Others

మహాత్ముల సన్నిధి భక్తులకు పెన్నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి బాలారామ్ సోదరులైన బాబుల్జీ, వామనరావు శిరిడీ వెళ్లారు. వారు బాబాను దర్శించుకుని సంతోషించారు. బాబా సమక్షంలో తమకు కలిగిన ఆనందాన్ని, మనశ్శాంతిని ఇతరులతో వర్ణించి చెప్పేవారు. అదే విషయాన్ని తమ సోదరుడైన బాలారామ్‌కు కూడా చెప్పారు. దాంతో బాలారామ్‌కు బాబాను చూడాలనే ఆత్రం పెరిగింది. ఒకసారి అందరితో కలిసి శిరిడీ ప్రయాణమయ్యారు. వారు శిరిడీకి రావటానికి ముందే బాబా మసీదులో వున్న కొందరు భక్తులతో, ‘‘ఈరోజు నా దర్బారు జనులు వస్తున్నారు’’ అని పలికారు. నిజంగానే కొంతసేపటికి బాలారామ్ తదితరులు శిరిడీ వచ్చారు. మీరు వస్తున్నట్లు బాబా ఇంతకుముందే చెప్పారని తోటి భక్తులు చెప్పగా బాలారామ్ ఆశ్చర్యపోరు. తాము వస్తున్న విషయం బాబాకు కానీ, మరెవరికీ కాని చెప్పలేదని వారు చెప్పారు. బాలారామ్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాతో కబుర్లాడుతూ కూర్చున్నారు. బాబా అక్కడకున్న భక్తులతో ‘‘వీరే నా దర్బారు జనులు. ఇంతకుముందు నేను చెప్పింది వీరి గురించే’’ అన్నారు. అనంతరం బాలారామ్ దురంధర్ తదితరులతో బాబా ‘‘గత అరవై సంవత్సరాలనుంచి మనం ఒకరికొకరం పరిచయస్తులమే’’ అన్నారు. బాలరామ్ సోదరులు మిక్కిలి వినయ విధేయతలు గలవారు. వారందరూ బాబాకు మరోసారి నమస్కరించారు. బాలారామ్ బాబా పాదాలు వత్తుతూ కూర్చున్నారు. యోగీశ్వరుల నిజమైన దర్శనం కలిగినపుడు భక్తులకు శరీరం జలదరించటం, కంటతడి కావటం, రోమాలు నిక్కబొడచటం, గొంతుకు ఆర్చుకుపోవడం జరుగుతుందట. బాలారామ్, అతని సోదరులకు అదే అనుభవమైంది. భోజనానంతరం బాలారామ్ తిరిగి మసీదుకు వచ్చి బాబా దగ్గర కూర్చుని, బాబా పాదాలు వత్తేవాడు.
------
సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566