Others

నరక చతుర్దశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరాహావతారంలో మహావిష్ణువుకు భూదేవికి నరకుడు అను పిల్లవాడు జన్మిస్తాడు. ఆ భూదేవినే ద్వాపరయుగంలో సత్యభామ గా పుట్టి శ్రీకృష్ణుని చేపట్టింది. ఆ నరకుడు దినదినప్రవర్థమానమై ప్రాగ్జోతి షపురాన్ని ఏలే రాజుగా మారాడు. అనేక సంవత్సరాలు తపస్సులు చేసి బ్రహ్మ చేత వరాలు పొందాడు. ఆ వరగర్వంతో గర్వాంధుడై మానవుల్ని, దేవతలను, సాధువులను, తాపసులను హింసించేవాడు. కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలకు బానిసైనాడు. గోబ్రాహ్మణులను ఎక్కువగా బాధించేవాడు.. పదహారువేల మంది స్ర్తిలను చెరబట్టినాడు. దైవ దూషణ మితిమీరి చేసేవాడు. వీని దుష్టచేష్టలను భరించలేక భూదేవి మహావిష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది. వరబలం, మదబలం కలిసి ఉండే నరకుని వలన ముల్లోకాలు గడగడలాడాయ. విశ్వకర్మ కూతుర్ని బలాత్కరించాడు. ఇంద్రుడి మాత అదితి కుండలాలను హరించాడు. ఇక నరకుని బాధ భరించలేక బ్రహ్మాదిదేవతలు మహావిష్ణువును శరణు కోరారు. అపుడు మహావిష్ణువు ద్వారకలో నివసించే శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి నరకుని పీడ వదిలిస్తాడని అభయం ఇచ్చాడు.
అందరూ కలసి శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చారు. శ్రీకృష్ణుని నరకుని పీడ వదిలించమని కోరుకున్నారు. అపుడు సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుడు నరకునిపై యుద్ధ్భేరిని మ్రోగించాడు. సమరంలో నరకుడు సత్యాశ్రీకృష్ణుల చేతిలో అసువులు బాసాడు. నరకుని పీడ వదిలిందని దేవతలు, మానవులు, సిద్ధులు, సాధుసత్పురుషులు, అందరూ సంతోషించారు. నరకుని చెరలో ఉన్న వనితలకు కృష్ణుడు బంధవిముక్తి కలిగించాడు. ఆరోజే ఆశ్వీజమాస కృష్ణపక్ష చతుర్దశి. అదే నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. ఆ నరకుని పీడ వదిలిన సందర్భంగా చతుర్ధశి తెల్లవారు జామున ‘చతుర్వత్తుల’ దీపం వెల్గించి యమధర్మరాజునుద్దేశించి తర్పణం వదలుతారు. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి అని మూడు రోజులు జరుపుకొంటారు. ఉత్తర భారతంలో ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ ద్వితీయ అని ఐదు రోజులు జరుపుకొంటారు. ఈ చతుర్దశి తర్వాత వచ్చే అమావాస్య నాటి రాత్రి ఒకేఒక దీపాన్ని వెలిగించి ఒక పళ్ళెం నిండా ధాన్యాన్ని నింపి, పళ్ళెం మధ్యలో ఆ వెల్గించిన దీపాన్ని పెట్టి భూమాతను పూజిస్తారు. ఆ తరువాత ఆ దివ్వెను ఇంటిలో, బయట ఆవరణ అంతా మూల మూలనా వెలుగుపడేలా త్రిప్పి తిరిగి తెచ్చి దేవునివద్ద ఉంచుతారు. ఇలాచేయడం తమలోఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలమని భగవంతునికి విన్నపం అన్నమాట. తరువాత ఆ దీపంతోనే అనేక దీపాలు వెలిగిస్తారు. ఇది కన్నడ దేశ పద్ధతి. బెంగాల్‌లో దీపావళి నాడు కాశీపూజ చేస్తారు. ఒరిస్సాలో దీపావళి నాటి రాత్రి లక్ష్మీపూజ, కులదేవతార్చన చేసి, క్రొత్త బట్టలు కట్టుకుని సన్నగా చీల్చిన చెఱుకు పుల్లలకు దూదిని చుట్టి, నువ్వుల నూనెలో ముంచి వెలిగించి ‘పితృణం మార్గదర్శనం’’ అంటూ ఆకాశం వైపు చూపిస్తారు. మార్వాడీలు దీపావళినాడు వెండి, బంగారు నాణేలతో లక్ష్మీదేవిని పూజించి ఆ రోజునే నూతన సంవత్సరాంభం చేసి, కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు.
అమావాస్య చీకట్లను తరిమేసే దీపతోరణమే దీపావళి. భారతీయులకు అత్యంత విశిష్టమైన ప్రీతిపాత్రమైన పండుగ. పిల్ల పెద్ద అందరూ ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ ఈ దీపావళి. తీపి వంటలు పంచుకుంటూ బాణా సంచా కాలుస్తూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుంటారు.

- చివుకుల రామమోహన్