Others

మట్టి రూపాలు - మధుర జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ముందు నాగరికత నేర్చుకున్న తర్వాత మొదటిసారి వంట చేసుకున్నది మట్టి పాత్రల్లోనే. నాగరికత నేర్చుకున్న మనిషి ప్రతి విషయంలో ఎంతో అభివృద్ధి సాధించి ముందుకు వెళ్తున్నాడు. నాగరికత నేర్చుకున్న మొదట్లో మట్టి పాత్రల్లో (కంచుడులాంటివి) అన్నం వండుకునేవారు. ఈ పాత్రలపై పెట్టే మూతలు (చిప్పలు) కూడా మట్టితోనే చేసుకునేవారు.
మంచినీళ్ళు తాగడానికి గుండ్రని మట్టి పాత్రలు (కుండలు) ఉండేవి. మట్టి కుండల్లో నీరు చల్లగా ఉంటాయి. కుండ ఎంత పాతదయితే అందులో పోసిన నీళ్ళు అంత చల్లగా ఉంటాయి. గత కొంతకాలం నుంచి మనుషులంతా రిఫ్రిజిరేటర్లకు అలవాటుపడ్డారు. అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని ఇండ్లల్లో ఎండాకాలం వచ్చిందంటే చాలు, నీటికోసం పెద్ద పెద్ద కుండలు కనబడుతూనే ఉంటాయి.
మధ్యతరగతి వారిండ్లలో, ధనికుల ఇండ్లలో కూడా ఫ్రిజ్‌లతోపాటు, మంచినీటి కుండలు కూడా ఉంటున్నాయి. చిన్నపిల్లలు, యువత ఫ్రిజ్ వాటర్‌కి అలవాటుపడినట్లే, వృద్ధులు కుండల్లోని నీటికి అలవాటుపడిపోవటమే. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కుండల తర్వాత రంజన్లు జనాల్లోకి వచ్చి ప్రతీ ఒక్కరికీ బాగా దగ్గరయ్యాయి. వేసవికాలం వచ్చిదంటే పట్టణాలు, నగరాల్లో ఎక్కడ చూసినా కూడా కుండలు, రంజన్ల దుకాణాలే. కుండలు, రంజన్లు పేదవాడికి ఫ్రిజ్‌లుగా చెప్పుకోవచ్చు.
ఆ తరువాత పిల్లలు చిల్లర నాణేలను దాచుకోవడానికి గుల్ల గురుగులు ఉండేవి. ఇప్పుడేమంటే పదుల రకాల్లో కిడ్డీ బ్యాంక్‌లు (ప్లాస్టిక్ బొమ్మలు) వచ్చి చేరాయి. కావలసినన్ని రకాల్లో తయారీ అవుతున్నాయి కిడ్డీ బ్యాంకులు. ఇక దేవుళ్ళకు దీపం వెలిగించడానికి ప్రమిదలు కూడా అప్పట్లో మట్టితోనే చేసేవారు. అవి గుండ్రంగా అర్ధగోళాకారంలో వుండేవి. ఇప్పుడేమో ఇత్తడివి, వెండివి వచ్చాయి. అయినప్పటికీ మొదటినుండి వచ్చినటువంటి మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించడమే చాలా శ్రేష్టమయినవి.
అలాంటి మట్టి దీపాల్లో కూడా రోజురోజుకు ఎన్నో ఆకృతులలో ప్రమిదలు తయారవుతున్నాయి. దీపావళి వచ్చిందంటే చాలు, ఒక్కో ఇంట్లో నూరు దీపాలకు పైగా వెలిగించేవారుంటారు.
ఇక ఈమధ్యన నగరాలు, పట్టణాల్లో చాలా చోట్ల మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాయి కొన్ని సంస్థలు, యువజన సంఘాలు. ఆ మంచినీటి చలివేంద్రాల్లో 50 లీటర్ల నుండి 100 లీటర్ల వరకు మంచినీళ్ళు పట్టేంత పేర్పులు (పెద్ద కుండలు, బాణలు) పెట్టి, వాటి క్రింద తడిసినటువంటి ఇసుక పోసి పైన ఈ పేర్పులను పెట్టి నీళ్ళు వాటిల్లో పోస్తారు. అలా చేయడంవల్ల క్రింద ఇసుక పోయడంవల్ల నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. ఇంకా ఇప్పటికీ ఇంట్లోకి వాడుకునే నీటిని నిల్వ ఉంచుకునేందుకు కుండల్లోనే పోస్తారు. ఊర్లల్లో ఇప్పటికీ కుండలలో నీళ్లు పొయ్యిమీద వేడి చేసుకుని స్నానాలు చేస్తారు. పెరుగును అమ్మే వ్యాపారస్థులు కూడా వెడల్పుగా వున్నటువంటి మట్టి పాత్రల్లోనే తోడిపెట్టి అమ్ముతారు. ఈ పెరుగు చాలా రుచిగా ఉంటుంది.
ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే దేవుడి పూజలకు, వివాహాది శుభకార్యాలకు మట్టికుండలు, మట్టి ప్రమిదలనే వాడేటటువంటి సంప్రదాయం భారతదేశంలోని తెలుగువారికి ఉంది. సంస్కృతి సంప్రదాయాల ప్రకారం కుండలను వాడాల్సిందే. కాలానుగుణంగా వచ్చిన మార్పులవల్ల శాలివాహనులు (కుమ్మరివాళ్ళు) మట్టితో చేసినటువంటి పచ్చి కుండలు, ప్రమిదలు కాల్చే ప్రదేశం కాలగర్భంలో మాయమవబోతున్నాయి.

-పర్వతాల శ్రీనివాస్