Others

జేజేలు జగదాంబ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అయిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే’’-
ప్రాణికోటి అంతా జన్మ మృత్యు జరావ్యాధులతో నిత్యమూ సతమతమవుతుంటారు. వీటి నుంచి తప్పించుకోవాలంటే జగజ్జననిని శరణు వేడాలి. మనలోని దుష్టత్వాన్ని దునుమాడి, నీతిని, నిర్మలత్వాన్ని, విశ్వైక ప్రేమను పాదుకొల్పే ఆ తల్లిని శరన్నవరాత్రుల్లో కేవలం తొమ్మిదిరోజులు కొలిచి పూజించాలి. మనలను ధర్మమార్గంలో నడిపించడానికి సదా వెన్నంటి అమ్మ మనతోనే ఉంటుంది. ‘ఇష్టశ్చోర్జశ్చ శారదావృతూ’’ అన్నది శ్రుతి. ఇషః అనగా అశ్వని మాసము లేక ఆశ్వయుజ మాసము అని అర్థము. అశ్వనీ నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసము- ఆశ్వయుజమాసం. అశ్వనీ నక్షత్రానికి, అశ్వినీదేవతలు అధిదేవతలు. అశ్వనీ దేవతలు- సూర్యపుత్రులు- అధిదేవతలైన అశ్వనీ దేవతలు ఆశ్వయుజ మాసంలో, శుక్ల పక్షం మొదటిదైన పాడ్యమి తిథినాడు, కన్యారాశిలో సూర్యుడు ఉండగా, చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రమునందు, దేవీ నవరాత్రుత్సవములకు కలశస్థాపన చేస్తారు. నవరాత్రి ముగింపుగా, చంద్ర నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో శమీపూజతో శివశకె్తైకర్యంగా కలశోద్వాసన చేస్తారు.‘శ’కారం ఐశ్వర్యాన్ని,‘క్తి’ పరాక్రమాల్ని తెలియచేసే శబ్దాలు. అమ్మకు, స్వామికి భేదం లేదు. పదార్థ ము, శక్తి కలయక వలనే సృష్టి జరుగుతుంది కనుక శివశక్తులకు భేదం లేదు. నవరాత్రి లో నవ అనగా పరమేశ్వరుడని రాత్రి అంటే పరమేశ్వరి అని నిర్ణయ సింధువు తెల్పుతోంది కనుకనే ‘‘రాత్రి శబ్దస్య తిథివాచక త్వాత్’’ అనేదాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థము తీసికొని పాడ్యమి తిథి నుంచి నవమి తిథి వరకు దేవీపూజ చేస్తారు. పగలు పరమేశ్వరుడిని ఆరాధించి, రాత్రి వేళ శక్తి స్వరూపిణి అయన తల్లిని అర్చిస్తారు. ‘దుష్టమార్గం గమయతి ఇతి దుర్గాః’ అన్నట్లుగా ఈ దుర్గాదేవిని పూజిస్తే ఎలాంటి కష్టాలనైనా ఇట్టే గట్టెక్కిస్తుందని, ధైర్యానికి, విజయా నికి మారుపేరైన ఈ తల్లిని శరన్నవరాత్రులలో విశేషంగా పూజిస్తారు. ఈ థుర్గాష్టమి రోజు లలితా సహస్ర నామం పఠించేవారికి ఎలాంటి భయాలు దరిచేరవు. నవరాత్రుల్లో సరస్వతీ దేవిని మూలానక్షత్రం, సప్తమి తిథినాడు పూజిస్తారు. సరస్వతీ దేవి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి అనే ఏడు రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో ప్రస్తావించారు. త్రిశక్తుల్లో ఒకటైన మహాసరస్వతిదేవి శుంభ నిశుంభులనే రాక్షసుల్ని వధించింది. దీనికి నిదర్శనంగా అమ్మవారికి ?సరస్వతీదేవి అలంకారం చేస్తారు. ‘‘వాగ్దేవి వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా అంటూ సరస్వతి దేవి అని పూజిస్తే సకల విద్యలూ లభ్యమవుతాయ. మానవునిలో గుణాలవల్ల కలిగే వికారాలను నశింపచేసే ఆకారమే మహిషాసుర మర్దిని అవతారం. ‘సాటిలేని మేటిని నేనే’ అని గర్వాంధ కారంతో కళ్లు మూసుకుపోయ మహిషుడను అసురుడిని సంహరిం చడం కోసం అమ్మ మహిషాసుర మర్దని అయంది. ఇక ఈ దీక్షలో మహర్నవమి మరీ మఖ్యమైనది. సాధకు లకు మహర్నవమి మంత్రసిద్ధి జరిగే రోజని ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు. ఈరోజునే ముతె్తైదువులకు పండు తాంబూలాలతోపాటుగా వస్తద్రానం చేస్తారు. ఏ రోజైనా అమ్మను స్తుతించిన వారికి సర్వశుభాలు కలుగుతాయ. ఈ నవరాత్రుల్లో అమ్మను పూజించినవారికి సకల వ్యాధుల బారినుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది, అపమృత్యువును పోగొడుతుంది, పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది, ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిచ్చి, మనిషిలోని దైవీశక్తిని పెంపొందిస్తుంది.
‘‘నదీనం సాగరోగతిః’’ అన్నట్లు తల్లిని ఎన్ని విధాలుగా ఎన్ని రూపాలుగా స్తుతించినా, కీర్తించినా, అర్చించినా అవన్నీ జగాలకే మాతైన జగన్మాతకే చేరుతాయ. చివరకు విజయాలను చేకూర్చే తల్లిగా విజయలక్ష్మిగా సంభావిస్తూ తల్లిని స్తుతిస్తారు.
*

- జంగం శ్రీనివాసులు