Others

మార్క్స్ ఆర్థిక సూత్రాలకు ‘నోబెల్’ చెంపపెట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్తమాన సమాజానికి గుండెకాయ లాంటి ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని విలియం నార్డ్‌హాస్, పాల్ రోమర్‌లు దక్కించుకున్నారు. వాతావరణం, నూతన ఆవిష్కరణలను ఆర్థిక వృద్ధితో ఎలా అనుసంధానం చేయాలో వివరించినందుకు ఈ ఇద్దరికీ ప్రతిష్ఠాత్మక బహుమతి లభించింది. ప్రకృతి, విజ్ఞానం వల్ల ఆర్థిక వ్యవస్థల విశే్లషణల పరిధి ఎంతో విస్తృతమైనదని వారు రుజువుచేశారని ‘నోబెల్ అకాడమీ’ తెలిపింది. వాతావరణ విపత్తుల వేళ నష్టాన్ని తప్పించుకునేందుకు ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు అవసరమని నార్డ్‌హాస్ పేర్కొన్నారు. 1990లోనే భౌతిక, రసాయన, ఆర్థిక శాస్త్రాల సిద్ధాంతాల ఆధారంగా తన విధానాన్ని నార్డ్‌హాస్ రూపొందించారు. ఆర్థిక రంగం, వాతావరణం పరస్పరం ఆధారపడి పనిచేస్తూ సత్ఫలితాలు సాధించేందుకు అవకాశాలున్నాయని ఆయన సూత్రీకరించారు.
‘ఎండోజీనియస్ గ్రోత్ థియరీ’ని పాల్ రోమర్ ఆవిష్కరించారు. వస్తువుల కంటే నూతన ఆవిష్కరణలు ఎలా భిన్నమైనవో ఆయన వివరించారు. నూతన ఆవిష్కరణలను వివిధ సంస్థలు ప్రోత్సహించడంతో ఆర్థిక పరిస్థితుల చలనగతులు ఎలా ఉంటాయో ఆయన వివరించారు. సుస్థిర వృద్ధి అవకాశాలను విడిచిపెట్టకుండా పర్యావరణ రక్షణ దిశగా అభివృద్ధి సాధించవచ్చునని నార్డ్‌హాస్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు గ్రీన్‌హౌస్ వాయు స్థాయి తగ్గించుకోగలవన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
నవీన ఆవిష్కరణలతో ఆర్థిక చలనగతుల్లో ఎంతటి మార్పు కనిపిస్తుందో సాధారణ వ్యక్తి అనుభవంలోకి సైతం నేడు వస్తోంది. దీన్ని ఎంతో శాస్ర్తియంగా, ఆర్థిక నిపుణుల అనుమానాలు నివృత్తి చేస్తూ కొనసాగిన ‘ఎండోజీనియస్ థియరీ’ ఈ కాలపు ఆర్థిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతో సంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాల ఆట కట్టినట్టయింది. ‘నవ కల్పనలు’ అన్న మాటలోనే అనేకానేక నూతన ఆర్థిక సమీకరణలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని- ‘ఆర్థిక శాస్త్రంపై మనుషుల ప్రవర్తన ప్రభావం’ అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రొఫెసర్ రిచర్డ్ థాలర్ అందుకున్నారు. ఈ ఏడాది రోమర్ ప్రతిపాదించిన నూతన ఆవిష్కరణల కారణగా ఆర్థిక చలన గతుల్లో మార్పుపై అధ్యయనానికి అవార్డు రావడమంటే ఆర్థిక శాస్త్ర విస్తృతి ఎలా పెరుగుతున్నదో అవగతమవుతోంది.
