Others

సమాధి నుంచే సమాధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలోని మహారాష్టల్రోని అహమ్మద్‌నగర్ జిల్లా రహతా తాలూకాలో శిరిడీ ఒక చిన్న గ్రామం. మన్మాడు-అహమ్మద్‌నగర్ హైవేలో ఉన్న ఈ గ్రామం సద్గురు శ్రీసాయిబాబా పాదస్పర్శతో పవిత్రతను ఆపాదించుకుంది. ఈ ధార్మిక స్థలానికి భారతదేశం నలుమూలలనుంచి బస్సు, రైలు, ప్రైవేటు వాహనాల్లో శ్రద్ధకలిగిన భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారు. మన్మాడు రైల్వే జంక్షన్, కోపర్గాం రైల్వేస్టేషన్ శిరిడీ సమీపంలోనే ఉన్నాయి.
అలౌకిక విశిష్టత కలిగిన శ్రీ సద్గురు సాయిబాబా శిరిడీలో ప్రకటితమైనవారు. సుమారు అరవై సంవత్సరాలు మానవ రూపంలో తన అవతార కార్యాన్ని నెరవేర్చి అక్కడే సమాధి చెందారు. శిరిడీకి రావటం, నివసించటమే గొప్ప సాధన అనే అనుభవాన్ని స్వయంగా శ్రీ సాయిబాబా చూపారు. శ్రీ సాయిబాబా పవిత్ర పదస్పర్శతో, అలౌకిక అవతార కార్యంతో పావనమైన ఈ పుణ్యభూమి ఈరోజు అన్ని జాతుల, ధర్మాల, పంథాల సంప్రదాయాలకు చెందినవారు స్వేచ్ఛగా రాగల ఒకేఒక్క ప్రదేశం.
శ్రీ సాయిబాబా తన అవతారకార్యంలో తమ భక్తులకు వాగ్దానం చేశారిలా- ‘‘నా దేహత్యాగానంతరం నా ఎముకలు నా సమాధినుంచి మాట్లాడుతాయి. చీమల బారుల్లా మనుషులు ఇక్కడకొస్తారు’’. అదిప్పుడు అనుభవంలోకి వస్తోంది. ఇక్కడనుంచే బాబా జగత్తుకి శ్రద్ధ, సబూరి అనే మహామంత్రాన్నిచ్చారు. బాబా సమాధి స్థలం లక్షలాది భక్తుల మనసులకు వెలుగును ప్రసాదించగల కేంద్రమైంది. శిరిడీకి వచ్చాక శ్రీ సాయిదర్శనానంతరం ప్రాప్తించే ప్రశాంతి, లభించే ఆత్మవిశ్వాసం, పరమ మనశ్శాంతులవల్ల శిరిడీ ఈ జగత్తులో లక్షలాది భావికులకు శ్రద్ధాస్థానమైంది.
శిరిడీ చేరుకోవటం ఎలా?
శిరిడీ పుణ్యక్షేత్రానికి దగ్గరలోఉన్న విమానాశ్రయం ముంబయి. భారతదేశంలోని అన్ని ప్రాంతాలనుంచి ముంబయికి విమాన సౌకర్యాలు ఉన్నాయి. ఇక, శిరిడీకి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్లు మన్మడ్ లేదా నాగర్‌సోల్. మన్మాడ్‌నుంచి శిరిడీ 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణ సమయం రెండు గంటలు. ఇక్కడినుంచి శిరిడీకి బస్సులో చేరుకోవచ్చు. లేదా ప్రైవేటు రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి. నాగర్‌సోల్ స్టేషన్‌నుంచి శిరిడీ 43 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి కూడా రవాణాసౌకర్యం అందుబాటులో ఉంది. ఇక్కడినుంచి గంట ప్రయాణిస్తే శిరిడీ చేరుకోవచ్చు. నేడు రవాణాసౌకర్యాలు వృద్ధి చెందటంతో నేరుగా శిరిడీకి ప్రభుత్వ, ప్రైవేటు బస్సుసర్వీసులు నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్‌టిసి), తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టిఎస్‌టిడిసి), ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఎపిటిడిసి)తోపాటు ప్రైవేటు బస్సుసర్వీసులు నేరుగా శిరిడీకి నడుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌నుంచి ఈ సర్వీసులు నడుస్తున్నాయి. మిగతా ముఖ్య నగరాలనుంచి శిరిడీకి ప్రత్యేక బస్సుల సౌకర్యం ఉంది.
---------------------------------------------------------------------------

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1,
కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566