Others

సిరులుకురిపించే సిరిమానోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా అలరారే శ్రీ పైడితల్లి అమ్మవారు సిరిమానోత్సవం ఈ నెల 23న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పైడితల్లి అమ్మవారి ప్రతిరూపంగా ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు సిరిమాను పీఠాన్ని అధిరోహిస్తారు. ఈ సిరిమానోత్సవానికి సంబంధించి ఎన్నోఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. సిరిమానును వినియోగించే పవిత్ర వృక్షం ఎక్కడ ఉన్నదీ అమ్మవారు పూజారి కలలో కన్పించి చెబుతుందని భక్తుల విశ్వాసం. పండుగకు నెల రోజుల ముందు ఈ వృక్షం గురించి చెబుతుంది. అమ్మవారు చెప్పిన ప్రకారం ఆ స్థలంలో ఆ వృక్షాన్ని గుర్తించి పూజలు చేస్తారు. చెట్టు వద్ద అమ్మవారికి ఉపాసన చేస్తారు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆ వృక్షాన్ని నరికి ఆలయ ప్రధాన పూజారి వెంకట్రావు ఇంటికి తెస్తారు. అక్కడే సిరిమాను పీఠాన్ని తయారు చేస్తారు. సుమారు 40,60 అడుగుల ఎత్తున ఉన్న ఆ పీఠాన్ని ఆలయ పూజారి అధిరోహిస్తారు. సిరిమాను రథం అగ్రభాగాన పాలధార, అంజలి, జాలారీ వల ఉంటాయి. ఈ రథం మూడు లాంతర్ల వద్ద ఆలయం నుంచి బయలుదేరి కోట వరకు ముమ్మారు ప్రదక్షిణలు చేస్తుంది. అక్కడ రాజవంశీయులు ఇచ్చిన పట్టు వస్త్రాలను స్వీకరించి పూసపాటి వంశీయులను ఆశీర్వదిస్తుంది. ఈ అమ్మవారి పాదాలను తాకాలనే ఉద్దేశ్యంతో భక్తులు అరటి పండ్లను అమ్మవారికి ప్రతిరూపంగా ఉన్న పూజారి కాళ్లకు తగిలేలా వాటిని విసురుతారు. అవి పూజారి కాళ్లకు తగిలితే తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా దసరా తరువాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తొంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్రతోపాటు తెలంగాణా, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ వంటి దూరప్రాంతాల నుంచి తరలివసస్తుంటారు.
తోడేళ్ల ఉత్సవం
ఈ ఉత్సవానికి ముందురోజు పట్టణంలో తోలేళ్లు ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఘటాలను చదురుగుడి నుంచి కోటకు తీసుకువెళ్తారు. రాజవంశీయుల సాంప్రదాయ పూజా కార్యక్రమాలు జరిగాక తిరిగి ఆ ఘటాలను అమ్మవారి ఎదుట ఉంచుతారు. జనులంతా అమ్మవారిని అమ్మవారిని సేవించి మ్రొక్కుబడులు చెల్లిస్తారు. వామహస్తాల్లో ఖడ్గం త్రిశూలం, దక్షిణ హస్తాల్లో డమరకం, పసుపు కుంకుమల్లో జలకాలాడే ఆ చల్లని తల్లి దీవెనలు అందుకుంటారు. వివిధ వేషధారణలతో మొక్కుబడులు చెల్లిస్తారు. స్ర్తిలు బిందెలతో పసుపు నీళ్లు తెచ్చి అమ్మవారి మెట్లకు అభిషేకం చేస్తారు.
అమ్మవారు వెలసిన వైనం
17వ శతాబ్ధంలో విజయరామ గజపతులు నిజాంల నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ఫ్రెంచి సైన్యాధిపతి బుస్సీతో విజయరామరాజు చేతులు కలిపి బొబ్బిలి యుద్ధానికి దిగారు. ఆ యుద్ధం వద్దని పైడిమాంబ తన అన్నకు శతపోరి చెప్పింది. ఆమె మాటలను విజయరామరాజు చెవికెక్కలేదు. యుద్ధంలో గజపతి దక్కలేదు. జనం సుఖపడలేదు. దీంతో ఆ చిన్నారి పైడితల్లి ఆవేదన చెంది పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో తనువు చాలించిందని చరిత్ర చెబుతుంది. అలనాటి రాజులకు అత్యంత సన్నిహితంగా మెలిగిన పతివాడ అప్పలనాయుడుకు ఆ రోజే కలలో కన్పించి తాను పశ్చిమ దిక్కున గల పెద్ద చెరువులో తన విగ్రహాన్ని వెలికి తీసి ప్రతిష్టించమని, తమను చల్లగా కాపాడుతానని తెలిపింది. ఆ ప్రకారమే పైడితల్లి చెప్పిన విధంగా పెద్ద చెరువులో జాలార్లతో విగ్రహాన్ని వెలికితీసి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా వనంగుడి వద్ద ప్రతిష్టించారు. 1923లో మూడు లాంతర్ల వద్ద చదురుగుడిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి అక్కడ కూడా పూజలు నిర్వహిస్తున్నారు.
*

- బొండా రామకృష్ణ, విజయనగరం