మనిషి ప్రవర్తనకు, నూతన ఆవిష్కరణలకు ఆర్థిక రంగం చలన గతులకు సామీప్యత ఉందని చెప్పడం.. రుజువు చేయడంతో అవగాహన పరిధి ఎంతో విస్తృతమవుతోంది. కారల్ మార్క్స్ ఆర్థిక విశే్లషణలకు, వర్తమాన కాలపు ఆర్థిక విశే్లషణలకు గల వ్యత్యాసాన్ని ఇట్టే పసిగట్టవచ్చు. శ్రమ, మూలధనం (పెట్టుబడి), వస్తువుల తయారీ, విక్రయం ఇదే చట్రంలో తిరిగిన ‘మార్క్స్ విశే్లషణ’ ఎంత పురాతనమైనదో, ఎంతగా కాలం చెల్లినదో గత ఏడాది, ఈ ఏడాది నోబెల్ బహుమతులు అందుకున్న ఆర్థిక విశే్లషణలు చెబుతున్నాయి. వర్తమాన విశే్లషణలపై ఆధారపడి మనుగడ సాగించడం సబబుగా ఉంటుంది తప్ప 170 ఏళ్ళ క్రితం మార్క్స్ ప్రవచించిన ఆర్థిక సూత్రాల ప్రకారం నేటి సమాజాన్ని విశే్లషించడం ఎంతటి మూర్ఖత్వమో ఇట్టే తెలుస్తోంది.
ఏటా ఎన్నో ఆవిష్కరణలు వివిధ రంగాలలో చోటుచేసుకుంటున్నాయి. వాటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక చలన గతులపై పడుతుందన్న స్పృహ లేకుండా ఇప్పటికీ మార్క్స్ ఆర్థిక విశే్లషణలపై మనసు పెట్టడం ఎంతటి కాలం చెల్లిన పద్ధతో ఎవరికివారే అర్థం చేసుకోవచ్చు. కాగా, మార్క్స్ సిద్ధాంతాల ఆధారంగా ప్రస్తుతం మన దేశంలో మావోయిస్టులు మరణ మృదంగం కొనసాగిస్తున్నారు. భారీ సంఖ్యలో మందిని పొట్టన పెట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందా? వాతావరణంలోని మార్పులు సైతం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని విలియం నార్డ్‌హాస్ ప్రతిపాదించి నోబెల్‌ను ఎగురేసుకుపోతే మావోయిస్టులకు మాత్రం ఇంకా ‘శ్రమ దోపిడీ’ వల్లే సమాజంలో అసమానతలు కనిపించడం విడ్డూరం! మార్క్స్ ప్రతిపాదనలకు, 21వ శతాబ్దపు మానవుని ప్రవర్తనకు, నూతన ఆవిష్కరణలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. ఆవిరి యంత్రం కనుగొన్న కాలం నాటి విశే్లషణలు నాల్గవ పారిశ్రామిక విప్లవం రెక్క విప్పుకున్న నేపథ్యంలోనూ సమాజానికి అంతే సాంద్రతతో అన్వయమవుతాయనుకోవడం అర్థరహితం. ఈ సూక్ష్మ విషయం మార్క్సిస్టులకు, మావోలకు బోధపడకపోవడం మహా విషాదం.
పడిన కీలక వికెట్..
కాలం చెల్లిన సిద్ధాంతాలతో దండకారణ్యంలో మారణహోమం సృష్టిస్తున్న మావోయిస్టుల కీలక ‘వికెట్’ ఒకటి పడిపోయింది. కరడుగట్టిన హిడ్మా బెటాలియన్‌లో సెక్షన్ కమాండర్‌గా పనిచేసిన పోడియం ముడాను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. దీంతో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టయింది. అతని వద్ద 20 డిటోనేటర్లు, 20 జిలిటిన్ స్టిక్స్ సైతం స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా అతుల్ పారాకు చెందిన 32 ఏళ్ల ముడా 15 కీలక దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం. అక్షరం ముక్క రాని ముడా 2005లో దళ సభ్యుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రముఖ నాయకుడు మహేంద్ర వర్మను కాల్చి చంపిన ఘటనలో, పెద్ద ఎత్తున సిఆర్‌పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న దాడుల్లోనూ ఇతను కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. అనేకమంది పౌరులను హతమార్చడమే గాక ఆయుధాలను అపహరించాడు.
డంప్ స్వాధీనం...
