Others

జ్ఞానానికి మార్గం ప్రశ్నించే తత త వం (ఓషో బోధ......)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓషో బోధ......

మృగరాజైన సింహం కూడా రోదిస్తూ గర్జించినట్లుగానే మనిషిలోని సింహం కూడా అధికారాలన్నింటికీ వ్యతిరేకంగా గర్జిస్తూనే ఉంటుంది.
ఒంటెకు వ్యతిరేకంగా తిరగబడే సింహం కేవలం ఒక ప్రతిస్పందన మాత్రమే. కాబట్టి, ఇప్పుడు ప్రతి వ్యక్తి ప్రామాణికమైన విలువలన్నింటికీ మూలాధారమైన తనలోని అంతర్జ్యోతిని కనుక్కోవాలి. అప్పుడే తనలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని తెలుసుకోవడం తన ప్రాథమిక కర్తవ్యమని అతనికి తెలుస్తుంది. కానీ, కొంతమంది సింహం స్థాయి దగ్గరే ఆగిపోయి ఊరికే అరుస్తూ తమ శక్తిని కోల్పోతారు. సింహంలా అవడం మంచిదే. కానీ, అక్కడే ఆగిపోకుండా ముందుకు దూకాలి. ఆ దూకుడే శిశువుగా మారడం.
ఇప్పుడు మీరందరూ పసితనంలోనే ఉన్నారు. కానీ, తెలివిగల వారెవరైనా అది అసలైన పసితనం కాదంటారు. ఎందుకంటే, అది పాల దంతాల పసితనం. పైకి, అవి దంతాలుగా కనిపించినా వాటివల్ల ప్రయోజనముండదు. ఎందుకంటే, అవన్నీ రాలిపోయే దంతాలే. అవి పూర్తిగా రాలిన తరువాతే అసలైన దంతాలు వస్తాయి. కాబట్టి, తొలి బాల్యం అసలైన పసితనం కాదు. ఆ తరువాత వచ్చే బాల్యమే అసలైన పసితనం. అదే ముని దశ లాంటి శైశవ దశ. ఆ రెండు దశల అర్థం ఒకటే.
మనిషి పూర్తిగా అమాయకుడైపోవాలి. అలాగే గతంనుంచి పూర్తిగా విముక్తుడవాలి. అయినా గతాన్ని ఏమాత్రం వ్యతిరేకించకూడదు. ఎందుకంటే, గతాన్ని వ్యతిరేకించేవారికి స్వేచ్ఛ లేనట్లే. అలాంటివారు ఈర్ష్య, అసూయ, ద్వేషాల వంటి గాయాలతో ఉంటారు. అందుకే వారిని ఒంటెస్థాయి నీడలా వెంటాడుతూ ఉంటుంది. సింహం స్థాయికూడా ఉంది. అయినా ఒంటె నీడ మిమ్మల్ని వెంటాడుతుందేమోనని మీరు భయపడుతూనే ఉంటారు. ఆ భయం పూర్తిగా పోయిన వెంటనే సింహగర్జనలు కూడా ఆగిపోతాయి. అప్పుడే శివుడు కేరింతలు ఉదయిస్తాయి. కాబట్టి, మీరందరూ అత్యంత విలువైన ఒంటె, సింహం, శిశువుస్థాయిల్లోకి చాలా లోతుగా చొచ్చుకుపోవాలని నేను కోరుకుంటున్నాను.
తల్లి గర్భంలోని శిశువు తొమ్మిది నెలలపాటు తల్లినుండి తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం లాంటిదే ఒంటె దశలో జరిగే జీర్ణప్రక్రియ. అలా ఆ శిశువు తల్లిగర్భంలో కేవలం తినడం, నిద్రపోవడం మాత్రమే చేస్తూ మెల్లమెల్లగా ఎదిగి తొమ్మిది నెలల తరువాత ఈ ప్రపంచంలోకి వస్తుంది. అలా వచ్చిన తరువాత కూడా ఆ శిశువు కొన్ని నెలలపాటు తినడం, నిద్రపోవడం మాత్రమే చేస్తుంది. కానీ, కాలక్రమంలో శిశువు తినడం, నిద్రపోవడం తగ్గించి ఒక వ్యక్తిగా ఎదుగుతుంది. అలా ఎదిగిన వెంటనే చెప్పిన మాట వినకుండా ‘వద్దు’అని చెప్పడం ప్రారంభిస్తుంది. అంటే శిశువులో అవిధేయత ప్రవేశించినట్లే. అలా ఆ శిశువులో విధేయత మరణించి అవిధేయత పుట్టుకొస్తుంది.
ఒంటెకు కేవలం జీర్ణం చేసుకోవడం మాత్రమే తెలుసుకానీ, ‘వద్దు’ అని ఎలా చెప్పాలో దానికి తెలియదు. ఎందుకంటే, ఆ పదాన్ని అది ఎప్పుడూ వినలేదు. అందువల్ల దానికి ఆ పదమే తెలియదు. అందుకే ‘వద్దు’ అని చెప్పడంలోని ఆనందాన్ని అది ఎప్పుడూ రుచి చూడలేదు. దానికి కేవలం ‘అవును’ అని చెప్పడం మాత్రమే తెలుసు.
ఎందుకంటే, దానికి బోధించినది అదే. అందుకే అది చెప్పే ‘అవును’ అంత గంభీరంగా ఉండదు. ఎందుకంటే, ‘వద్దు’ అని చెప్పడమెలాగో తెలియనివారు చెప్పే ‘అవును’ చాలా పేలవంగా ఉంటుందే కానీ, గంభీరంగా ఉండదు. ఎందుకంటే, దానిలో జీవముండదు.
విధేయత, విశ్వాసం ఒంటెస్థాయి లక్షణాలు. ఆదాము జ్ఞానవృక్ష ఫలం తినడానికి ముందున్న స్థితి అదే. అదే మనసు, ఆత్మల పూర్వస్థితి. అంతవరకు మనసు అనేదే లేదు. అది ఎదుగుతోందే కానీ, పూర్తిగా ఎదగలేదు. పైగా, అది చాలా అస్పష్టంగా, సందిగ్ధంగా, అంధకారంలో నిరాకారంగా ఉంది. ఆత్మ ఇంకా మార్గమధ్యంలోనే ఉంది. అందుకే దానికి స్పష్టమైన నిర్వచనాలు లేవు. శిశువుకు తన గురించి విడిగా ఏమీ తెలియదు.
-----------------------------
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.