Others

గంగానది పరిరక్షణోద్యమంలో కర్మయోగుల బలిదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రాయోపవేశ దీక్ష’ అంటే మరణాన్ని స్వచ్ఛందంగా ఆహ్వానించటం. అహింసా యుతంగా, ధర్మనివేశంతో సమాజ శ్రేయస్సు, జనజీవన సంక్షేమానికి కట్టుబడి నిరాహారంగా ఆత్మార్పణ చేయడం కొందరు మహాత్ములకే సాధ్యం. మహాకవి కాళిదాసు హిమవత్పర్వతాలను నిరంతరం సకల దేవతామూర్తుల ఆత్మలు కొలువుండే నగాధిరాజుగా ప్రస్తుతించాడు. సనాతన భారతీయ ఐహిక, ఆయుష్మిక మహోన్నతమైన ఆధ్యాత్మికతకు ఆరాధ్యనీయంగా హిమాలయాలపైన, గంగానదీ తీరంలోనూ నేటికీ పవిత్ర యోగి పుంగవుల ఆశ్రమాలు మనకు గోచరిస్తాయి. హిమాలయాల ప్రకృతి రమణీయతలో తపశ్చర్యలతో జీవన్ముక్తి సాధించే కఠోర సాధనలో నిమగ్నమవుతూ జీవించే సాధుసత్పురుషులైన యోగి పుంగవులు పర్యావరణ ప్రేమికులు. తామరాకుపై నీటిబొట్టులా జీవించే ఆ మహనీయులను- పవిత్ర గంగానది కాలుష్యపు కోరలలో చిక్కుకోవటం నిరంతర వేదనకు గురి చేసింది.
యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు పుణ్యక్షేత్రాలకు నిలయమైన ఉత్తరాఖండ్‌లో ఇపుడు అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతోంది. గంగానదిపై హైడ్రో పవర్ ప్రాజెక్టులు, నదీ తీరంలో కొండలు, అటవీ ప్రాంతాలను కొల్లగొట్టే గనుల తవ్వకాలు, అడవుల విధ్వంసం యథేచ్ఛగా సాగుతోంది. దానికితోడు గ్లోబల్ వార్మింగ్ దుష్పరిణామాలు, జీవనది ఊపిరిని హరించే నగర, పారిశ్రామిక కాలుష్యం గంగామాత రక్షణోద్యమాలకు- అక్కడి సాధుసత్పురుష పర్యావరణ ప్రేమికులు, కాషాయాంబరధారుల హృదయాలను చలింపచేసింది. ఈ ఉద్యమ పధంలో సారథ్యం చేపట్టే ఆశయం క్రమేపీ వారి జీవన లక్ష్యమైంది.
గల్యాల్ హిమాలయ ప్రాంతాలలో 10,300 అడుగుల ఎత్తున ఉన్న గంగోత్రికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో వున్న గోముఖ్- గంగానది జన్మస్థలం. అదుపులేని నిర్మాణాల కోసం ఖోజ్ క్యాంప్ నుంచి గోముఖ్ వైపు విచక్షణా రహితంగా అడవుల విధ్వంసం జరుగుతుండగా మైనింగ్ మాఫియా రంగప్రవేశం చేసింది. 2006లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ చట్టం చేసినా, అక్రమ మైనింగ్‌ను నిరోధించే అధికారం ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే వుంది. భాగీరధి నది గోముఖ్ నుంచి ఉత్తర కాశీవరకు 135 కి.మీ పొడవున ఉన్న ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం ‘ఎకో సెన్సిటివ్ జోన్’గా ఉత్తర్వులు జారీ చేసింది. 1986లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘గంగానది కాలుష్య నియంత్రణ కార్యాచరణ’ను ప్రారంభించినా, ప్రస్తుత మోదీ ప్రభుత్వం ‘నమామి గంగ’ పథకానికి నడుం బిగించినా మూడు దశాబ్దాలకు పైగా గంగానది కాలుష్య తీవ్రతతో సతమతమవుతోంది.
గాంధేయవాద చిప్కో ఉద్యమాలు, చండీప్రసాద్ భట్, మీరా బెహన్, సరళా బెహన్, సుందర్‌లాల్ బహుగుణ, బాబా ఆమ్టే, మేధా పాట్కర్, రాజేంద్రసింగ్, రవిచోప్రా, సిద్ధిఖీ, మహాశే్వతాదేవి, వందనాశివ, ఎం.సీ.మెహతా, జగ్గీ వాసుదేవ్ వంటివారు ఎందరో ప్రజోద్యమాలతో, న్యాయ పోరాటాలతో జల సంపదను రక్షించటానికి ఉద్యమిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులను ప్రతిఘటిస్తున్నారు.
స్వామి నిగమానంద సరస్వతి...