ఇక ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు (ఏఓబీ)లో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల అనంతరం మావోల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరాపుట్ జిల్లా పొట్టంగి అటవీ ప్రాంతంలో మావోల శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఆ సమయంలో మావోయిస్టు అగ్రనేతలు శిబిరం నుంచి చాకచక్యంగా పారిపోయారని తెలిసింది. ఏది ఏమైనా ఈ ఘటన సైతం మావోయిస్టులకు నష్టం చేకూర్చింది. కొన్ని రోజుల క్రితం విశాఖ మన్యంలో ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను హత్యచేసిన అనంతరం పెరిగిన ఒత్తిడి, గాలింపు కారణంగా మావోయిస్టులు పరుగులు పెడుతున్నారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ చెట్టు తొర్రలోనుంచి మావోల ఆధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సంక్షేమంతోనే సమ్మిళిత అభివృద్ధి...
ఇటీవల హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనామిక్, సోషల్ స్టడీస్ (సెస్) ఆధ్వర్యంలో ‘సమ్మిళిత అభివృద్ధి- సమస్యలు, సవాళ్లు’ అన్న అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది. భారతదేశంలో భిన్న సంస్కృతులు- సంప్రదాయాల మధ్య ప్రజలు సహజీవనం కొనసాగిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారని వక్తలు అన్నారు. పట్టణ,గ్రామీణ ప్రాంతాల ప్రజల సమన్వయంగా సాగుతున్న వైనాన్ని గుర్తుచేశారు. వందకోట్లకుపైగా జనాభా ఉన్న దేశంలో ప్రజల అభివృద్ధి ఆశాజనకంగా కనిపిస్తోందన్నారు.
లొంగుబాటు-కుంగుబాటు...
మావోయిస్టు కీలక నేతలు కోటి పురుషోత్తం అలియాస్ శరత్‌చంద్ర, అతని భార్య కోటి వినోదిని అలియాస్ భారతక్క ఇటీవల హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ముందు లొంగిపోయారు. పురుషోత్తంపై రూ.8 లక్షలు, వినోదినిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. గత 35 ఏళ్లుగా పార్టీలో పనిచేసిన వీరిద్దరూ పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ వైఖరిని, విధానాలను తప్పుపట్టారు. ఇటీవల జరిగిన గిరిజన ప్రజా ప్రతినిధుల హత్యలను వారు ఖండించారు. పార్టీలో మానవ సంబంధాలపై తీరుపైనా వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. తాము అనారోగ్యంతో బాధపడుతున్నా అగ్రనేతలు పట్టించుకోలేదని వినోదిని ఆరోపించారు. ఎన్నో త్యాగాలు చేసి, అంకితభావంతో పనిచేసినా కొంతకాలంగా పార్టీ తనను పక్కన పెట్టడం తననెంతో కలచివేసిందని పురుషోత్తం విమర్శించారు. ముఖ్యంగా రామకృష్ణ అలియాస్ ఆర్కె, ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిల వైఖరిపై, పద్ధతులపై పురుషోత్తం పళ్లు పటపట కొరికారు.
గత ఏడాది జినుగు నరసింహారెడ్డి లొంగిపోయినపుడు చేసిన విమర్శలు, తాజాగా మరో కీలక నేత పురుషోత్తం చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే మావోయిస్టు పార్టీ అంత సవ్యంగా కొనసాగున్నట్టు కనిపించడం లేదు. వారిలో కుంగుబాటు స్పష్టంగా కనిపిస్తోంది.
కొసమెరుపు..
గత 45 ఏళ్ళుగా ఎన్నికలను బహిష్కరించమని పాటలు, పద్యాలు పాడి మావోల సాంస్కృతిక సైనికుడిగా పనిచేసిన గద్దర్ ఇపుడు ‘ఓటు విలువ’ను తెలియజేస్తూ ప్రచారం చేస్తాడట! అందరూ బలపరిస్తే గజ్వేల్ నుంచి ఎన్నికల బరిలో నిలబడతాడట! ఇదండీ.. పరిణామ క్రమం! దీనికోసం వందలాదిమంది ప్రాణాలు బలిగొనాలా? ఆ పాపంలో గద్దర్‌కు భాగం లేదా..?

--వుప్పల నరసింహం 99857 81790