Others

ఆ కొందరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరి మేధోసంపత్తి
సమాజ శ్రేయస్సును కోరింది
ప్రాణాంతక వ్యాధుల
గుట్టును రట్టు చేసి
జీవన సౌభాగ్యాన్ని అందించింది

కొందరి అభ్యుదయ భావాలు
సంఘాన్ని సంస్కరించింది
దురాచారాలను దునుమాడి
కొత్త వసంతాలు పూయంచింది

దగాపడ్డ ఓ ఆత్మాభిమానం
తన జాతి
ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొంది
నల్లసూరీడై
నలు చెరగులా భాసించింది

ఓ అసహనం
అన్యాయాన్ని ఎదిరించింది
పోరాటానికి శాంతిని నేర్పి
సత్యాగ్రహాన్ని ఆయుధం చేసింది
దాస్యాన్ని తెగనరికి
భరత మాత ముద్దుబిడ్డయంది

విరక్తితో జన్మించిన
ఓ సత్యానే్వషణ
మానవాళికి
జీవిత సత్యాన్ని ప్రబోధించింది
కోరికలు దుఃఖానికి హేతువని
ప్రవచించింది
కష్టాలైనా, కడగండ్లైనా
మేలైనా, కీడైనా
సంస్కృతైనా - సంస్కారమైనా
సంక్షేమమైనా - సౌభాగ్యమైనా
మనకు - మనంగా
శోధించి, సాధించి
సఫలీకృతం కాకపోతే ఎలా!

ప్రపంచం సార్వజనీనం
వాళ్ళ భావాలు సార్వత్రికాలే
కోరనిదే భగవంతుడైనా వరమివ్వడు
విచలితమైన
వారి హృదయ స్పందనల నుండి
తొంగి చూసిన
ఓ విశ్వమానవీయత ముందు
భగవంతుడైనా కొంచెమే గదా!
భగవంతుని మనం మెచ్చడం
అసాధారణం

అందుకే
అందాల్సిన వాళ్లకు అందడంలో
దక్కాల్సిన వాళ్లకు దక్కడంలో
ఆ... కొందరు
శోధించి, సాధించి నిలబెట్టిన
ఆ పుణ్యకార్యంలో
మనమూ పాలుపంచుకొందాం.

- కె. రవీంద్రబాబు, 9052778988