Others
గాలివాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అతనే కారణం కాదని చెప్పలేము
ఆమే నెపం అనీ అనలేము
సంసార సాగరంలో
అల్పపీడనం ఏర్పడింది
ఉరుములు మెరుపులు
చిలికి చిలికి గాలివాన
స్విచాఫ్ చేసినట్టు
మాటలు మూతి ముడుచుకున్నాయ
కనుసైగలు వగైరాలన్నీ
పాగల్ అయపోయనాయ
మూడు పూటలా
టిఫిన్ చాయ్ భోజనాలు
వంటింటి పౌరసరఫరా గిడ్డంగి నుంచి
ఎలాంటి అడ్డంకి లేకుండా
అందరికీ అందుతూనే వున్నాయ
గుర్తించని సరిహద్దుల్లో
ఉద్రిక్తత ఏమాత్రం సడలడం లేదు
పైగా కారెడ్డాల మాటల
దెప్పుడు కాల్పుల
ఉల్లంఘన జరుగుతూనే వుంది
ఆరు పదుల వయస్సు దాటిన వేళ
అలుకలు కలకలు కోపతాపాలు
పట్టు సడలి కలిసిపోవడానికి
బుజ్జగించే పడక గది
ఒంటికి కంటగింపై పోయంది
అమాయకురాలు అని
అందరూ అంటారు
‘మాట’ సాయంగా
చతురతతో మనుమరాలిని
మా మధ్య రాయబారిగా నియమించింది
పైకి షాన్దార్గానే
కనిసిస్తయ్ కుటుంబాలన్నీ
గంగానది పరమ పవిత్రత లెక్క -
పొద్దు గూకే జాములు
ఇంటిముందు గద్దెమీద కూర్చొని
‘బెల్లం కొట్టిన రాయ లెక్క
ఆయనకు మాట్లాడకుంటే ఎల్తది
నాకు ఎట్ల ఎల్తది చెప్పు’
మూడేండ్ల ముద్దుల మనుమరాలితో
ఘర్షణను తగ్గించే సుపారి అందించింది
నాకూ గట్లనే వుంది
కాదంటే మగ మహా దురహంకారం
ఏడో చేప కథ అడ్డం వచ్చింది
సైనికునికి దుంక బుద్ధి అయ్యంది
గుర్రానికి ఎత్తేయ బుద్ధి అయ్యంది
ఏమైతేనేమి
ప్రశాంతంగా తుపాను తీరం దాటింది
మళ్లీ ఇల్లు మనసు విప్పి మాట్లాడుతోంది.