Others

నియమాల అంతరార్థంపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్తదేవుడు (నియమదేవుడు)గా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రం. ఆయన వ్రతదీక్ష కఠిన నియమాలతో కూడినది. ఆ స్వామి గర్భాలయంలోకి కొన్ని వయసుల పరిధిలో ఉన్న ఆడువారు ప్రవేశించరాదని తరతరాలుగా వస్తున్న అనాదికాలపు నియమాచారం. ఆ నియమం మానవులు పెట్టినది కాదు- అది శాస్తదేవుడు స్వయంగా పాటించి తనకు తానుగా ఏర్పరచుకొన్న నియమం. ఆ నియమాన్ని దేవస్థానం- భక్తులూ పాటిస్తున్నారు తప్ప తాముగా ఏర్పరచినది కాదు. ఆఫ్ట్రరాల్, ఒక మంత్రి కాని, ఒక ప్రముఖ వ్యక్తికాని ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే- కలవడానికి ఇష్టపడకపోతే అది అతని హక్కుగా గుర్తిస్తున్న న్యాయస్థానం, ఒక దేవతామూర్తి తనకు తానుగా ఏర్పరచుకున్న నియమాన్ని కాదనటం ఎంతవరకు సబబు. ఒక మనిషికి గల హక్కు దైవానికి లేదా? ఆ నియమాన్ని భంగపరచటం- అనాదిగా వస్తున్న నియమానికి నిన్న మొన్నటి రాజ్యాంగ సూత్రాలను వర్తింపజేయటం న్యాయమా? దైవం మాట్లాడడు కనుక మన ఇష్టానుసారం చేయటం ధర్మమా? ఈ సందర్భంలో ఒక ఉర్దూ సామెత గుర్తుచేస్తున్నాను. ‘‘అల్లాకే దువామే - అల్లాకే మార్‌మే - ఆవాజ్ నహీ రహతే’’- భగవంతుని ఆశీర్వాదంలోనూ భగవంతుడు చేసే శిక్షణలోనూ శబ్దం ఉండదు- అని.
హిందూ సంప్రదాయంలోనే కాదు అన్ని మత సంప్రదాయాలలో కూడా కొన్ని నియమాలున్నాయి. ‘నాశ్రే్శయో నియమం వినా’ అనేది వేద విహితధర్మం. ఆ విధంగా ప్రతి దేవునికీ ఒక నియమం ఉంది. ఉదా- ఆంజనేయస్వామిని ఆడువారు ముట్టుకొనకూడదు. మగవారైనా పాదాలను మాత్రమే స్పృశించాలి- లేదు మాకు ఆంజనేయస్వామి అంటే భక్తి ఎక్కువ, మేమతణ్ణి భక్తితో కౌగిలించుకుంటాం అంటే చెల్లుతుందా? దైవం పట్ల గల భక్తి ప్రపత్తులు- దైవ నియమాల పట్ల కూడా ఉండాలి కదా! అది మేము పాటించం అంటే అది భక్తి కాదు- పంతం అవుతుంది. అలాగే వైష్ణవ దేవాలయాలలో అర్చామూర్తిని- మూల విరాట్టును అర్చకుడు తప్ప మరెవ్వరికీ ముట్టుకునే అధికారం లేదు. ఎంతటివారైనా వేంకటేశ్వరస్వామిని దర్శనంతోనే సరిపెట్టుకోవాలి. లేదు కాదు, మేము ఆ స్వామి పాదాలను పట్టుకొని దండం పెడతాము అంటే ఒప్పుకుంటామా? అది రాక్షసతత్వం (రావణాసురుడు ఆత్మలింగాన్ని కోరినట్లు). అలాగే వినాయకుని పూజలో తులసి నిషిద్ధం- సాలగ్రామలకు స్ర్తిలు పూజ చేయరాదు- మొగిలిపూవు శివునికి నిషిద్ధం- ఇలా చాలా నియమాలున్నాయి. ప్రతి నియమానికి అంతరార్థ పరమార్థం ఉంటుంది. అదీ పండితుల ద్వారా తెలుసుకోవాలి కాని, నాకు స్వాతంత్య్రం ఉంది, ఈ పని చేస్తాను అనటం వ్యక్తి నియంతృత్వం అవుతుంది. ఈ సందర్భంలో హేతువాదులు చెప్పే వాదం- దేవుడొక్కడే- అతడు అందరికీ సమానుడే- నిజమే. దేవుడొక్కడే- గుణతత్త్వాలు వేరు కాదా? ప్రభుత్వం అంతా ఒక్కటీ- పోలీస్ కమీషనర్ విధులు - మున్సిపల్ కమీషనర్ విధులూ ఒక్కటౌతాయా? ప్రధానమంత్రి ప్రజలవాడే- అట్లా అని ఎప్పుడుపడితే అప్పుడు కలుస్తానంటే కుదురుతుందా?

- ఉమాపతి బి.శర్మ