Others

వాక్చాతుర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ జీవరాశికి లేని వాక్కు అనే సంపదన ఒక్క మానవులకే ఉంది. అదే వాక్కు. భగవంతుడు మానవునికి ప్రసాదించిన అద్భుతమైన వరం మాట్లాడే విద్యను ప్రసాదించడం. ఈ సంపదతో, ఆలోచన, విచక్షణ అనే మరో సుగుణాలను చేర్చుకుని భగవంతునిడిని మానవుడు అనే్వషిస్తూ ఉంటాడు. మరో ప్రక్క మానవుడు ఇచ్చిన నోటిని భగవంతుడిని కీర్తిస్తూ కాలాన్ని వెచ్చిస్తూ ఉంటారు.
మరికొంతమంది పక్కవారితో విరోధాలు తెచ్చుకుంటూ ఉంటారు. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంది అంటారు వీరిని చూసి. అందుకే ‘‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే’’ సామెత వచ్చింది. ఇంతమంచి సంపద నిచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు చెప్పి ఆ సంపదతో నలుగురికీ ఉపయోగపడేట్టుగా మెలిగితే తిరిగి ఎంతటి సౌభాగ్యాన్ని పొందుతామో కదా. అసలు మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటివారు మనల్ని మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. అందుకే మాటకు అంత ప్రాధాన్యత ఉంటుంది.
రామాయణంలో శ్రీరాముడు హనుమంతుడు మాట్లాడి మాట్లాడగానే గొప్ప గుణవంతుడు ఆంజనేయుడు అని కితాబులిచ్చాడు. నిజంగానే త్రేతాయుగం నుంచి నేటి వరకు హనుమంతునికి నమస్కరించనివారు ఎవరైనా ఉంటారా. అదంతా ఆయన మాటకున్న విలువనే. మాట ద్వారానే ఆయన గొప్పపనులు చేశాడు. రావణుని సభలో కూడా హనుమంతుడు తన వాక్చాతుర్యమును ప్రదర్శించాడు. అశోకవనంలో సీతమ్మకు రామ కథాచరితమును మృధుమధురంగా గానం చేసి తన బుద్ధికుశలతను చాటుకున్నాడు. సీతమ్మకు తన మీద నమ్మకం కలిగించడంలో విజయం సాధించాడు. లంకాప్రయాణం సాగించేటపుడు హనుమం తుడు తన మాటల చతురతతోనే మైనాకుని దగ్గర నుంచి లంకిణి వరకు సునాయాసంగా విజయాన్ని చేపట్టాడు. వాక్చాతుర్యం ఉన్నవాడు కనుకనే రావణుని దగ్గరకు వెళ్లి సితవచనాలు చెప్పాడు. విభీషణుడురావణుని తమ్ముడు అయినప్పటికీ దుష్టుడైన రావణుని విడనాడి రాముడి శరణు వేడుకున్నప్పుడు వానర సైన్యం అందరూ వ్యతిరేకించినప్పటికీ హనుమంతుడు విభీషణుని మాటల విశిష్టతను గుర్తించి, రావణుని రహస్యములు తెలిసినవాడికి శరణు ఇవ్వడంవలన యుద్ధములో విజయము సాధించడంలో సహాయపడగలడని భావించి రామునితో చెప్పాడు.
అందుకే మనకున్న అపురూపమైన వాక్కు అనే సంపదను మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి.

- ఆర్. పురంధర్