Others

ఎన్నికల్లో గెలుపు కోసం ఎనె్నన్ని విన్యాసాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయ. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీపై ప్రభావం చూపుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. భాజపాను ఓడించాలంటే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు చెబుతున్నారు. విభజన పాపం కాంగ్రెస్‌దేనని నాలుగేళ్లపాటు విమర్శించిన ఆయన ఇపుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు ఏ విధంగా భావిస్తారు? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో కొందరితో పొత్తు పెట్టుకున్నాయి. తమిళనాడులో ద్రవిడ పార్టీల రాజకీయాలను ఇతర ప్రాంతీయ పార్టీలూ అనుసరించాయి.
ఏపీలో క్షేత్రస్థాయిలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి దూరంగా జరుగుతున్నారు. అన్ని ప్రాంతీయ పార్టీల వలే తెలుగుదేశం కూడా కుటుంబ పాలన దిశగానే నడుస్తోంది. ఎన్‌టిఆర్ తరువాత చంద్రబాబు, లోకేష్ ఆ పార్టీలో నేతలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ ఎపుడో ఒక కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయింది. 2014 ఎన్నికలలో చంద్రబాబు బిజెపి, పవన్ కళ్యాణ్‌లతో పొత్తుపెట్టుకొని విజయం సాధించారు. ఈ రోజు బిజెపి, జనసైన పార్టీలు తెదేపాకు దూరంగా ఉన్నాయ. వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేని పరిస్థితిలో ఉంది. కమ్యూనిస్టు పార్టీలకు అంతగా ఉనికి లేదు.
పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపురలలో కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన వ్యూహాన్ని తెలుగుదేశం ఇక్కడ అమలు చేస్తోంది. ప్రజలను తమ చెప్పుచేతలలో ఉంచుకొనేందుకు కమ్యూనిస్టు పార్టీలు బ్లాక్ డెవలప్‌మెంటు కమిటీలు, వాటర్ మేనేజ్‌మెంట్ కమిటీలు, విద్యా కమిటీలలో తమ కార్యకర్తలను నింపుతాయ. ఈ కమిటీలకు రాజ్యాంగ పరంగా ఎటువంటి చట్టబద్ధత ఉండదు. కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ బెంగాల్, త్రిపురలలో వామపక్ష పార్టీల పాలనకు తెరపడింది. బెంగాల్‌లో 30 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత వామపక్ష ప్రభుత్వం ఓటమి చెందడంతో ప్రజలు రోడ్లపైన విజయ దశమి పండుగ చేసుకున్నారు. బెంగాల్‌లో గత కొనే్నళ్లుగా కమ్యూనిస్టులకు ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. త్రిపురలో మాణిక్ సర్కార్ ప్రభుత్వం పతనం తరువాత అక్కడి ప్రజలు రోడ్లపైన విందులు, వినోదాలు చేసుకున్నారు. సోవియట్ రష్యాలో కమ్యూనిజం అంతరించాక ప్రజలు ఎంతో ఆగ్రహంతో లెనిన్ విగ్రహాన్ని ధ్వంసం చేసారు. అదే విధంగా త్రిపుర ప్రజలు కూడ మాణిక్ సర్కార్ ప్రభుత్వం పడిపోయిన తరువాత లెనిన్, మార్క్స్ విగ్రహాలను ధ్వంసం చేసారు.
ఏపీలో జన్మభూమి కమిటీలు, వాటర్‌షెడ్ కమిటీలు, పోలీసు స్టేషన్ కమిటీలు ఏర్పాటు చేశారు. వాటర్ షెడ్ కమిటీల ఎన్నికలలో ఎన్ని అరాచకాలు జరిగాయో అందరికీ తెలిసిందే. పోలీసు స్టేషన్లలో సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఆ కమిటీలో ఉన్న తెలుగుదేశం నాయకుడు చెబితే పని జరిగిపోయేది. దీని వల్ల అవినీతి పెరిగిపోయింది. లా అండ్ ఆర్డరు పరిస్థితి దిగజారింది. ప్రజలు తమకు రేషను కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలన్నా జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తు చేస్తేనే వస్తుంది. ప్రభుత్వాధికారులను కలిస్తే జరిగే పని శూన్యం. ప్రజలు తమకు కావలసిన ప్రతి చిన్న పనికీ తెలుగుదేశం పార్టీపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పరిచారు కమ్యూనిస్టుల తరహాలో.
