AADIVAVRAM - Others

నవదుర్గల ప్రత్యేకతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాత ఆరాధన అనాదిగా ఆచరణలో ఉంది. దేవీ భాగవతం, దుర్గ సప్తశతి, మార్కండేయ పురాణంలో దుర్గాదేవి మహాత్మ్యం వర్ణించ బడింది. ‘‘ప్రథమం శైల పుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ! తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్!! పంచమం స్కంద మాతేతి షష్టం కాత్యాయనీతి చ! సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టకమ్!! నవమం సిద్ధ్ధిద్రీచ నవర్గా:ప్రకీర్తితా! ఉక్తానే్యతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా!!. దేవిని తొమ్మిది అవతారాలు తొమ్మిది దినాలు రూపానికి తగిన అలంకారాలతో, ఆయుధాలతో నవదుర్గలుగా ప్రత్యకంగా పూజించడం సంప్రదాయం. మొదటి రోజున ‘‘శైలపుత్రి’’ దుర్గ, నంది తన వాహనంగా కుడిచేత త్రిశూలాన్ని, ఎడమచేత పద్మ పుష్పాన్ని ధరించి దర్శనమిస్తుంది. రెండో రోజు ‘‘బ్రహ్మచారిణి’’గా దేవి తపోదీక్షాధారిణిగా కన్పిస్తుంది. కుడిచేత రుద్రాక్షమాల, ఎడమ చేత కమండలం ధరించి ఉంటుంది. మూడో రోజున దేవి ‘‘చంద్రఘంట’’గా పిలువబడుతుంది. ఈ రూపంలో దేవి దశహస్తాలతో, పది చేతులలో పది ఆయుధాలతో, సింహ వాహనారూఢయై ఉంటుంది. షోడశ కళల చంద్రుని రూపం ఈ దినాన ఘంట రూపంలో కన్పిస్తుంది. నాలుగో రోజున ‘‘కూష్మాండ దేవి’’గా కొలుస్తారు. సృష్టికి మూలమై చిద్విలాసంతో సృజించినది కావున వర్తుల విశ్వాన్ని కూష్మాండం, గుమ్మడికాయతో పోలుస్తూ, కూష్మాండగా వ్యవహరిస్తారు. ఎనిమిది చేతులు కలిగి ఉండే రూపమైనందున ‘‘అష్ట్భుజ’’ అని కూడా అంటారు. ఏడు చేతుల్లోలనూ వరుసగా విల్లు, బాణం, పద్మపుష్పం, అమృతకలశం, చక్రం, గద ధరించి, ఎనిమిదో చేతిలో రుద్రాక్షలతో దర్శనమిస్తుంది. ఈదేవికి కూష్మాండం బలికి ప్రముఖ స్థానమై, ప్రీతికరమైనది. ఐదవ రోజున ‘‘స్కందమాత’’గా దేవి లోకవిఖ్యాతి చెందింది. కార్తికేయుని తల్లిగా నాలుగు చేతులతో, ఊర్ధ్వ దక్షిణ హస్తంలో స్కంద బాలుడిని, అధో దక్షిణ హస్తంలో పద్మాన్ని, ఊర్ధ్వ వామ హస్తంలో ఆశీర్వాద ముద్రను, అధో దక్షిణ హస్తంలో పద్మాన్ని ధరించి, పద్మంపై కూర్చుని ఉంటుంది. అందుకే ‘‘పద్మాసన’’గా పిలుస్తారు. సింహవాహనగా దర్శనమిస్తుంది. ఆరవ రూపం ‘‘కాత్యాయని’’ బంగారు ఛాయతో తళుకులీనుతుంటుంది. కుడిచేయి ధైర్యస్థ్యైర్యాలను కలిగించే రీతిలో ఉంటుంది. దిగువనున్న చేయి వరదాయిని ముద్రలో, ఎడమ వైపున ఉన్న పై చేయి ఖడ్గం, దిగువనున్న చేతిలో పద్మం ధరించి, సింహవాహనయై దర్శనమిస్తుంది. దురర్గాదేవి ఏడో రూపం ‘‘కాళరాత్రి’’. నల్లగా, జుట్టు విరబోసుకుని, మెరుపుల కాంతులు వెదజల్లే గళమాలతో త్రినేత్రయై, నిప్పులు కక్కుతూ, జ్వాజ్వాల్యమానంగా గార్ధ్భ వాహనాసీనయై, చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. కుడివైపు ఒకచేత అభయంకర ముద్ర, మరొక చేత తేజోపరాక్రమదాయిని ముద్ర, ఎడమ వైపున పైచేత ఇనుప ఛురిక, మరొకచేత కొడవలి ధరించి భయానక కాళరాత్రి రూపేణ చెడుని ధ్వంసించే విలయ కారిణి ఈ మహిమాన్విత మూర్తి. ఎనిమిదవ రూపంలో ‘‘మహాగౌరి’’గా ధవళ ధావళ్య విలాసినిగా దేవి ప్రశాంతత, పరిశుద్ధతకు ప్రతీకగా, శే్వత వస్త్రాంబర ధారిణియై, నంది వాహనంగా, కుడివైపు పైచేత సర్వభయ హారిణిగా, దిగువ చేత త్రిశూల ధారిణిగా ముద్రలు కన్పిస్తుంటే, ఎడమ వైపున ఢమరుకం పైచేత, దిగువ చేత వరదాయిని ముద్రలో దేవి దర్శనమిస్తుంది. తొమ్మిదవ దినాన మహర్నవమి నాడు నవదుర్గలలో చివరి రూపమైన ‘‘సిద్ధ్ధిత్రి’’గా- విజయాన్ని సిద్ధింప చేసే శక్తిశాలినిగా, అష్టసిద్ధులూ ప్రసాదించే సర్వశక్తిమయిగా, సాక్షాత్తూ శివునికే సాయుజ్యాన్ని ప్రసాదించ గలిగిన ఆదిశక్తిగా పూజలందుకునే తల్లి సిద్ధ్ధిత్రి. కుడివైపు పైచేతిలో ముద్గలం, దిగువ చేతిలో చక్రం, ఎడమవైపు పైచేతిలో పద్మం, దిగువ చేతిలో శంఖం ధరించి, ఈ దేవి ఒక దశలో పద్మాసనిగా, మరో దశలో సింహవాహినిగా దర్శనమిస్తుంది. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, అన్నపూర్ణగా, మహాలక్ష్మిగా, గాయత్రిగా, బాలాత్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.

-రామకిష్టయ్య