Others

అలిగిన వేళనే (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అలిగిన వేళనే చూడాలి... గోకుల కృష్ణుని అందాలు’ అన్న ‘గుండమ్మకథ’ చిత్రంలోని పాట నాకెంతో ఇష్టం. పింగళి నాగేంద్రరావు రచించిన ఈ గీతాన్ని ఘంటసాల స్వర కల్పనలో పి సుశీల పాడారు. పాట సందర్భం, నడిక తీరు, పాత్రధారుల అభినయం కలగిలిపి వేడి మీగడ కమ్మదనాన్ని అనుభవంలోకి తెస్తుంది. సరసాన్ని సున్నితంగా తిరస్కరించటంతో అలిగిన భర్తను తన దారికి తెచ్చుకునేందుకు ఓ ఇల్లాలు పాడిన పాటగా ఎన్టీఆర్, సావిత్రిపై దీన్ని చిత్రీకరించారు. భర్త కోపాన్ని బాలకృష్ణుని చిలిపి పనులు, తల్లి యశోద మాతృవాత్సల్యానికి అన్వయస్తూ సందర్భోచితంగా మురిపెంగా తెలిపే ఈ పాట నచ్చని వారంటూ ఎవరూ ఉండరని నా అభిప్రాయం.
రుసరుసలాడే చూపులలోన/ ముసిముసి నవ్వుల అందాలు.. అన్న పంక్తిని సుశీలమ్మ ఎంత గొప్పగా పలికిందో సావిత్రి అంతకంటే గొప్పగా అభినయం చూపడం చెప్పుకోదగ్గది. అదొక్కటే కాదు, పాట మొత్తం పిల్ల తెమ్మెరలు మనమీద నుంచి ప్రవహిస్తున్నట్టుగా.. ఎప్పటికీ మదిలో నిలిచిపోయే చమత్కారమైన పాట. ఆలుమగల మధ్య అనురక్తి చక్కగా ఆవిష్కృతం చేసిన పాట. పాట వింటుంటే పాల వెనె్నల చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నట్టు, తులసికోట మీద నుంచి వీస్తున్న గాలి మనసును తాకుతున్నట్టు.. ఇలా ఒకటేమిటి వేనవేల భావనలు. ఒక చల్లని చంద్రకాంతి లాంటి పాట. అత్యంత మనోహరం, మధురం, కమనీయమైన ఈ పాటంటే చాలా ఇష్టం.

-కాయల నాగేంద్ర, హైదరాబాద్