Others

హేతండులాంశః! హేతదంశః!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ఊరిలో ఒక మహాపండితుండేవాడు. ఆయన అట్టాంటి ఇట్టాంటి పండితుడు కాదండోయ్. ఉడ్డోలమైన పండితుడు. నిత్య వ్యవహారాల్లో కూడా సలక్షణమైన గ్రాంథిక భాషనే వాడాలనేంత గీర్వాణ పారీణుడాయన. ఇంటావిడను ‘వంటింట్లో ఏం చేస్తున్నావు?’ అని అడగాలంటే ‘గృహిణీ! సామ్రాజ్ఞీ! మహానసమున నేమి చేయుచుంటివి?’ అని అడిగేవాడట.
ఆకాలంలో రిక్షాలుండేవి కదా. అపుడు ఈ పండిత మహాశయుడు రిక్షాలో ఎక్కడకన్నా పోవాలంటే ‘ఏమోయి! త్రిచక్ర శకట వాహన చోదకుడా! నన్ను కళాశాలకు గొనిపోవుటకు ఏమి పుచ్చుకుందువు?’ అనీ అనేవాడట. మధ్యలో రైల్వేగేట్ వస్తే దానిని ‘శకటాగమన నిర్గమన సవరణ సూచిక కదా ఇది’ అని అడిగేవారట.
ఒకానొక నాడు ఈ మహాపండితుని ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ పండితుని కూడా నానా ఇబ్బంది పెట్టి మరీ ఉన్నదంతా దోచుకుని వెళ్లారట ఆ దొంగలు.
తెల్లవారింది. పండితుని దగ్గరకు వచ్చిన పనివాళ్లను చూసి ‘ఏమోయి! ఎంత పిలిచినను పలుకరేమి? మీరు సాయం వత్తురని నివాసమునకు దరిదాపులల్లోనే మీ నివాసమునకు ఏర్పాటు చేసితిని కదా. మన ఇంటిలోనికి చోరులు దూరినారు కదా. అంతా చౌర్యము చేసుకొని పోతిరి. మీకు గోచరము కాలేదా?’’అన్నారట.
ఆ పనివాళ్లకు చోరులు అనే మాట అర్థమయి ‘అయ్యా !మీరేమి అంటున్నారో మాకు తెలవడం లేదు’అన్నారట.
ఆ పండితుడు తల పట్టుకుని అసలు విషయం వారికి అర్థమయ్యేట్టు చెప్పాడట. అంతా విని వాళ్లు మీరు ఎప్పుడు పిలిచారు మమ్ములును అన్నారట.
అయ్యో అనుకొని ఆ పండితుడు ‘హేతండులాంశః’, ‘హేతదంశః’ అని ఎన్ని మార్లు పిలిచితిని.. అన్నారట. అదేంటయ్యా మా పేర్లు కావే అవి మమ్మల్ని పిలిస్తే పెద్ద నూకడు, చిన్న నూకడు అని గదా అంటారు. మీ ఈ మాటలు మేము విన్నాము కానీ మీరేదో సంస్కృత మంత్రాలు చదువుతున్నారనుకొన్నాం బాబయ్య అన్నారట.
అంటే పండితుని భాషలో తండులం అంటే బియ్యం కదా. బియ్యం యొక్క భాగం నూక కదా అంటే అంశః అని కదా అని పేర్లను కూడా సంస్కృతీకరించి మరీ పిలిచాడట ఆ గీర్వాణ పండితుడు.
ఇదిగో ఇలా ఉంటుంది. భాషావ్యామోహం. భాష పై అభిమానం ఉండాలి. అది దురభిమానం కాకూడదు.

- డి.వి.ఎమ్. ఎస్. నారాయణ