Others

కబ్జాకోర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్నటిదాకా
ఇంట్లో నేనే హీరోని
మనవడొచ్చాక
క్యారెక్టర్ యాక్టరయ్యాను!

సూర్యుని చుట్టూ
భూమి భ్రమిస్తున్నట్టే
పొద్దు తిరుగుడు పూలలా
కుటుంబమంతా వాని చుట్టే!

వాని ప్రతి కదలికా
అందరికో అద్భుత విన్యాసం
నా రాకపోకలకు
దిక్కూదివాణం లేదు!

వాని పవళింపు సేవ
ముగియనిదే
నేనెంత గీపెట్టినా
నా ఉనికి ప్రశ్నార్థకమే!

వీడేందీ
నేను వీలునామా రాయందే
నా యావదాస్తినీ
కుటుంబాన్నీ కబ్జా చేసేశాడు!!

- కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261