Others

శక్తి కేంద్రములు( పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
H.No. 7-8-51, Plot No: 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
========================================================
సంకల్పిత మరియు అసంకల్పిత శ్వాసక్రియల మధ్య చాలా తేడా ఉంది. మెదడుపై వీని ప్రభావములో ఎంతో వ్యత్యాసముంటుంది. ప్రపంచంలో చాలా చోట్ల ప్రాణశక్తిని పెంపొందించుకునే అభ్యాసములు కనుగొనబడ్డాయి.
పరిశోధనల ద్వారా తెలిసినదేమంటే మెదడులోని ఎడమ భాగము సక్రియాత్మకమై, సంతోషముతో కూడిన భావములను కలిగిస్తుంది. మెదడులోని కుడివైపు భాగము విచారము (దుఃఖము) మరియు వ్యర్థమైన ఆలోచనలను కలిగిస్తుంది. కావున ప్రశాంతత కొరకు సమతుల్యత కలిగియుండుట చాలా అవసరము. లయబద్ధమైన శ్వాసక్రియ జరుపుటలో నాడీ శోధన చాలా ఉపయుక్తమైనది. మనిషి శ్వాసను నియంత్రించి, మనసును నిలకడగా ఉంచగలిగినచో ఏకాగ్రత ఏర్పడుతుంది. ఆ సమయమున తన చుట్టూరా కాంతి ఆవహిస్తుంది. అపుడు తనను తాను విశ్వప్రాణశక్తితో అనుసంధానపరచుకోగలడు.
భగవత్ సాక్షాత్కారానికి లేక ఆత్మసాక్షాత్కారానికి అనేక మార్గాలున్నాయి. అవి పూజ, స్తోత్రం, జపం, ధ్యానం మొదలగునవి. సిద్ధి పొందాలనుకునేవారు వీటిలో ఏదో ఒకదానిలో ఉత్కృష్ట స్థితిని పొందాలి. అంటే ముందుగా మనోనిశ్చలత కావాలి. అందుకు సరియైన మార్గం యోగాభ్యాసమే. పరమశివుడు 84 లక్షల ఆసనాలను ఆచరించినట్లు మన యోగశాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అంటే సృష్టిలోని అన్నిరకాల జీవరాశుల భంగిమలు (ఆసనములు) ఆయనవే కదా! ఆత్మను పరమాత్మతో కలిపి ఉంచడమే యోగము. ‘యుజ్’ అనే ధాతువునుండి యోగ అనే పదం ఏర్పడింది. కాబట్టి ఏ వ్యక్తి అయితే వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వచైతన్యంలో లయం చేసుకుంటాడో అతడే యోగి. ఎవరు నిరంతరము ధ్యాననిష్ఠతో ఏకాగ్రతను పొంది అంతర్ముఖుడౌతాడో, వానికి సమాధి స్థితి కలిగి స్వస్వరూప జ్ఞానాన్ని పొందుతాడు. అట్టి స్థితి, కర్మిష్ఠులకన్నా, విద్యాధికులకన్నా, తపస్యులకన్నా, జ్ఞానికే సుసాధ్యము. అట్టి స్థితిని పొందడానికి అనేక మార్గములున్నప్పటికి ధ్యానమందలి మానసిక జపం గొప్పది.
శ్లో కాయ వాఙ్మనః కార్యముత్తమమ్
పూజనం జపశ్చిస్తనం క్రమాత్
అనగా శరీరము, మనస్సు, వాక్కుల చేత చేయబడు సత్కర్మ అనగా శరీరము చేత చేయబడు పూజాది రూపక సేవయు వానిచే చేయబడు, స్తోత్ర, మంత్ర జపాదులకన్నా, మనస్సుచే చేయబడు ధ్యానము క్రమముగా ఉత్తమము. అనగా చిత్తశుద్ధిని ఇచ్చుటలో కాయక కర్మ కంటె వాచక కర్మ దానికంటే మానసిక కర్మ ఉత్తమము. ఇంకను ఈ విషయమై భగవాన్ రమణులు ఈ విధంగా చెప్పారు.
శ్లో ఉత్తమస్తవాత్ ఉశ్ఛమందతః
చిత్తజం జపధ్యాన ముత్తమమ్
అనగా పరమాత్మయొక్క నామ గుణ విశేషములను, వివరించి స్తుతించుట ఉత్తమమగు స్తోత్రమగును. ప్రణవాది మహా మంత్రములను జపించుట వాచికమనియు, పెదవులు కదలియు కదలక అంతరంగంలో చేయు నిశ్శబ్ద జపము ఉపాంశు అనియు, చిత్తమున చింతించుట, మానసికమనియు చెప్పబడెను. ఈ నాలుగింటిలో ఒకదానికంటె ఒకటి మిక్కిలి శ్రేయస్కరము. కావున చివరిదియగు ధ్యానమే ఉత్తమమైనది. ఈ విషయాన్ని గురించి తెలుసుకునే ముందుగా, మనలోని పరాశక్తి రూపమైన కుండలిని శక్తిని ప్రార్థిద్దాం.
