Others

పిల్లల్ని ప్రోత్సహించాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు ఎంత చిన్న మంచి పనిచేసినా వారిని ప్రోత్సహించాలి. క్లాప్స్ కొట్టాలి. ఇలా చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అప్పుడే పిల్లలకు ఆనందం కలుగుతుంది. వారి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది. పిల్లలతో మాట్లాడేటప్పుడు కోపాన్ని పక్కన పెట్టాలి. వారిని ఎప్పుడూ తిట్టడం, కొట్టడం చేయకూడదు. పిల్లల ఎదుగుదలకు ఆర్థికంగా నిలదొక్కుకుని, డబ్బు ఆవశ్యకతను కూడా వారికి తెలియజేయాలి. ఆర్థిక ఇబ్బందులతో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలో వారికి చెప్పాలి. తల్లిదండ్రులకు ఇతరులు పిల్లల గురించి చాడీలు చెప్పినా పిల్లలతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలి తప్పితే ఇతరుల మాటలపై భరోసా ఉంచి పిల్లల్ని తిట్టకూడదు. తల్లిదండ్రులు అప్పుడప్పుడూ పిల్లలతో ఆడుకోవాలి. ఇంట్లోని బొమ్మలతో కానీ, పిల్లల్ని బయటకు తీసుకెళ్లి కానీ వారితో ఆటలు ఆడాలి. పిల్లలకు ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఒకవేళ పిల్లలు అవి కావాలని మారాం చేసినా వారికి వాటి వల్ల కలిగే అనర్థాలను వివరంగా చెప్పాలి కానీ అవి అడిగినందుకు పిల్లలను దండించకూడదు.
స్కూలు నుంచి వచ్చాక గంట పాటు పిల్లల్ని ఆడుకోమని వదిలేయాలి. తరువాత నెమ్మదిగా స్కూలు సంగతులు తెలుసుకున్న తర్వాత చదువు గురించి మాట్లాడాలి. ఇలా చేయడం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలను తేలిగ్గా తల్లిదండ్రులతో పంచుకుంటారు. పిల్లలకు అమ్మానాన్నలపై నమ్మకం కూడా పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం, ఆహారం విషయంలో తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వారి డైట్‌లో కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ ఉండేలా చూడాలి. మాంసాహారులైతే రోజుకో కోడిగుడ్డు, వారానికి రెండుసార్లు మాంసాహారాన్ని పిల్లలకు అందించాలి. తప్పుల్ని ఎత్తి చూపేటప్పుడు పిల్లలు అర్థం చేసుకునేలా నెమ్మదిగా చెప్పాలి కానీ అరిచి, కేకలు వేసి వారు భయపడేలా చేయకూడదు. తల్లిదండ్రులకు, పిల్లలకూ మధ్య ఎప్పుడూ స్నేహం ఉండాలి.
చేసిన తప్పును పిల్లలు అంగీకరించేలా పెంచాలి. తల్లిదండ్రులంటే అమితమైన గౌరవం ఉండేలా చూడాలి. పిల్లల స్నేహితుల గురించి తెలుసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు ప్రపంచంలో జరిగే విషయాల గురించి తరచూ చెబుతూ ఉండాలి. సామాజిక, మానసిక, సాంకేతిక విభాగాలతో పాటు వారికి ఆసక్తి గల రంగాల్లో వారు రాటుదేలేలా చేయాలి. ఇలా పిల్లలను స్నేహితుల్లా, ప్రేమగా పెంచితే వారి భవిష్యత్తు బాగుండడమే కాకుండా సమాజం కూడా బాగుంటుంది.