Others

స్వప్నంలో పక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదొక పక్షి
స్వప్నంలో చూశా..
ఒక కవి మిత్రుడితో కలిసి చూశా!
తిరుగుబాటు జెండాకు
అదొక చిహ్నంలా కనిపించింది
స్వేచ్ఛకు సంకేతంలా అగుపించింది
ఆ పక్షి రంగు..
రంగుల రాట్నాన్ని తలపించింది
నింగిలో ఇంద్రధనస్సును పోలింది
అదొక కొత్త పక్షి! కొత్తందం!
స్వప్నంలో సజీవ పక్షి
ఎంత వర్ణ రంజితంగా ఉందో
జీవం తొణికిసలాడే ఆ పక్షి
ఎంత హుందాగా ఉంది!
అది ఏ దేశానికి చిహ్నమో!
ఏదైతేనేమి స్వప్నంలో సజీవ పక్షి!
సప్తవర్ణాల పక్షి, కండ గల పక్షి
చూపును తిప్పుకోనివ్వని అందం తనది
సప్తవర్ణాల స్వేచ్ఛకు చిహ్నం
గుండెకు ఎంత దిటవు నిచ్చింది!
స్వప్నంలో ఆ పక్షి!!

- వుప్పల నరసింహం, 9985781799