శ్లో మూలాధారాదుద్గతామాది శక్తిం
సహస్రార ప్రాంత విశ్రాంత దీప్తిం
బ్రహ్మతత్మైక్య ప్రాపకామోఘకుల్యాం
వందే వందే కుండిలిన్యాఖ్య దేవీమ్
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దత్తక్రియ యోగమను గ్రంథములో మన శరీరమందలి ప్రాణశక్తి కేంద్రాలు లేక పద్మములు గురించి చాలా విస్తారంగా ఉపయుక్తంగా వివరించారు. దేవీ ప్రార్థనలోని రుూ శ్లోకం ఇక్కడప్రస్తావించి తెలుసుకోవడం ఎంతో ఉపయుక్తమేగాక సందర్భోచితంగా కూడా ఉంటుంది.
శ్లో మూలాధారం తథా స్వాధిష్టానం చ మణిపూరకం
అనాహతం విశుద్ధ్యాఖ్యం, అజ్ఞాచక్రం విదుర్బుధాః
తవాధార స్వరూపాణి, కోణ చక్రాణి పార్వతి
త్రికోణ రూపిణీ శక్తిః బిందురూప శివస్మృతః
అవినాభావ సంబంధః తస్మాత్ మిందు త్రికోణయోః
అనగా సర్వోత్కృష్టము విశ్వవ్యాప్తమైన ప్రాణశక్తి, మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, అజ్ఞా చక్రముల (ప్రాణశక్తి కేంద్రముల)లో వ్యాప్తి చెంది ఉంటుంది. సర్వశక్తి స్వరూపిణి, సర్వశక్తిప్రదాయిని, భగవతియైన పార్వతి శక్తిరూపిణిగా త్రికోణ రూపములో ఉంటుంది. శివుడు ఆ త్రికోణము మధ్య బిందు రూపంలో ఉంటాడు. కాబట్టి త్రికోణానికి, బిందువుకు విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. అందుకే మహాకవి కాళిదాసు ‘వాగర్థా వివ సంక్షపోక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’ అంటారు. అది చంద్రుడు- వెనె్నల, సూర్యుడు - కాంతి వంటి సంబంధముగా భావించవచ్చు.
పైన పేర్కొనిన ఆరు చక్రములకు మకుటాయమానముగా ఏడవ చక్రమగు ‘సహస్రార చక్రము’ శిరస్సునందుకలదు. ఇది సర్వోత్కృష్ఠమైనదే కాక, మనలో నిండియున్న విశ్వశక్తి యొక్క ఉచ్ఛస్థానము, చక్రములనగా నాడులు సుషుమ్నానాడితో కలిసే ప్రదేశములే!
మన మహర్షులు మన శరీరంలోని శక్తి కేంద్రాలను యోగశక్తితో చాలా లోతుగా దర్శించి గుర్తించి, చాలా వివరముగా మనకు అందించారు.
మన పురాణ కథలన్నీ సంకేత వాదాలు. మనలోని యోగ కేంద్రాలనే శక్తి పీఠాలంటారు. మన శరీరంలోని మూలాధార చక్రం నుండి, సహస్రార చక్రం వరకు గల సప్త్భూమికలలో యాభై శక్తి పీఠాలున్నాయి. పరమేశ్వరుని ఆధారం చేసుకున్న శక్తి వ్యాపకత్వాన్ని పొందింది. ఆ విధంగా శక్తి వ్యాపించిన కేంద్రాలే పీఠాలు. వ్యాపకత్వమే విష్ణువు. ఆ విధంగా శివ శక్తి-విష్ణుతత్త్వములుగా వ్యాపించిన శక్తి కేంద్రాలను సతీదేవి, దక్షయజ్ఞంలో యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని త్యజించడమనే కథ మార్మికంగా సంకేతించబడింది. క్షేత్రాలలోను మన శరీరంలోని శక్తి క్షేత్రాలు లేక కేంద్రాలలోను వున్న శక్తిని సంకేతార్థంతో గ్రహించాలి. భగవంతుడు భావదర్శి- భావవేద్యుడును గదా.
ప్రాణశక్తి కేంద్రములైన మనలోని ఈ చక్రములు, శరీరాన్ని కోసి చూస్తే, భౌతిక నేత్రానికి కనిపించేవి కావు. వైద్యుల శస్తచ్రికిత్సకి అందేవి కావు. కాని ఈ ప్రాణశక్తి కేంద్రాలైన చక్రములు మన శరీరావయములలోని ప్రాణశక్తిని నియంత్రించి, వాటిని నేరుగా ప్రభావితం చేస్తాయి. మనలో నిక్షిప్తమై వున్న విశ్వశక్తియే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిశరీరమంతటా బాగుగా ప్రసారము జరుగుటకు, చక్రము లేక ప్రాణశక్తి కేంద్రములు, బాగుగా వికసించి యుండవలెను. చక్రములు నిరంతరమూ స్పందిస్తూ ఉంటాయి. ప్రతి చక్రానికి ఒక తత్త్వం ఉంటుంది. శక్తి ఊర్థ్వచలనము కలిగినపుడు, ఏ చక్రమైనా సరిగా జాగృతము కాక, లేక స్వచ్ఛత లోపించినచో ప్రాణశక్తి ప్రసారమునకు ఆటంకం కలిగి, ఆ చక్రాధీన అవయవములకు రుగ్మత కలుగును. ఈ ప్రాణశక్తి ప్రసారము, మన శారీరక, మానసిక, అధ్యాత్మిక పురోగమనముకు ఎంతో అవసరము. చక్రముల ద్వారా ప్రాణశక్తి ప్రసారము అసమతుల్యముగానున్నచో జీవితములోని వివిధ విషయములలో దాని ప్రభావం కనిపిస్తుంది.
ఇంకావుంది...

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590