజం కొత్త విలువలతో మెరుస్తుంది. నేటి స్కూలు రేపటి సమాజానికి ఆదర్శ నిలయం.
ఉపాధ్యాయుడు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పిన తర్వాత పిల్లలకు సరిగా అర్థమైందో లేదోనని అనుమాన నివృత్తి కోసమై పునశ్ఛరణ చేయిస్తాడు. పునశ్ఛరణలో ప్రాథమిక విషయాలు, కంక్లూజన్స్, రీజనింగ్ అనే మూడు అంశాలూ పిల్లలకు అర్థం అయ్యేటట్లు చేసేందుకు తరగతి గదిని జట్లుగా విభజిస్తారు. దానిలో ఈ మూడు విషయాలను విద్యార్థులు ఒకరికొకరు చెప్పుకోవటం జరుగుతుంది. దీనివలన సాధకుడు (విద్యార్థి) తను అనుకున్న విషయాన్ని ఆకళింపు చేసుకుంటాడు. తర్వాత ఉపాధ్యాయుడు చెప్పని విషయాన్ని కూడా చర్చనీయాంశం చేస్తాడు. కొత్త విషయాన్ని సాధించిన విషయంతో కనెక్ట్ చేసుకునే శక్తి రావాలి. నేర్చుకున్న విషయాన్ని కొత్త సమస్యతో కనెక్ట్ చేసే శక్తి వచ్చేలా చూడాలి. ఇది జరుగుతున్నప్పుడు కొంతమంది పిల్లలు తమకు తట్టిన కోణాన్ని ఎవరితోనైనా చెబుతున్నారా? పునశ్చరణకున్న ఈ మూడు లక్షణాలు జరిగితేనే ఉపాధ్యాయుడు ముందడుగు వేస్తాడు. ఈ ప్రక్రియతో విద్యార్థి చేయి పట్టుకుని నడిపిస్తాడు. తన చేతిని క్రమంగా తీసేస్తాడు. నడుస్తున్నప్పుడు విద్యార్థి తొణుకుతున్నాడా? లేదా? అని గమనిస్తాడు. సక్రమంగా నడుస్తూపోతుంటే ఉపాధ్యాయుడు ఆనందిస్తాడు. ఎవరైనా గంతులేస్తూ పరుగెత్తుతుంటే- విద్యార్థి తాను సైతం వారినుంచి నేర్చుకుంటాడు.
టీచింగ్ అయిన తర్వాత సాధకుడు నేర్చుకున్న విషయాన్ని కన్‌సాల్డిడేట్ చేయడం, విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని నింపటం అంటే- మొక్కలకు నీళ్లుపోయడమే. బోధన- సాధనల సంయోగం ద్వారా సుస్థిరత సాధ్యమవుతుంది.

-- చుక్కా రామయ్య