Others

వేదిక - వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడిటోరియమో
సమావేశ మందిరమో
ఏదైతేనేం వేదిక లెక్కడం వేడుక
సందర్భాన్ని విస్మరించి మలీ
వినిపించడమో వేడుక
విసిగించడమూ వేడుకే!

అభినందనో సత్కారమో
ఆవిష్కరణో సమ్మేళనమో
మరొకటో సందర్భం చేదైనా
వేదికపై ఠీవి ఒలకపొయ్యడమే

ఆశైనా.. ఆరాటమైనా
వేదికపై అధ్యక్షుడంటాడు
గౌరవ అధ్యక్షుడూ ఉంటాడు
అతిథి ఉంటాడు!
నేడది బహువచనమై
ముఖ్యాతిథి, విశిష్టాతిథి, ప్రత్యేకాతిథి,
మరొకరని
మందని మరిపిస్తుంది.
సందేశకులని,
ప్రత్యేకాహ్వానితులని,
విశేషాహ్వానితులని,
ఎన్ని సీట్లు సర్దుబాటు చెయ్యాలని!

నిజానికి విచిత్రమేమంటే
వేదికపై ఆసీనులైన వారిని
సభికుల్లో ఖాళీ కుర్చీలు
వెయ్యితీరులుగా వెక్కిరిస్తున్నట్లు
కోటి తీరులుగాఎగతాళి చేస్తున్నట్టు

కళ్లెదురుగా కనిపిస్తున్నా
చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నా
ఎవరికి పడుతుంది?
ఎందరిని ఆలోచింపచేస్తుందని?
వినేవారంతా లేకున్నా
కనేవారంతా రాకున్నా
సభికులన్ని ఉర్రూత లూగించిందని,
జనహృదయాలను కొల్లగొట్టిందని

పలురంగుల్లో ప్రసార
మాధ్యమాల్లో కనివిందు
పెద్ద పెద్దక్షరాలతో ప్రింటింగ్‌మీడియా
మేము తక్కువ గాదని
నిజానికి దరిదాపుల్లోకి రాలేని
చిత్రవిచిత్రాల కలబోత
వేదిక నెక్కడం,వేడుక చేయడం!

-డా.కొల్లు రంగారావు 9866266740