గంగానది తీరప్రాంతంలో ఎన్నో ఆధ్యాత్మిక ఆశ్రమాలు స్వామీజీల సారధ్యంలో కొలువుతీరి ఉన్నాయి. సాధు సత్పురుషులు, యోగులు ధర్మదీక్షాపరులుగా మాఫియాలను ఎదుర్కొంటూ ఆమరణ నిరాహార దీక్షలు, న్యాయ పోరాటాలు చేస్తూనే వున్నారు. హరిద్వార్‌లోని మాతృసదన్ స్వామీజీలు శివానంద, గోకులానంద, నిఖిలానంద, నిగమానంద, గంగోత్రి స్వామీజీ, సుందరానంద, గంగాసేవా అభియాన్ స్వామీజీ జ్ఞాన స్వరూప్ సనంద్ ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. నిష్కామకర్మ యోగత్వంతో దశాబ్దంపైగా మైనింగ్ మాఫియాపై అహింస, శాంతి, సహనంతో సత్యాగ్రహోద్యమం కొనసాగిస్తూనే వున్నారు. రెండు దశాబ్దాలు పైగా నిష్కామ కర్మయోగిగా వున్న స్వామి నిగమానంద సరస్వతి 2008లో 70 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. 2011 ఫిబ్రవరి నుంచి ఆయన దీక్ష మళ్లీ కొనసాగింది. 114 రోజులు ప్రాయోపదేశ దీక్షతో డెహ్రాడూన్‌లోని హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్‌లో నిగమానంద సరస్వతి జూన్ 13న ఆత్మత్యాగార్పణ చేశారు. బిహార్‌లోని దర్భాంగ స్వస్థలం అయిన స్వామీజీ పూర్వాశ్రమ నామం స్వరూపకుమార్ ఝాగిరీష్. అంతకుముందు ఏప్రిల్ 30న జాలీ గ్రాంట్ ఆసుపత్రిలో గుర్తుతెలియని ఒక నర్సు ఆయనకు విష పూరితమైన ఇంజక్షన్ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఏదిఏమైనా, 34 ఏళ్ల వయసులోనే స్వామీజీ మైనింగ్ మాఫియా అక్రమ అకృత్యాలను అడ్డుకొనే శాంతియుత పోరాటంలో మరణాన్ని ఆహ్వానించారు. ఆయన ఆత్మత్యాగం జరిగిన ఏడు సంవత్సరాల తరువాత కొద్ది రోజుల క్రితం- అంటే ఈనెల 11న స్వామి సనంద్- 111 రోజుల నిరాహారదీక్షతో గంగానది పరిరక్షణ కోసం పోరాడుతూ రిషికేష్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
స్వరూప్ సనంద్...
స్వామి సనంద్ పూర్వాశ్రమ నామం డా.జి.డి.అగర్వాల్. కాన్పూర్ ఐఐటిలో శాస్తవ్రేత్త అయిన అగర్వాల్ 2011లో సన్యాస దీక్ష స్వీకరించారు. పర్యావరణ ప్రేమికునిగా గంగానది సంరక్షణోద్యమ సారధిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వశాఖను న్యాయ పోరాటాలతో దశాబ్దాలుగా నిలదీసిన చరిత్ర ఆయనది. స్వామీ నిగమానంద బాటలో నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. జూన్ 22 నుంచి నాలుగు నెలలపైగా కఠోర నిరాహార దీక్షలో వుండగా, ప్రధాని మోదీకి స్వయంగా లేఖ రాసినా పట్టించుకోలేదు. గంగానదిపై హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలుపుదల చేయాలని, గంగానది రక్షణకు చట్టం చేయాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతలు పట్టించుకోలేదు. స్వామీజీ దీక్షను ఉపసంహరింపచేసే కృషి కూడా చేయలేదు. ఆఖరి శ్వాస వదిలేవరకు గంగామాత కోసం ఆయన పరితపించారు. 114 రోజులు దీక్ష అనంతరం రిషికేష్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి బలవంతంగా తరలించగా, 86 వ ఏట ఆ జ్ఞానవృద్ధుడు కన్నుమూశారు. అయినప్పటికీ ఈ కర్మయోగుల ఆత్మ బలిదానాలు ఎవరినీ కదిలించలేదు.
ఫిబ్రవరి 24న స్వామి సనంద్ ప్రధానికి రాసిన లేఖలో గంగానది రక్షణకు సంబంధించి జస్టిస్ గిరిధారీ మాలవ్యా నివేదిక ప్రకారం ప్రత్యేక చట్టం చేయాలని, సలహా సంప్రదింపుల మండలిని ఏర్పాటు చేయాలని, పర్యావరణానికి హానిచేసే కొన్ని ప్రాజెక్టులు ఆపివేయాలని కోరారు. అయినా నేతల నుంచి సమాధానం కూడా లేదు. కేంద్ర మంత్రి సాధ్వి ఉమాభారతి నదులకు ‘మీ టూ’ ఉద్యమం ప్రతిపాదించగా, మరొక మంత్రి నితిన్ గడ్కరీ నదిలో ప్రవాహం అవిరళంగా, ‘ఇన్-్ఫ్ల’ వుండే విధంగా నోటీసు జారీ చేశారు.

చిత్రాలు..స్వరూప్ సనంద్ *స్వామి నిగమానంద సరస్వతి

-జయసూర్య