ఈ రాజకీయాలను గమనించిన ప్రజలు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారు. ఇది గమనించిన చంద్రబాబు ప్రతి కులానికి, ప్రతి వర్గానికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ముస్లింలకు, క్రైస్తవులకు అడగకుండా వరాలు ఇచ్చి, వారిని దగ్గరకు తీసు కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మహిళా సాధికారత, యువతకు ఉపాధి, అన్న క్యాంటీన్లు, విజ్ఞాన మేలాలు, అంగన్‌వాడీ టీచర్ల జీతాల పెంపు, విద్యా వాలంటీర్ల జీతాల పెంపు హోం గార్డుల ఉద్యోగాలను క్రమబద్దీకరించడం... ఇవన్నీ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేసినవే. కేంద్రం నుండి నిధులు రానప్పటికీ, తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని ప్రజలను నమ్మించటానికి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నుండి నిధులు రావటం లేదు అని మంత్రులు, తెలుగుదేశం శాసనసభ్యులు పదే పదే చెబుతున్నారు. రాష్ట్రానికి రావలసిన నిధులకన్నా ఎక్కువ నిధులు రాబడుతున్నామని మరోవైపు అధికారులు చెబుతున్నారు. ఎవరిని నమ్మాలో ప్రజలకు తెలియటం లేదు. చంద్రన్న బీమా, పేదల గృహ నిర్మాణ పథకం వంటివి కేంద్ర ప్రభుత్వ పథకాలే. పోలవరం ప్రాజెక్టు, ఎయమ్స్, సెంట్రల్ యూనివర్శిటీ వంటివి కేంద్ర నిధులతో సమకూరుతున్నాయ. మరి చంద్రబాబు ఈ నాలుగేళ్లలో తనంతటతానుగా చేసిన కార్యక్రమం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు జగన్ భయం, మరోవైపు పవన్ భయం.. వీరిద్దరిని బిజెపితో ముడిపెట్టి లబ్ధి పొందాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. ఈ ఎత్తుగడతో ప్రజలలో సానుభూతి రాకపోగా వ్యతిరేకత వస్తోంది. అందుకే మాటమార్చి పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అంశాలను ఎత్తుకున్నారు. గతంలో అనేక కుంభ కోణాలలో ఇరుక్కున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాఫెల్ ఒప్పందంపై చేస్తున్న ఆరోపణలకు జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించడం లేదు. అలాంటి కాంగ్రెస్‌తో పొత్తుకు చంద్రబాబు అంగీకరించడం వివాదాస్పదం అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపైన, బిజెపిపైన తాను ప్రయోగించిన బాణాలన్నీ పనిచేయటం లేదని గ్రహించిన చంద్రబాబు ఇపుడు కొత్తగా- 2003లో తనపై జరిగిన అలిపిరి సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఇటీవల విశాఖ మన్యంలో మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను కాల్చిచంపినపుడు- గతంలో మావోలు తనను అంతం చేసేందుకు కుట్ర పన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ రకమైన ప్రకటనలు చంద్రబాబు ప్రజలలో సానుభూతి కోసం చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది.
కాగా, పన్నులు ఎగవేసిన వారిపైన, ఆదాయానికి మించిన ఆస్తులున్న వారిపైన ఆదాయ పన్ను అధికారులు దాడులు చేయడంమామూలు విషయమే. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అనుమానంతో తెదేపా మాజీ శాసనసభ్యుడు బీదె మస్తాన్‌రావు, ప్రస్తుత శాసన సభ్యుడు పోతుల రామారావు, ఇతర నాయకుల ఇళ్ళలో ఐ.టి అధికారులు దాడి చేయగా, తనను భయపెట్టడం కోసం మోదీ ఇలా చేయిస్తున్నారని కేంద్రాన్ని విమర్శించటం చంద్రబాబులోని అభద్రతా భావాన్ని తెలియచేస్తోంది. ‘ నేను అవినీతిని సహించను.. నిజాయితీ పరుణ్ని. 40 ఏళ్ల నుండి మచ్చలేని నాయకుడిని.. అవినీతి పరులను, పన్ను ఎగవేత దారులను క్షమించను ..’-అని చంద్రబాబు గతంలో అనేక మార్లు అన్నారు. మరి ఇప్పుడు పన్ను ఎగవేతదారులను సమర్ధించడం ఎందుకో ప్రజలకు తెలియటం లేదు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు భాజపా వ్యూహరచన చేసిందన్న అనుమానం చంద్రబాబులో రానురానూ పెరుగుతోంది. ప్రజల సానుభూతితో వచ్చే ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆయన ప్రతివ్యూహాన్ని రచిస్తున్నారు.

-పి.వి. శ్రీరామశాయి