Others

పెళ్లెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ మీడియాలో వరలక్ష్మి- విశాల్‌ల ప్రేమ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే వున్నాయి. వాటిని వారిద్దరూ కొట్టిపారేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి తమ పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలపై వరలక్ష్మి మరియు విశాల్‌లు క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం ప్రేమలో లేమని తేల్చి చెప్పారు. వరలక్ష్మి తాజాగా సర్కార్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా వరలక్ష్మి పెళ్లిపై తన అభిప్రాయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. వరలక్ష్మి మాట్లాడుతూ ఒక మహిళకు పెళ్లి అనేది లక్ష్యం కాకూడదు. రాజకీయం లేదంటే ప్రజలకు మంచి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలనుకోవాలి కాని పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా బతకకూడదు అంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుంటే ఎవరికి ఉపయోగం అసలు? ఎందుకు పెళ్లి అంటూ రివర్స్ ప్రశ్నలు సంధించింది. సల్మాన్‌ఖాన్ ఇప్పటివరకూ పెళ్లి చేసుకోలేదు. ఆయన్ను పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటూ ప్రశ్నించనప్పుడు అమ్మాయిలను ఎందుకు పెళ్లి చేసుకోవు అని ప్రశ్నిస్తారు అంది. నా జీవితంలో మగాడు అవసరం లేదనిపిస్తోంది. నేను ఒంటరిగానే జీవితాన్ని సాగించగలను అనే నమ్మకం ఉందని వరలక్ష్మి చెప్పింది. ప్రేమించడం తప్పుకాదు కాని ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకుని జీవితాంతం ఉండటం లేదు. జీవితాంతం ఉండాలనుకున్నప్పుడు పెళ్లిచేసుకోవడంలో తప్పులేదు. పెళ్లి చేసుకున్న తర్వాత మగాళ్లు ఉద్యోగాలు మానెయ్యరు కానీ అమ్మాయిలు మాత్రం చేసే ఉద్యోగాలు మానేయాలి- ఇంకా చాలా విషయాల్లో త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి విషయంలో తనకు పెద్దగా ఆసక్తి లేదని, జీవితాన్ని ఇలాగే గడిపేస్తానంటోంది వరలక్ష్మి.