Others

దీపావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ దీపం జ్యోతిః పరబ్రహ్మ, దీపం సర్వతమో పహమ్
దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే॥
దీప ప్రజల్వనం చేయడం భారతీయ సంప్రదాయం. అందులోను దీపావళి అమావాస్య సగుణం నుంచి నిర్గుణానికి దారి ఏర్పరుచుకోమంటుంది హైందవం. తమస్సునుంచి ఉషస్సులోకి రమ్మంటుంది. తనవారైనా ధర్మం ధర్మమే నని చెప్పే వైదిక సంస్కృతి. ప్రతి పండుగలోను ప్రతి పర్వంలోను ధర్మనిరతికి పెద్ద పీట వేస్తుంది.
కేవలం గుణాల వల్లే మనిషిలో మంచి చెడు అన్న భావాలు ఉద్దీప్తం చెందుతాయి. సత్వగుణం ప్రబలమైతే పదుగురికీ ఉపయోగపడే పనులు చేసి లోకకల్యాణకారులు అవుతారు. రజస్తమోగుణాల ప్రభావానికి లోను అయితే లోకకంటకులుగా మారుతారనే విషయానే్న చెప్పేదే దీపావళి.
‘భ్రామయేత్ స్నానమధ్యే తు నరకస్య క్షమామవై’,
‘నరకాయ ప్రదాతవ్యో దీప స్సంపూజ్య దేవతాః’,
చతుర్దశ్యాంతు యే దీపా నరకాయ దదంతిచ
తేషాం పితృగణా స్సర్వే నరకా త్వ్సర్గ మాప్నుయుః॥
అని శాస్త్ర వచనాలు.
నరక శబ్దానికి దుర్గతి అన్న అర్థమూ ఉంది. ఈ దుర్గతి నుంచి మాకు సద్గతిని కలిగించమని ఆశ్వీజ ఆమావాస్య నాడు బాణాసంచా కాల్చుతారు. చీకటినిండిన గగనాన్ని దీపతోరణాలతో వెలుగులమయం చేస్తారు. ఆ వెలుగుల తోరణాలు పట్టుకొని మృత్యువాత పడి నరకలోకంలో కొట్టుమిట్టాడుతున్న వారు స్వర్గానికి వెళ్లగలిగే జ్యోతిస్వరూపాలు ఈ దీపావళి తారావళులు.
లక్ష్మీదేవికి అమావాస్య ప్రీతిపాత్రమైన రోజు. ఆరోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలునిర్వర్తిస్తారు.
‘‘ ఉపశమిత మేఘనాదం ప్రజల్విం దశాననం
రమిత రామం రామాయణ మివ సుభగం
దీపదినం హారళు వో దురితం’’
కాలమేఘ గర్జనలు సమసిపోయి దశదిశలూ వెలుగులు నిండినప్పుడు శ్రీరామవిజయానికి యువతీగణం ఆనందంగా వెలిగించిన ఈ దీపావళి సమస్త పాపాలను హరించి శాంతిని ప్రసాదించుగాక’’అని కూడా దీప ప్రజ్వలనం చేసి ఈ శ్లోకాన్ని చదువుతారు.
దీపావళిరోజున దీపాలు పెట్టడం టపాసులు పేల్చడం ప్రత్యేకం. టపాసులు ప్రేల్చడం వెనుక కూడా ఒక అంతరార్థం ఉంది. అదేమంటే వర్షర్తువులో వానలు పడి నేలలు చిత్తడి చిత్తడిగా ఎక్కడ చూసినా తేమ వాతావరణం వుంటుంది. తేమలో సూక్ష్మజీవులు నివశించటానికి అనువైన ప్రదేశం కాన వ్యాధులు విజృంభిస్తాయి. వాటి సంహరణకై టపాసుల్లో ఉండే మందుగుండు పేలడం వల్ల ఆ పురుగులు సూక్ష్మ క్రిములు నశిస్తాయ.
చిచ్చుబుడ్లు, మతాబులు, కాకరపూవొత్తులుఇవన్నీ అటువంటి క్రిమినాశనానికి ఉపయోగపడుతాయ. కానీ రాను రాను ఈ టపాసులు కాల్చడంలోను సాంకేతిక ప్రగతి ధ్వనికాలుష్యాన్ని పెంచి పోషిస్తోంది. కనుక ఆ కాలుష్యనిరోధానికి దీపావళి టపాసులు పనికి వచ్చేట్టుగా చూసుకొని ఈ దీపావళి పండుగను పిల్లా పెద్ద అందరూ ఆనందోత్సాహాలకు వారధులు కావాలి. పెద్దలలో కూడా నిరంతర జీవిత విధానములోనుండి పుట్టిన నిర్వేదన, అలసట పోయి కొత్త ఉత్సాహం ఈ పండుగ ద్వారా వెల్లువిరిస్తుంది.
శుభం భవతు కల్యాణి ఆరోగ్యం ధన సంపదః
మమ శత్రు వినాశాయః సంధ్యా జ్యోతిర్నమోస్తుతే
దీపావళి వెంటనే కార్తీకమాసం ప్రవేశిస్తుంది కనుక కార్తిక దామోదరుడికి ఆహ్వానం పలుకుదాం.

-చోడిశెట్టి శ్రీనివాసులు