Others

‘నర్తనశాల’ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటుడు ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) కెరీర్‌లో అద్వితీయంగా, సువర్ణాక్షరాలతో లిఖించబడిన చిత్రం ‘నర్తనశాల’. 1963 అక్టోబర్‌లో విడుదలైన ‘నర్తనశాల’కు 55 ఏళ్లు నిండినా స్వర్ణయుగ సినిమా విశిష్టత ఏమాత్రం తగ్గలేదు, తగ్గదు కూడా. మహాభారతంలోని రసవత్తర ఘట్టం ‘విరాట పర్వం’ ఇతివృత్తాన్ని తీసుకుని పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు తన దర్శకత్వ ప్రతిభతో ఓ అద్భుత దృశ్యకావ్యం చిత్రాన్ని మలిచారు. రాజ్యం పిక్చర్స్ బ్యానర్‌పై సి లక్ష్మీరాజ్యం, ఆమె భర్త సి శ్రీధర్‌రావులు శ్రద్ధగా నిర్మించిన చిత్రం -నర్తనశాల.
అప్పటికే స్టార్ హీరోగా వెలిగిపోతున్న ఎన్టీఆర్ నటనపై మమకారంతో పేడి అవతారంలో బృహన్నల పాత్రను చాలెంజింగ్ పోషించటం ఇప్పటి హీరోలు ఎవ్వరూ చేయలేని సెనే్సషన్. ఆ పాత్రలో లీనమయ్యేందుకు నెలరోజులపాటు వెంపటి చిన సత్యం వద్ద నృత్యం నేర్చుకొని, తరువాత ఆ పాత్రకు ఒక మేనరిజం సృష్టించగలిగారు. బృహన్నల పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు అనేకంటే జీవించారనే చెప్పాలి. సినీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఆ పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినదే.
ఇక సైరంద్రి పాత్రలో సావిత్రి, కీచకుడి పాత్రలో ఎస్.వి.రంగారావు, హాస్యనటుడు రేలంగి వంటి ఉద్ధండుల కలయికతో వచ్చిన ‘నర్తనశాల’ చరిత్రలో నిలిచిపోయింది. ఎస్వీఆర్ నటనకు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు అందడమే కాదు, జకర్తాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించినపుడు అప్పటి ఇండోనేసియా అధ్యక్షులు చూసి ఎస్వీఆర్‌ని ప్రశంసించడమే కాదు, అవార్డు యిచ్చి గౌరవించారు. సైరంద్రి పాత్రలో సావిత్రి ప్రదర్శించిన సున్నితత్వం, సుగుణం చిత్రానికే వనె్న తెచ్చాయ. నర్తనశాలలో ప్రతి ఘట్టం, పాటలు, మాటలు, కథనం అద్భుతం. నర్తనశాలని ఎన్నిమార్లు చూసినా తనివి తీరదు. ముఖ్యంగా ఎన్టీఆర్‌వంటి స్టార్ పేడి పాత్రకు అంగీకరించడం గ్రేట్! ఎన్టీఆర్ అటు బృహన్నలగాను, ఇటు అర్జునునిగానూ మెప్పించారు. వలలుడు, భీముడుగా దండమూడి నటన మాటల్లో వర్ణించలేనిది. మహా దృశ్య కావ్యాన్ని తెరకెక్కించే కృషిలో సినిమాటోగ్రాఫర్ ఎంఎ రెహమాన్, వీనులవిందైన సంగీతంతో సినిమాకు ప్రాణం పోసిన సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చివరిగా ఓ మైథలాజికల్ మాయను పామరుడికి కూడా అర్థమయ్యేలా సినిమాక్షర బద్ధం చేసిన సముద్రాల రాఘవాచార్యను సినిమా చూసే ప్రతిసారీ స్మరించుకోక తప్పదు. ఈ తరానికి ఒక్కసారి చూపించండి. స్వర్ణయుగ కాలంనాటి సినిమాల గొప్పతనం అర్థమవుతుంది.

-వి సీతామహాలక్ష్మి, నిడదవోలు