Others

తరం తరం నిరంతరం (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తరం తరం నిరంతరం ఈ అందం/ ఓహో ఆనందం అందం ఆనందం’ నాకు నచ్చిన పాట. 1957లో విడుదలైన ‘పాండురంగ మహత్మ్యం’ కోసం సముద్రాల జూనియర్ రచించారు. చిత్రంలోని మొత్తం పాటలను అద్భుతమైన సాహిత్యంతో రచించినా, ఈ పాట ప్రత్యేక ఒరవడి కలిగిన హుషారైన పాట. ఈ పాట సాహిత్యంలో లోతైన అర్థాలుంటాయి.
టీవీ రాజు స్వరపరచిన ఈ పాటను ఘంటసాల మధురంగా ఆలపించారు. తెరపై ఎన్టీఆర్ అదే స్థాయిలో అభినయించి మరింత రక్తి కట్టించారు. ఈ పాటలో ‘హ’కారాన్ని పెట్టి అనిర్వచనీయమైన ఆనందాన్ని, మత్తుని కలుగచేసిన ఒరవడి ఘంటసాల వారిదే! ప్రత్యేకతగల ఈ పాటలో ‘అహ హహహా’ అని ఘంటసాల ఆలాపన చేస్తున్నప్పుడు ఆయన కంఠంలో తొణికిసలాడిన జిలుగులు, సొగసులు మహదానందపరుస్తాయ. సాహిత్యపరంగా చూస్తే, మొదటి చరణంలోని ‘మోజులే రేపు చిరునవ్వూ చిందులు/ జాజి చెక్కిళ్ళ సోయగాల విందులూ/ వరద పొంగేనులే వయసు సింగారమూ/ అనుభవించి సుఖించీ తరించరా... హాయ్’. సాహిత్యంతో యువతను ఊరించి ఉసిగొల్పి హుషారెత్తించితే రెండో చరణంలోని ‘మోహమూరించు పరువాల గోలకు/ ముతక తెరచాటు అలవాటు లేలనే/ నేడు వెనుకాడినా రేపు ఒనగూడునా/ అనుభవించీ సుఖించీ, తరించరా హాయ్! అనే వాక్యాలను వివరంగా విశే్లషించవలసి వస్తే శృంగారపరంగా ఎంతో లోతుకెళ్ళి చెప్పాల్సి ఉంటుంది. ఒక్కోసారి అది ఘాటుగా కూడా ఉంటుంది. అంచేత ఆ వాక్యాలను పైపైనుంచే స్ఫురించి ఇందులో ‘లోతు’ఉందని ఓ చిన్న ఆలోచనను రేకెత్తించగలిస్తే చాలు. అందుకే మొదటే పల్లవి ముందు చేరే దానిలో ఆనంద లీలే గోవింద రూపం/ ఈ మాట అంటే పెద్దలకు కోపం’ అని అందరికి చమత్కారంగా చురకంటిచారు రచయిత. ఈ పాటలోని పదాల పొందిక ఎంతటి పామరులకైనా తేలికగా అర్ధమవుతాయ. ఇప్పుడు ఇంతటి సాహిత్యం అందించగలిగే రచయితలు ఒకరిద్దరూ ఉన్నా ఓపిగ్గా రాగశృతిలో వాక్కుశుద్ధిగా ఆలపించేవారు ఉన్నారా అనేది సందేహమే! సాధనచేస్తే సాధించగలరు. సంగీత దర్శకుల విషయంలోనూ ఇంతే! ఈ నవంబర్ 28కి ఈ పాట పుట్టి అరవై రెండేళ్ళు నిండుతున్నా వసివాడని ఈ పాటంటే చాలా ఇష్టం. ఎవరైనా ఈ చిత్రాన్ని ఎప్పుడైనా చూస్తే విలువ తెలుస్తుంది.

- పి.వి.శివప్రసాదరావు, అద్దంకి