Others

విశ్వసృష్టి రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు (ఐతిహాసిక పురుషులు శ్రీరామనవమి, కృష్ణజయంతి వంటి పండుగలకు తప్ప) ప్రతి పండుగకు ఖగోళ పరిణామ విజ్ఞానం, అంతర్లీనమై ఉంది. అట్లాగే దీపావళి కూడా ఆశ్వీయుజ బహుళ త్రయోదశి- చతుర్దశి (నరక) అమావాస్యలు దీపావళి పండుగ- దీపాలు వెలిగించటం- మతాబులు- బాంబులు - కాల్చటం దీపాల వెలుగుల పండుగగా దీపావళి ప్రసిద్ధం- అమావాస్య నాడు జగత్ప్రసూతియైన లక్ష్మీదేవిని ఆరాధించటం- పితృదీపాలు- పితృతర్పణాలు చేయటం కూడా సంప్రదాయం- దీనికి శాస్ర్తియమైన కారణం ఖగోళ పరిణామం- అనంతమైన ఈ విశ్వసృష్టి ఆశ్వీయుజ అమావాస్య శరదృతువులో ప్రారంభమైంది. దీనికి నేపథ్యం- ఆషాఢ- శ్రావణ- భాద్రపదాలు. ఆషాఢం - శక్తిప్రధానమైన బోనాలు (్భవనం అనే మాటకు వికృతి బోనం) - శ్రావణం, శివప్రధానం- శివ- శక్తుల కలయికే అనంత సృష్టికి మూలం (స్ర్తిపుంయోగోద్భవం) శివశక్తుల కలయికకు కేవలం స్ర్తి శక్తి (పార్వతి) ద్వారా నలుగు ద్వారా జన్మించిన విఘ్నేశ్వరుడు (్భద్రపదుడు) శివశక్తుల కలయికకు విఘ్నం కలిగించాడు (శక్తి యొక్క సైడ్ ఎఫెక్ట్).
శివుని ద్వారా అంతమై మళ్లీ శివుని ద్వారానే గణపతిగా పునర్జీవితుడయ్యాడు. శివ - శక్తులను సాంకేతిక పరంగా చెప్పాలంటే ధన - ఋణ ధృవాలు - ధన - ఋణ - ధృవాలవల్లనే సృష్టి ఏర్పడుతుంది. శివశక్తుల కలయికకు ముందు అనంత విశ్వం లేదు. కేవలం కాళరాత్రి - అందులో రాపిడి జనించి మహా విస్ఫోటనం (బిగ్ బ్యాంగ్) సంభవించి వెలుగులు ప్రసారమయ్యాయి. ఆ విస్ఫోటనమునకు గుర్తే బాంబులు పేల్చటం - ఆ చిరు వెలుగుల గుర్తే దీపాలు వెలిగించటం (కాలం అంటే నలుపు - చీకటి) అని అర్థాలు. చీకటి నైసర్గికం- వెలుగు పరిణామాత్మకం- అందుకే ఎంత గాఢమైన వెలుగుంటే అంతకంటే గాఢమైన చీకటి దాని వెనుక ఉంటుంది. (ఇప్పటికీ కూడా బ్లాక్ హోల్స్- చీకటి కోణాలు ఖగోళంలో అనంతంగా ఉన్నాయని శాస్తజ్ఞ్రులు చెపుతూనే ఉన్నారు- అవి అగాధమైనవి). ఈ విధంగా దీపావళి అమావాస్య నాడు ఏర్పడిన మహా విస్ఫోటనం ద్వారా ఏర్పడిన వెలుగు, మహాశివరాత్రినాడు జాజ్వల్యమానంగా, ఊర్ధోముఖంగా లింగాకారంగా పరిణమించి పరివ్యాప్తమైంది. ఆ పరిణామమే ఉగాదినాడు (యుగాది) నక్షత్రాలు - గ్రహ మండలాలుగా విశ్వం ఏర్పడింది. అప్పటి నుండే (యుగము) అంటే రెండు రాత్రింబవళ్ళు ఏర్పడ్డాయి. జగత్తు నడుస్తోంది- ఆ కారణంగానే శరదృతువులో తులావిషువత్తులో వసంత ఋతువులోని మేషవిషువత్తుల్లో రాత్రింబవళ్ళు సమానంగా ఉంటాయి. ఇది దీపావళి - పండుగ ఖగోళ పరిణామం. ఇక నరక చతుర్దశి అనే మాటలో మానవ జనన మరణాల రహస్యం ఇమిడి ఉంది. నరకం, అంధకం, తమిస్రం అంటే భయంకరమైన కారుచీకట్లు మనిషి మరణించాడంటే చీకట్లోకి వెళ్లిపోవటం.. దాని కారణంగానే ‘తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ- అసతోమా సద్గమయ’- అనే ఉపనిషత్తు వాక్యాలు ఏర్పడ్డాయి. మనిషి మరణించగానే ప్రేతత్వాన్ని పొందుతాడు. ప్రేతం అంటే ప్రయాణించువాడు అని అర్థం ఉంది. చనిపోగానే ఆత్మ- తాను చేసిన పుణ్య పాపాల ఆధారంగా ప్రయాణిస్తాడు. కర్మలే లాక్కుపోతాయి. పుణ్యకార్యాలమీద ఊర్థ్వలోకాలకు తేజోమండలానికి వెళ్లి దివ్యులౌతారు. పాప కార్యాలు చేస్తే అధోలోకాలలో నరకం చీకట్లో మగ్గుతూ యమశాసనానికి శిక్షలనుభవిస్తారు. అందుకే చనిపోయినవారికి కర్మలు చక్కగా జరిగితే వసు, రుద్ర, ఆదిత్య రూపాలు పొందుతారు. వసు అంటే సూక్ష్మ ఘన రూపం, వాయు రూపం కూడా వసురూపమే. రుద్ర రూపమంటే ద్రవరూపం, నీరు. ఆదిత్య రూపం అంటే తేజోరూపం, అదే దేవతా రూపం, దివ్యతి- ఇతి దేవః అని నిర్వచనం. అది మహాత్ముల బాట- వారే దివ్యులౌతారు. పితరులూ దేవతలే.. ఆ కారణంగానే దీపావళి ముందు త్రయోదశి, చతుర్దశి, అమావాస్యలకు.. దక్షిణాముఖంగా అర్ధరాత్రి దీపాలు వెలిగించాలి. అవి పితృదేవతలకు మార్గం చూపుతాయి. ఏదైనా తీపి పదార్థం కానీ అన్నం ముద్ద కానీ నివేదన పెట్టాలి. పితరులు ఆశీర్వదిస్తారు. ఉదయం పితృ తిలా తర్పణాలు వదలాలి. ఇది దీపావళి ఖగోళ రహస్యం.

- ఉమాపతి బి. శర్మ