AADIVAVRAM - Others

గజగమనం.. శోభాయమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ‘మైసూరు దసరా ఉత్సవాల’లో ఏనుగులు చేసే సందడిని కనులారా వీక్షించాల్సిందే. ఆశ్వయుజ మాసంలో దేశవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ అయినప్పటికీ, అత్యంత కోలాహలంగా సాగే మైసూరు దసరా సంబరాలకు ఓ విశిష్ఠ స్థానం ఉంది. కర్నాటక సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే మైసూరు దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా అశేష జనసందోహం మధ్య జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులను ముందుగానే ఎంపిక చేసి వాటికి తగిన శిక్షణ ఇస్తారు. గజరాజులకు ప్రత్యేక ఆహారం సమకూర్చుతూ వాటి పోషణకు ప్రాధాన్యత ఇస్తారు.
మైసూరు రాజమందిరంలో మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ ప్రైవేటు దర్బార్ నిర్వహించడంతో మొదలయ్యే ఉత్సవాలు తొమ్మిదో రోజున కాగడాల ప్రదర్శనతో ముగుస్తాయి. వేడుకల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ క్రీడలు, ఫుడ్ ఫెస్టివల్, కవి సమ్మేళనాలు, పోలీసు బ్యాండ్, వైమానిక ప్రదర్శన, ఎగ్జిబిషన్లు వంటివి ఏర్పాటు చేసినా- అన్నింటికీ మించి ఏనుగులు పాల్గొనే ‘అంబారీ సవారీ’ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చాముండేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అంబారీని ఓ గజరాజు మోస్తుండగా మరో 11 ఏనుగులు అనుసరిస్తాయి. ఏనుగులు పాల్గొనే ఈ ‘జంబూ సవారీ’ని ఈనెల 19న నిర్వహిస్తారు. చాముండేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని అంబారీలో తీసుకువెళుతూ సాగే ఊరేగింపులో ఏనుగులే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రాజప్రాసాదం నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలోని ‘బన్నీ మండప’ మైదానం వరకూ ‘జంబూ సవారీ’ నయనానందకరంగా సాగుతుంది. ఒకప్పుడు మైసూరు రాజవంశీకులు బంగారు అంబారీపై ఊరేగేవారు. రాచరికాలు రద్దయిన తర్వాత చాముండేశ్వరి దేవి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా తీసుకువెళుతూ ‘జంబూ సవారీ’ని నిర్వహిస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం ‘మైసూరు దసరా ఉత్సవాల’లను అధికారికంగా నిర్వహిస్తూ పర్యాటకుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది.